Home Unknown facts సంక్రాంత్రి గంగిరెద్దుల వెనుక ఉన్న పురాణ పురాణ కథ తెలుసా ?

సంక్రాంత్రి గంగిరెద్దుల వెనుక ఉన్న పురాణ పురాణ కథ తెలుసా ?

0

సంక్రాంతి పండగ అనంగానే ముగ్గులు,హరిదాసులు ,గంగిరెద్దుల సందడి గుర్తొస్తుంది. సంక్రాంత్రి గంగిరెద్దుల వెనుక కూడా ఓ కథ ఉంది. పూర్వం గజాసురుడనే రాక్షసుడు శివుని కటాక్షం కోసం ఘోరమైన తపస్సు చేశాడట. శివుడు ప్రత్యక్షమై ఏమి కావాలని వరమడిగాడట. అందుకు గజాసురుడు మీరు నా గర్భంలో ప్రవేశించి, పూజలందుకోవాలి అని వరం అడుగుతాడు. అందుకు శివుడు అంగీకరించి అతని గర్భంలో ప్రవేశిస్తాడు. అంతర్ధానమైన పతి దేవుని జాడ తెలియక పార్వతీ దేవి దుఃఖించి గజాసురుని గర్భంలో ఉన్నట్లు తెలుసుకుని పతిని విముక్తిని చేయమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది.

సంక్రాంతి గంగిరెద్దు వెనుక కథఅప్పుడు విష్ణువు గంగి రెద్దుల మేళాన్ని రూపకల్పన చేశాడు. నంది కేశ్వరుణ్ణి గంగి రెద్దుగా అలంకరించి బ్రహ్మాది దేవతలతో వివిధ వాయిద్యాలైన డోలు, సన్నాయి, బూర, సుత్తి లను ధరింప చేసి, తాను మేళానికి నాయకత్వం వహించి గజాసురుని చెవుల బడి తన సమక్షంలో ఆ ఆటను ప్రదర్శించ మని కోరుతాడు. అందు కోసమే ఎదురు చూసిన విష్ణుమూర్తి అద్భుతంగా ఆటను నిర్వహించాడు.

గజాసురుడు ఆనంద భరితుడై ఏం కావాలో కోరుకో మంటాడట. తన పాచిక పారిందనుకున్న హరి ఇది శివుని వాహనమై న నంది తన స్వామికి దూరమై విలపిస్తూ ఉంది. ఆ స్వామిని నంది కడకు చేరనియ్యి అని కోరతాడట. ఆలోచనలో పడ్డ గజాసురుడు, ఇతను అసుర సంహారి యైన చక్రధారి అనీ, ఇక తనకు మృత్యువు తప్పదనీ తెలుసుకున్న గజాసురుడు శివుని ప్రార్థించి, నందీశ్వరునికి ఎదురుగా నిలుస్తాడట. అంతలో విష్ణుమూర్తి నందిని ప్రేరేపించగా, కొమ్ములతో గజాసురుణ్ణి కుమ్మగా గజాసురుని గర్భం నుండి శివుడు బయట పడతాడు. ఆడిన మాట తప్పని గజాసురుని శిరస్సు అన్ని లోకాల్లో పూజ లందుకుంటుందనీ, అతని చర్మాన్ని తాను మేన ధరిస్తాననీ చెప్పి శివుడు గజాసురునికి శివైక్యాన్ని ప్రసాదించాడు. ఆ గంగిరెద్దులను లోకంలో తిప్పుకొమ్మని గంగిరెద్దుల వారికి గంగిరెద్దులతో పాటు వాయిద్యాలు కూడా యివ్వడం జరుగుతుంది. (గంగ యొక్క ఎద్దు గంగిరెద్దు) అప్పటి నుండి గంగిరెద్దులను తిప్పుకొని బ్రతుకు తున్నట్లు పెద్దలు చెప్తారు.

వీరు ప్రాంతీయ బాణీలలో జానపద పాటలు పాడుతారు. సన్యాసమ్మ పాట, రాములవారి పాట, ఈశ్వరమ్మ పాట, గంగరాజు పాట, వీరగున్నమ్మ పాట , మాలవారి మంగమ్మ మొదలగు పాటలు బాణీకట్టి పాడతారు. సినిమా పాటలు కూడా పాడతారు. తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలలో కూడా గంగిరెద్దుల వారున్నారు. అయినా వీరంతా తెలుగువారే. మహారాష్ట్రలో వీరిని నందివాలా అంటారు.

 

Exit mobile version