అబ్బాయిల్లో మొటిమలు రావడానికి కారణాలు ఏంటో తెలుసా ?

0
1802

అమ్మాయిలతో పోలిస్తే అబ్బాయిలు పెద్దగా చర్మ సంరక్షణ మీద శ్రద్ధ పెట్టరు. ముఖం కోసం బ్యూటీ ప్రొడక్ట్స్ మీద ఎక్కువగా ఖర్చు చేయరు. కానీ ఇప్పుడున్న వాతావరణం, ఆహారపు అలవాట్ల కారణంగా అబ్బాయిలు కూడా చర్మ సమస్యలు ఎదుర్కుంటున్నారు. ముఖ్యంగా ముఖం పై వచ్చే మొటిమలతో ఇబ్బంది పడుతున్నారు.

Pimplesపురుషుల్లో మొటిమలు రావడానికి అనేక కారణాలు ఉన్నాయి. చర్మం జిడ్డుగా మారడం, చర్మ రంధ్రాలు మూసుకుపోవడం, మొటిమలను కలిగించే బ్యాక్టీరియా పెరగడం, ఒత్తిడి, అనారోగ్యకరమైన ఆహార శైలి కారణంగా మొటిమలు ఎక్కువగా వస్తుంటాయి. ఆల్కహాల్ సేవించడం వల్ల కూడా మొటిమలు వస్తాయి. బీరు చల్లగా ఉంది కదా అని ఎక్కువ తాగేస్తే.. అది ఆరోగ్యం మీదే కాకుండా గ్లామర్ మీద కూడా ప్రభావం చూపిస్తుంది.

మొటిమలు తగ్గించే ఫేస్ ప్యాక్:

Pimplesఎవరికైనా మొటిమ వస్తే.. మొదట చేసే పని దాన్ని పిండేయడమే. అలా చేయడం వల్ల ముఖంపై మొటిమల తాలూకు మచ్చలు ఉండిపోతాయి. కాబట్టి మొటిమ వస్తే దాన్ని పిండటం మానేసి ఈ ఫేస్ ప్యాక్ వేసుకోవడం వలన మొటిమలు తగ్గడంతో పాటు.. కొత్తవి రాకుండా ఉంటాయి.

కావాల్సినవి: ముల్తాని మట్టి 4 టేబుల్ స్పూన్లు, అర టీస్పూన్ కర్పూరం పొడి, రెండు టీస్పూన్ల పుదీనా పేస్ట్, టీస్పూన్ గంధం పొడి, రెండు లవంగాలు(వీటిని కూడా పొడి చేసుకోవాలి), రోజ్ వాటర్ మిశ్రమాన్ని కలపడానికి అవసరమైనంత.

Multan Mattiఈ పదార్థాలన్నింటినీ గిన్నెలో వేసి బాగా మిక్స్ చేసి ముఖానికి అప్లై చేసుకోవాలి. ఈ ప్యాక్ పూర్తిగా ఆరిన తర్వాత చల్లటి నీటితో శుభ్రం చేసుకోవాలి. ఈ ప్యాక్ మొటిమలు తగ్గే వరకు ప్రతి రోజూ వేసుకోవాల్సి ఉంటుంది. అప్పుడే మొటిమలు మళ్లీ మళ్లీ రాకుండా ఉంటాయి.

Pimplesఅయితే ఈ ప్యాక్ వేసుకోవడానికి ప్యాచ్ టెస్ట్ చేసుకోవడం మంచిది. చేతి మీద లేదా చెవి వెనక ఈ ప్యాక్ కొంత అప్లై చేసి కాసేపాగాలి. ఆ భాగంలో ఎలాంటి రియాక్షన్స్ అంటే దురద, దద్దుర్లు, మంట వంటివి లేకపోతే.. ఈ ప్యాక్ ముఖానికి అప్లై చేసుకోండి. మంట, దురద వంటివి ఉంటే.. ప్యాక్ అప్లై చేసుకోవద్దు.