థైరాయిడ్ క్యాన్సర్ కు దారితీసే కారణాలు ఏంటో తెలుసా ?

క్యాన్సర్ లో చాలా రకాలు ఉన్నాయి కొన్ని రకాలు సామాన్యులకు అవగాహన ఉంటుంది. మరికొన్ని చాల అరుదుగా వింటుంటాం అలాంటిదే థైరాయిడ్ క్యాన్సర్ వేగంగా విస్తరిస్తోన్న ఆ రకం క్యాన్సర్.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి… మారుతున్న ఆహారపు అలవాట్లు, జీవనశైలి కారణంగా క్యాన్సర్ భారిన పడే వారి సంఖ్య ఏటా పెరుగుతోంది. ఏటా లక్షలాది మంది ఈ ప్రాణాంతక వ్యాధి భారీన పడి ప్రాణాలు కోల్పోతున్నారు.

థైరాయిడ్ కాన్సర్ :

thyroid cancerవేగంగా విస్తరిస్తోన్న ఆ రకం క్యాన్సర్.. ఈ లక్షణాలు ఉంటే వెంటనే అలర్ట్ అవ్వండి. క్యాన్సర్ ప్రధానంగా గర్భాశయ, నోరు–గొంతు, రొమ్ము, ప్రేగులు, కాలేయం, ఊపిరితిత్తులు, జీర్ణకోశం వంటి ప్రదేశాల్లో వస్తుంటుంది. అయితే, వీటన్నింటిలో కెల్లా గొంతు ప్రదేశంలో వచ్చే థైరాయిడ్ క్యాన్సర్ ప్రపంచవ్యాప్తంగా వేగంగా విస్తరిస్తోందని నిపుణులు చెబుతున్నారు.

ఇటీవలి కాలంలో, థైరాయిడ్ క్యాన్సర్ భారీన పడే భారతీయుల సంఖ్య విపరీతంగా పెరిగిందని, గత 35 ఏళ్లలో దీని ప్రభావం మూడు రెట్లు పెరిగిందని అనేక అధ్యయనాల్లో తేలింది. అయితే, పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదం నాలుగు రెట్లు ఎక్కువగా ఉన్నట్లు అధ్యయనాల్లో స్పష్టమైంది.

thyroid cancerఇది చాలా ఆందోళనకర పరిణామని, థైరాయిడ్ క్యాన్సర్ పట్ల మహిళలు మరింత అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇది ప్రధానంగా హార్మోన్లను ఉత్పత్తి చేసే మెడ భాగంలోని థైరాయిడ్ గ్రంథిని ప్రభావితం చేస్తుందని వారు స్పష్టం చేస్తున్నారు. పురుషుల కంటే మహిళల్లో థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదం ఎక్కువగా ఉండటానికి అనేక కారణాలున్నాయి.

సాధారణంగా మహిళలు ఎక్కువగా రొమ్ము క్యాన్సర్ భారీన పడుతుంటారు. అయితే, ఈ మధ్య కాలంలో థైరాయిడ్ క్యాన్సర్ భారీన పడే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. 35–60 సంవత్సరాల మధ్య వయస్సు గల మహిళల్లో అత్యంత సాధారణ రూపంలో ప్రారంభమయ్యే ఈ క్యాన్సర్.. మొదట్లో ఎటువంటి లక్షణాలను చూపించదు.

thyroid cancerకానీ నెమ్మదిగా ఇది తీవ్రమై మెడపై నొప్పి, వాపుకు కారణమవుతుంది. అందువల్ల, ప్రాధమిక దశలోనే దీన్ని గుర్తించాలని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు.

అయోడిన్ ఎక్కువగా ఉండే ఆహార పదార్థాలను తీసుకోవడం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం, మెడికల్ డయాగ్నస్టిక్స్ నుండి వచ్చే రేడియేషన్ వంటివి థైరాయిడ్ క్యాన్సర్‌కు ప్రధాన అంశాలని, వీటితో పాటు కుటుంబంలో జన్యు మ్యుటేషన్స్, రేడియేషన్‌కు గురికావడం వంటివి కూడా థైరాయిడ్ క్యాన్సర్‌కు దారి తీస్తాయని వారు చెబుతున్నారు.

thyroid cancerథైరాయిడ్ క్యాన్సర్ లక్షణాలు :

  • కారణం లేకుండానే గొంతులో వాపు తీవ్రతరం కావడం.
  • మెడపై ఒక ముద్దలాగా ఎటువంటి నొప్పిలేని గడ్డ ఏర్పడటం.
  • ఆహారం మింగడానికి ఇబ్బందులు ఏర్పడటం.

థైరాయిడ్ క్యాన్సర్ చికిత్స :

thyroid cancerక్యాన్సర్ భారీన పడ్డ గ్రంథిని శస్త్రచికిత్స ద్వారా తొలగించడమే దీన్ని రూపుమాపేందుకు ఏకైక మార్గమని డాక్టర్లు స్పష్టం చేస్తున్నారు. థైరాయిడ్ క్యాన్సర్ ప్రమాదాన్ని సమయానికి గుర్తించడం ద్వారా తొందరగా బయటపడొచ్చని, థైరాయిడ్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉందనే అనుమానం వచ్చినప్పుడల్లా డాక్టర్ను సంప్రదించడం మంచిదని వారు సలహాలిస్తున్నారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,740,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR