బ్రెయిన్ స్ట్రోక్ దారిచేసే కారణాలు ఏంటో తెలుసా ?

మెదడుకు రక్త సరఫరాకు అంతరాయం ఏర్పడినప్పుడు స్ట్రోక్ వస్తుంది. బ్రెయిన్ స్ట్రోక్ లేదా పక్షవాతం రావడానికి అనేక కారణాలు ఉంటాయి. ప్రధానంగా మారుతున్న జీవనశైలి, జంక్‌ఫుడ్స్, ఒత్తిడి, ధూమపానం, మద్యపానం, స్థూలకాయం, మధుమేహం, హైబీపీ వంటి కారణాలతో ఎక్కువ మంది ఈ వ్యాధి బారిన పడుతున్నారు. బ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన తర్వాత కూడా సకాలంలో సరైన చికిత్స అందిస్తే మరణించే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి.

causes of brain strokeఅయితే కొన్నిసార్లు బ్రెయిన్ స్ట్రోక్ ని ముందే పసిగడితే ప్రమాదం నుంచి తప్పుకోవచ్చు. మరి అది ఎలాగో ఇప్పుడు తెలుసుకుందాం.ప్రమాదం జరగడానికి గంటలు, రోజులు ముందే మనకు లక్షణాలు కనిపిస్తుంటాయి. వాటిపై అవగాహన ఉంటే సమస్యను ముందుగానే పసగట్టొచ్చు.

కంటి చూపులో సమస్యలు :

causes of brain strokeబ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ముందు కంటిచూపులో కచ్చితంగా తేడా కనిపిస్తుంది. స్పష్టంగా కనిపించే కళ్లు మసకబారుతాయి.

ముఖం, చేతులు, కాళ్లు మొద్దుబారడం:

causes of brain strokeసాధారణమైన లక్షణమే అయినా.. బ్రెయిన్ స్ట్రోక్ ముందు ఇలా జరుగుతుంది. ముఖం, కాళ్లు, చేతులు ఓ వైపు మాత్రమే మొద్దుబారినట్లు కనిపిస్తుంది.

హార్మోన్ స్థాయి పడిపోవడం:

causes of brain strokeఅడ్రినల్ గ్రంథుల్లో ఉత్పత్తి అయ్యే డీహెచ్ఈఏ హార్మోన్ వెంటనే తగ్గిపోతుంది. దాని కారణంగా ఈస్ట్రోజన్లు, ఆండ్రోజన్స్ తగ్గిపోతుంటాయి.

శ్వాసలో సమస్య:

causes of brain strokeఛాతీ నొప్పితో పాటు శ్వాసలోనూ సమస్యలు వస్తుంటాయి. అది స్ట్రోక్ వచ్చే ముందు లక్షణం కావొచ్చు.

వికారం లేదా వాంతులు:

causes of brain strokeమెదడులోని కొన్ని భాగాల్లో వచ్చిన సమస్యల కారణంగా వాంతులు.. వికారంగా ఉండటం వంటివి కనిపిస్తాయి.

హెల్యూసినేషన్:

causes of brain strokeచూపులో సమస్యలతో పాటు భ్రమ పడుతున్నట్లుగా కూడా ఉంటుంది. అప్పటికే పోస్టిరియర్ భాగంలో సర్కూలేషన్ సమస్య వచ్చినట్లు అర్థం చేసుకోవచ్చు.

అధిక రక్తపోటు:

causes of brain strokeఅధిక రక్తపోటు చాలా సమస్యలకు దారితీస్తుంది. దాని వల్ల కూడా రక్తం గడ్డకట్టడం వంటివి జరగొచ్చు.

తలనొప్పి:

causes of brain strokeబ్రెయిన్ స్ట్రోక్ వచ్చిన చాలామంది ఆడవాళ్లలో కనిపించిన లక్షణం తలనొప్పి. ఎక్కువమందికి తలవెనుక భాగంగలోనే అలా అనిపిస్తుందట. ఒక్కోసారి స్పృహ కూడా కోల్పోయి పడిపోతుంటారట.

ఎక్కిళ్లు :

causes of brain strokeఓహియో స్టేట్ యూనివర్సిటీ వెక్సనర్ మెడికల్ సెంటర్ జరిపిన సర్వే ప్రకారం.. పది శాతం మంది మహిళలకు ఎక్కిళ్లు వచ్చాయట. అలా అని ఎక్కిళ్లు వచ్చిన ప్రతిసారి ఎమర్జెన్సీ రూంకు వెళ్లాలని కాదు.

అకస్మాత్తుగా ప్రవర్తనలో మార్పులు:

causes of brain strokeమహిళల్లో స్ట్రోక్ వచ్చే ముందు వారి ప్రవర్తనలో మార్పలు గమనించొచ్చని నిపుణులు అంటున్నారు. ఉన్నట్లుండి కొన్ని విషయాలు మర్చిపోవడం, వ్యక్తిత్వంలో ంమార్పులు తెలుస్తుంటాయి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,600,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR