లక్ష్మి దేవి అస్థిరత్వానికి గల కారణం ఏమిటో తెలుసా ?

కొంతమంది మేము ఎంత న్యాయంగా ఉన్నా సరే లక్ష్మి మాదగ్గర నిలవట్లేదు అనుకుంటారు. అన్యాయం చేసే కొంతమంది దగ్గర ఉంటుంది అని బాధ పడుతున్నారు. కారణం తెలుసుకోండి. లక్ష్మీదేవి ఒకరోజు ఆవులమంద ఉన్నచోటికి వెళ్లి నన్ను మీదగ్గర ఉండనివ్వండి అని అడిగింది. గోవులు లక్ష్మిని చూసి నీవు చంచల స్వభావవు. నిన్ను మాదగ్గర ఉండనివ్వడం కుదరదు అని తెల్చి చేప్పాయి. అప్పుడు తన స్వభావాన్ని ఇలా వివరించింది.

లక్ష్మి దేవిశౌచం, సత్యం, ధర్మం ఎక్కడ ఉంటాయో అదే నాస్థానం. ఇవి లేనిచోట నేను ఉన్నట్టే ఉంటాను కాని ఉండను. పిసినారి దగ్గర ఉంటాను కాని చూస్తూ చూస్తూ ఏమి తినలేరు, తాగలేరు. ఖర్చుచేయలేరు. రోగం వచ్చిన 100రూపాయలు ఖర్చు చేయడానికి వెనకాడతారు. సుఖంగా జీవించలేరు.

ధనవంతుడు దగ్గర కూడా ఉన్నట్టే ఉంటాను. వీరికి తినాలనే ఉన్నా ఉబ్బసం, ఆయాసం, మధుమేహం లాంటి రోగాలు వీరిని పట్టి పీడిస్తాయి. అసత్యం పలికేవాడి దగ్గర, అధర్మం చేసేవాడి దగ్గర ఉంటాను. వీరికి సంపద ఉంటుంది. ఖర్చు కూడా చేస్తారు. జల్సాలు చేస్తారు. కాకపోతే వీరి ముందు తరాలు, వెనుకటి తరాలు నానా రకాలుగా బ్రష్టులైపోతారు.

లక్ష్మి దేవిశౌచం లేని వారి దగ్గర ఉంటాను కాని నిత్య దరిద్రులైపోతారు.పైవారి దగ్గర సంపదల రూపంలో కొన్నాళ్ళు ఉన్నా తరువాత ఆ సంపదలు కూడా హరించేస్తాను. రోగాల రూపంలో, సంతాన రూపంలో అనేక చిత్ర విచిత్రమైన హింసలపాలౌతారు.

అహంకరించే వారిదగ్గర, తల్లిదండ్రులను పట్టించుకోని వారిదగ్గర, వీరి భారాన్ని ఇతరుల పై వేసే వారిదగ్గర, అత్తమామల్ని, కోడళ్ళని, అల్లుళ్ళని ఇల్లరికం తెచ్చుకుని పీడించేవారి దగ్గర, అకారణ నిందలు మోపేవారి దగ్గర, తమ గొప్పలు తామే చెప్పుకునే వారిదగ్గర, కొంచం చేసి ఎక్కువ చేశామని చెప్పుకునే వారిదగ్గర, బ్రాహ్మణులని నిందించే వారి దగ్గర, (కొందఱు బ్రాహ్మణుడు చేడిపోయారని అందరిని నిందించకూడదు. ఎందుకంటే యజ్ఞాయాగాలతోనే లోకాలు తరిస్తాయి .

లక్ష్మి దేవివేదాలు చదివిన ఋత్విక్కులే యజ్ఞాలు చేయాలి. లేదంటే అంతా తలక్రిందులు అవుతుంది.), పర స్త్రీని, పరపురుషుడిని కోరే వారిదగ్గర, ఇతరుల సంపదలు కోరేవారిదగ్గర, తండ్రి ఆస్తుల కోసం కొట్టుకు చచ్చే వారిదగ్గర, సంపదల కోసం నానారకాల గడ్డి కరిచే వారిదగ్గర, మూర్కుల దగ్గర, కఠినాత్ముల దగ్గర, అకారణ కలహ ప్రియుల దగ్గర, వీరిదగ్గర నేను శాశ్వతంగా ఉండను. ఒకవేళ తాత్కాలికంగా ఉన్నట్టు కనపడినా అది పూర్వజన్మ కర్మఫలమే కాని శాశ్వతం కాదు. కర్మబంధం తీరిన వెంటనే తొలగిపోతాను. సిరి సంపదలు అలవాటు పడిన వారు నేను దూరమయ్యాక వారు చేసిన కర్మలకు ఇబ్బందులు పడక తప్పదు.ఇదే నా అస్థిరత్వానికి కారణం అని చెప్పగా గోవులు సంతోషించి లక్ష్మీదేవికి తమలో స్థానాన్ని కల్పించాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,750,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR