సోంపు గింజల్లో ఉన్న ఔషధ గుణాలు వల్ల మనకు కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసా ?

భోజనం చేసిన తర్వాత సోంపు తినడం చాలామందికి ఉండే అలవాటు. హోటల్‌కి వెళితే చివర్లో బిల్‌తో పాటు ఇచ్చే సోంపు అంటే దాదాపు అందరికి ఇష్టమే. భోజనం పూర్తి చేసిన తర్వాత వెయిటర్.. వాటిని ఎప్పుడు తీసుకొస్తాడా అని చూస్తాం. కొందరైతే హోటల్ నుండి వెళ్ళేటప్పుడు కూడా ఓ గుప్పెడు తీసుకెళుతుంటారు. అదో సరదా. నిజానికి సోంపు గింజల్లో ఎన్నో ఔషధ గుణాలున్నాయి. ఇప్పుడు సోంపుతో కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏమిటో తెలుసుకుందాం.

health benefits of anise seedsభోజనం చేసాక సోంపు తినడం వలన ఆహారం సులభంగా జీర్ణమవుతుంది.. ఎసిడిటీ రాకుండా ఉంటుంది. ఇది మనకు తెలిసింది మాత్రమే. కానీ సోంపు తినడం వల్ల మనకు సౌందర్యపరంగా, ఆరోగ్యపరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి. బాగా నిద్రపట్టేందుకు 250 మిల్లి లీటర్ల నీటిలో 10 గ్రాముల సోంపు గింజలను వేసి సగం నీరు మిగిలేలా సన్నని మంటపై మరిగించి గోరువెచ్చగా అయిన తర్వాత వడబోసి 100 మి. లీటర్లు కాచిన పాలు ఒక టీ స్పూన్ నెయ్యి, ఒక టీ స్పూన్ పటికబెల్లం పొడి కలిపి రాత్రి పడుకునే సమయంలో సేవించాలి.

health benefits of anise seedsదగ్గు, ఆయాసం, జలుబు తగ్గేందుకు, సోంపు గింజల పొడి 25 గ్రాములు, ఆయుర్వేద ఔషధ విక్రయశాలల్లో దొరికే అతిమధుర చూర్ణం 50 గ్రాములు, పటికబెల్లం పొడి 75 గ్రాములు కలిపి వుంచుకుని రోజుకి రెండుపూటల పూటకు అర టీ స్పూను పొడిని 100 మిల్లీ లీటర్ల గోరువెచ్చని నీటిలో కలిపి సేవించాలి.

health benefits of anise seedsసోంపు తీసుకోవడం వల్ల విటమిన్ సి, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం, మాంగనీస్, కాపర్, పాస్ఫరస్, జింక్, విటమిన్ ఎ, థయమిన్, రైబోఫ్లావిన్, నియాసిన్, పీచుపదార్థంతో పాటు కొద్ది మొత్తంలో క్యాలరీలు సైతం లభిస్తాయి. దీనిలో ఉండే విటమిన్ సీకి నీటిలో కరిగే తత్వం ఉంటుంది. ఇది రోగనిరోధక వ్యవస్థ మరింత బలపడటానికి సహాయపడుతుంది. సోంపులో ఉండే మెగ్నీషియం మెటబాలిజం ప్రక్రియను మెరుగుపరుస్తుంది. అంతేకాదు.. మధుమేహాన్ని నియంత్రిస్తుంది. అలాగే ఎముకల ఎదుగుదలకు తోడ్పడుతుంది. సోంపు ద్వారా మనకు అందే పొటాషియం, మాంగనీస్ సైతం ఎముకలు దృఢంగా మారేందుకు దోహదం చేస్తాయి.

health benefits of anise seedsఆరోగ్యనికే కాదు చర్మ రక్షణ కోసం కూడా సోంపు బాగా ఉపయోగపడుతుంది. సోంపు గింజల్లో ఉండే యాంటిసెప్టిక్, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు మొటిమలు రావడానికి కారణమైన బ్యాక్టీరియాను సంహరిస్తాయి. అంతేకాదు.. మొటిమలతో పాటు వచ్చే వాపు, నొప్పిని కూడా తగ్గిస్తాయి. దీనికోసం సోంపు గింజల పొడిలో కొద్దిగా తేనె, పెరుగు కలిపి మొటిమలపై రాసుకోవాలి. పావుగంట తర్వాత శుభ్రం చేసుకొంటే మంచి ఫలితం కనిపిస్తుంది.

health benefits of anise seedsసోంపుని క్లీన్సర్ లా కూడా ఉపయోగించొచ్చు. చర్మంపై ఉన్న మురికి, జిడ్డు, మృత‌క‌ణాలు.. వీటన్నింటి కారణంగా చర్మ రంధ్రాలు మూసుకుపోతాయి. ఇవేమీ లేకుండా శుభ్రం చేసుకొన్నప్పుడే చర్మం ఆరోగ్యంగా, అందంగా ఉంటుంది. చర్మరంధ్రాల్లో చేరిన మురికిని సోంపు గింజలతో తయారుచేసిన ప్రత్యేకమైన మిశ్రమంతో తొలగించవచ్చు. దీనికోసం గిన్నెలో వేడి నీరు పోసి.. అందులో పెద్ద చెంచాడు సోంపు వేసి 20 నిమిషాలు నానబెట్టాలి. చల్లారిన తర్వాత రెండు చుక్కల టీట్రీ ఎస్సెన్సియల్ ఆయిల్ సైతం కలపాలి. ఈ మిశ్రమాన్ని గాజు సీసాలో వేసి మూత గట్టిగా బిగించాలి. ఈ నీటిలో దూదిని ముంచి ..దానితో ముఖం తుడుచుకొంటే చర్మంపై చేరిన మురికి మొత్తం వదిలిపోతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR