రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏర్పడటానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

0
253

రుమటాయిడ్ ఆర్థరైటిస్ అనేది దీర్ఘకాలిక రుగ్మత.ఇది కీళ్ళును ఎక్కువుగా ప్రభావితం చేస్తుంది. కొందరు వ్యక్తులలో, చర్మం, కళ్ళు, ఊపిరితిత్తులు, గుండె మరియు రక్తనాళాలతో సహా అనేక రకాల శరీర వ్యవస్థల యొక్క పరిస్థితి ని నాశనం చేస్తుంది. మీ రోగనిరోధక వ్యవస్థ తప్పుగా పని చేస్తునప్పుడు మీ స్వంత శరీర కణజాలంపై దాడి చేసినప్పుడు, ఆటోఇమ్యూన్ డిజార్డర్ కారణం చేత రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఏర్పడుతుంది.

causes of rheumatoid arthritisరుమటాయిడ్ ఆర్థరైటిస్ కీళ్ళ యొక్క లైనింగ్ ను ప్రభావితం చేస్తుంది, చివరకు ఎముక క్షయం మరియు కీళ్ళ వైకల్యం ఫలితంగా ఒక బాధాకరమైన వాపు కలిగి ఉంటుంది. రుమటాయిడ్ ఆర్థరైటిస్ కి సంబంధించిన వాపు శరీరంలోని ఇతర భాగాలను కూడా పాడుచేస్తుంది. కొత్త రకాల మందులు చికిత్స ఎంపికలు మెరుగుపడినప్పటికీ, తీవ్రమైన రుమటాయిడ్ ఆర్థరైటిస్ ఇప్పటికీ కొంత మందిలో శారీరక వైకల్యాలను కలిగిస్తుంది.

causes of rheumatoid arthritisఈ రుగ్మత యొక్క ప్రధాన సంకేతాలు మరియు లక్షణాలు:

 • ఉదయంపూట కీళ్లలో నొప్పి ఉంటుంది
 • రోజంతా నిరంతరం జరిగే కీళ్లకదలికల కారణంగా ఉదయం ఉండే కీళ్లనొప్పి రోజులో తర్వాత సమయంలో మాయమైపోతుంది.
 • అలసటగా అనిపిస్తుంది
 • రక్తహీనత
 • బాధాకరమైన కీళ్ళు
 • కళ్ళు మరియు నోరు పొడిబారిపోతుంది
 • మోచేతులు, చేతులు, మోకాలు మరియు ఇతర కీళ్ళలో గట్టిగా గడ్డలు కడతాయి
 • కీళ్ళలో వాపు మరియు కీళ్లు ఎరుపుదేలడం
 • ఛాతి నొప్పి
 • జ్వరం మరియు బరువు తగ్గటం

బాధాకరమైన ఈ రుగ్మత ఏకకాలంలో చేతులు లేదా పాదాలను దెబ్బ తీస్తుంది. ఇది 30 ఏళ్ల వయసు పైబడ్డవాళ్లలో సంభవిస్తుంది. మరియు పురుషుల కంటే స్త్రీలకే ఈ వ్యాధి ఎక్కువగా వస్తుంటుంది. కొన్నిసార్లు, నొప్పి మరియు అలసటతో పాటు వాపు సంభవించవచ్చు.

causes of rheumatoid arthritisదీనికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసుకుందాం. ఈ రుగ్మతను ప్రేరేపించే ఖచ్చితమైన కారకాలు తెలియకపోయినా, కింది కారకాలు ఈ వ్యాధికి పూర్వగామిగా పరిగణించబడతాయి:

 • జన్యు ఉత్పరివర్తనలు (జీన్ మ్యుటేషన్)
 • తండ్రి కుటుంబంలో రుమటాయిడ్ కీళ్లనొప్పుల (RA) చరిత్ర ఉండటం
 • అంటు వ్యాధులు
 • హార్మోన్ల మార్పులు
 • భావోద్వేగ బాధ
 • ధూమపానం మరియు మద్యపానం ఎక్కువగా తీసుకోవటం
 • కాలుష్య కారకాలకు బహిర్గతమవడం

 

SHARE