Home Health తుంటి నొప్పి యొక్క లక్షణాలు ఏంటో తెలుసా ?

తుంటి నొప్పి యొక్క లక్షణాలు ఏంటో తెలుసా ?

0

శరీరంలో అన్నిటి కన్నా పెద్ద నరం సయాటికా. ఇది కింది వీపు భాగం నుంచి పిరుదుల మీదుగా కాలు వెనక భాగం గుండా పాదాల వరకు ప్రయాణిస్తుంది. ఈ నరం ఇతర ఐదు నరాల (ఎల్‌4, ఎల్‌5, ఎస్‌1,ఎ్‌స2,ఎస్‌3) సమూహాలతో ఏర్పడి ఉంటుంది. వెన్నుపూస లోపల నుంచి ప్రయాణించు నరాలపైన ఒత్తిడి వల్ల కాలు వెనక భాగం నొప్పికి గురవుతుంది. దీనినే సయాటికా నొప్పి అంటారు.

causes of sciatica painఈ నొప్పి వీపు భాగంలో నుంచి పాదం వరకు ఉంటుంది. తిమ్మిర్లు, స్పర్శ తగ్గిపోవడం, మంటలు, నడకలో మార్పు వంటి లక్షణాలు కనిపిస్తాయి. సయాటికా నొప్పి తట్టుకోవడం చాల కష్టం. ప్రపంచవ్యాప్తంగా కొన్ని లక్షల మంది ఈ సమస్యతో తమ విధులు సరిగ్గా నిర్వర్తించలేకపోతున్నారు. మరి దీనికి గల కారణాలు ఏమిటి అనేది ఇప్పుడు తెలుసుకుందాం…

ఉద్యోగం:

కొంత మంది బరువులు ఎత్తే ఉద్యోగాన్ని చేస్తూ ఉంటారు. ఎక్కువ బరువులు మోయడం లేదా దూర ప్రాంతాల వరకు డ్రైవింగ్ చేయడం వంటి కారణాల వల్ల కూడా సయాటిక రావచ్చు. అయితే సరైన కారణమంటూ దీనికి లేదు.

వయసు:

వయసు మారే కొద్దీ స్పైన్ లో మార్పులు కారణంగా ఇది రావచ్చు. అయితే సయాటిక రావడానికి వయసు ప్రభావం కూడా చూపుతుంది. కాబట్టి వయసు పెరిగే కొద్ది ఇది రావచ్చు.

ఎక్కువ సమయం కూర్చోవడం:

ఎవరైతే ఎక్కువ సమయం కూర్చుంటూ ఉంటారో వాళ్ళలో కూడా సయాటికా వస్తుంది. కాబట్టి వీలైనంత వరకు కదులుతూ ఉండటం మంచిది.

డయాబెటిస్:

సయాటికా నొప్పి రావడానికి గల కారణం డయాబెటిస్ కూడా అవ్వచ్చు. దీని వల్ల ఏమవుతుందంటే బాడీ బ్లడ్ షుగర్ ని ఎక్కువగా తీసుకుంటూ ఉంటుంది. దీని ద్వారా నెర్వ్ డ్యామేజ్ అవుతుంది.

ఒబిసిటీ:

ఊబకాయం వల్ల కూడా సయాటికా వస్తుంది. స్పెయిన్ మీద ఒత్తిడి ఎక్కువగా పడితే సయాటికా కి దారి తీస్తుంది. ఈ నొప్పి నుంచి బయట పడాలంటే ఏం చేయాలి..?చిన్న చిన్న టిప్స్ పాటించడం వల్ల ఈ నొప్పి నుంచి బయటపడవచ్చు.

వ్యాయామం చేయడం:

రెగ్యులర్గా వ్యాయామం చేయడం వల్ల నొప్పి తగ్గుతుంది. తప్పకుండా ప్రతిరోజూ వ్యాయామం చేస్తూ ఉండండి. ప్రతిరోజూ వ్యాయామం చేయడం వల్ల ఈ నొప్పి నుంచి మీరు సులువుగా బయటపడడానికి వీలు ఉంది.

Exit mobile version