శరీరంలో రక్తకణాల విధులు ఏంటో తెలుసా ?

మానవ శరీరం యొక్క అత్యంత కీలకమైన కణజాలాలలో (టిష్యూలలో) రక్తం ఒకటి. రక్త నాళాల నెట్‌వర్క్ శరీరాన్ని అంతా కలుపుతుంది, తద్వారా ఇది ఒకే యూనిట్‌గా పనిచేస్తుంది. రక్తం శరీరమంతా అవసరమైన పోషకాలు మరియు ఖనిజాలను సరఫరా చేయడమే కాక, వ్యర్ధాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. రక్తంలో ఉండే తేల్లరక్తకణాలు మరియు యాంటీబాడీలు శరీరాన్ని వివిధ ఇన్ఫెక్షన్లు మరియు వ్యాధుల నుండి రక్షిస్తాయి.

రక్తకణాలశరీరంలో రక్తకణాల విధులు ఏంటో తెలుసుకుందాం. ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ తీసుకొని శరీరంలోని వివిధ భాగాలకు అందించడం. శరీర ఉష్ణోగ్రత మరియు ఎలక్ట్రోలైట్ సమతుల్యతను నిర్వహించడం. అదనంగా, రక్తంలోని ప్లేట్‌లెట్లు గాయం తర్వాత రక్తస్రావం అధికంగా జరగకుండా రక్తం గడ్డకట్టేలా చేస్తాయి.

రక్తకణాలజీవనశైలి, పర్యావరణం మరియు కొన్ని రకాల ఆహారాలు రక్తంలో కొన్ని విష పదార్థాలు/టాక్సిన్లు పేరుకుపోవడానికి దారితీయవచ్చు. అవి ఫ్రీ రాడికల్స్, భారీ లోహాలు (heavy metals) లేదా ఇన్ఫెక్షన్ కలిగించే బ్యాక్టీరియా కావచ్చు. శరీర అవయవాలు, ముఖ్యంగా ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాల సరిగ్గా పనిచేయకపోవడం వల్ల రక్తంలో పోగుపడే వ్యర్థ ఉత్పత్తులు కూడా ఇందులో ఉంటాయి.

రక్తకణాలఈ మూడు అవయవాలు (ఊపిరితిత్తులు, కాలేయం మరియు మూత్రపిండాలు) ప్రధానంగా రక్తాన్ని శుద్ధి చేయడానికి మరియు శుభ్రపరచడానికి బాధ్యత వహిస్తాయి. కాలేయం హానికరమైన రసాయన సమ్మేళనాలను తొలగించి రక్తాన్ని డిటాక్సిఫై చేస్తుంది. వాటిని (టాక్సిన్లను) మూత్రం ద్వారా బయటకు వెళ్ళేలా చేస్తుంది. మూత్రపిండాలు రక్తాన్ని ఫిల్టర్ చేస్తాయి మరియు అదనపు వ్యర్థాలను తొలగిస్తాయి. మరోవైపు, ఊపిరితిత్తులు రక్తాన్ని ఆక్సిజనేట్ చేయడంలో మరియు రక్తప్రవాహం నుండి హానికరమైన వాయువులను తొలగించడంలో సహాయపడతాయి.

రక్తకణాలరక్తాన్ని శుద్ధి చేయడంలో అనేక రకాల ఆహార పదార్థాలు చాలా విధాలుగా ప్రభావవంతంగా ఉంటాయి, అవి:

  • రక్తాన్ని శుద్ధి చేయడానికి బీట్‌రూట్ చాల ఎఫెక్టివ్ గ పనిచేస్తుంది.
  • రక్త శుద్దీకరణ కోసం కాఫీ పొడి సహాయాడుతుంది.
  • రక్త శుద్ధికారులుగా ఆక్రోటు కాయలు పని చేస్తాయి.
  • బ్లడ్ ప్యూరిఫైయర్‌గా బ్రోకలీ ఉపయోగపడుతుంది.
  • రక్త శుద్దీకరణ కోసం ఉసిరి ఎంతో మేలు చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR