Home Health నెయిల్‌ పాలిష్‌ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో తెలుసా ?

నెయిల్‌ పాలిష్‌ వల్ల కలిగే ప్రమాదాలు ఏంటో తెలుసా ?

0

నెయిల్‌ ఫాలిష్‌ అంటే ఇష్టపడని అమ్మాయిలు దాదాపుగా ఉండరు. చేతికి అందమైన గోళ్ళు కలిగి… వాటికి ఆకర్షణీయమైన నెయిల్ పాలిష్ పెట్టుకొంటే ఎంతో అందంగా కనిపిస్తాయి. ఆ అందం మన వేసుకొనే నెయిల్ పాలిష్ కలర్ మీద, వేసుకొనే విధానం మీద ఆధారపడి ఉంటుంది. ఈ మధ్య హీరోయిన్స్‌, మోడల్స్‌ అనే కాకుండా అందరూ నెయిల్‌ ఫాలిష్‌ను తెగ వాడేస్తున్నారు.

Do you know the dangers of nail polishఒక్కో వేలికి ఒక్కో రంగు అంటూ సరికొత్తగా ప్రయత్నిస్తున్నారు. నెయిల్‌ పాలిష్‌ ఒక్క రోజు పెట్టుకుని, దాన్ని తొలగించి మరో రంగు నెయిల్‌ పాలిష్‌ లు వాడుతూ ఉంటారు. వేసుకున్న డ్రస్‌కు మ్యాచింగ్‌గా, వెళ్తున్న కార్యక్రమానికి మ్యాచింగ్‌గా నెయిల్‌ పాలిష్‌లను వాడుతున్నారు. కానీ నెయిల్‌ పాలిష్‌ వల్ల చాలా ప్రమాదాలు ఉన్నాయని ఎవరికైనా తెలుసా?

ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 2500లకు పైగా నెయిల్‌ పాలీష్‌లు ఉన్నాయి. వీటిల్లో దాదాపు సగం కంపెనీలు నెయిల్‌ పాలీష్‌ మన్నికగా ఉండేందుకు, ఎక్కువ కాలం ఉండేందుకు ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ అనే రసాయనం వాడుతున్నారు. ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ రసాయనం మానవ శరీరంపై చాలా బలంగా ప్రభావం చూపుతుందని పరిశోదనల్లో వెళ్లడి అయ్యింది. మానవ శరీరంలోని హార్మోన్‌లపై సదరు రసాయనం ప్రభావం చూపడంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ట్రైఫెనైల్‌ ఫాస్పేట్‌ ఎక్కువగా ఉండే నెయిల్‌ పాలిష్‌లను వాడటం వల్ల మనిషి శరీరంలోని హార్మోన్‌లు ప్రభావితం అవుతాయట.

ఆ వాసన ప్రతి రోజు చూసే వారు మెల్ల మెల్లగా బరువు పెరుగుతారని, మరీ ఎక్కువగా వాడితే మాత్రం బరువు మరీ ఎక్కువ పెరుగుతారని అంటున్నారు. నెయిల్‌ పాలీష్‌లను చర్మంకు అంటుకోకుండా వేసుకోకుంటే సగం వరకు ఇబ్బందులను తగ్గించుకోవచ్చు అని, అయితే ఎక్కువ శాతం మంది చర్మంకు కూడా నెయిల్‌ పాలీష్‌లను వేయిస్తారని, అది ఏమాత్రం కరెక్ట్‌ కాదని శాస్త్రవేత్తలు అంటున్నారు. చర్మంకు అంటిన 10 నుండి 14 గంటల్లోనే నెయిల్‌ పాలీష్‌లోని టీపీహెచ్‌పీ పని చేయడం ప్రారంభించి బరువు పెరిగేలా చేస్తుందని అంటున్నారు. అందుకే ఇకపై నెయిల్‌ పాలీష్‌లతో జాగ్రత్తగా ఉండండి. ముఖ్యంగా చర్మంకు నెయిల్‌ పాలీష్‌ అంటకుండా చూసుకోండి.

 

Exit mobile version