పండ్లు, కాయగూరలు, గింజలు పప్పులు, కందమూలాలు, మానవుడికి ప్రకృతి ప్రసాదించిన అపురూపమైన వరం. ఆయా సీజన్లలో పండే పండ్లను ఆరగించడం మనకు తరతరాలుగా తెలుసు. అన్నంతో అవసరం లేకుండా ప్రకృతిసిద్ధమైన పండ్లు, కూరగాయలు ఇతర త్రునధన్యాలను ఆహారంగా ఆహరంగా తీసుకుని జీవించినట్లయితే శరీరానికి కావససిన అన్నిరకాల పోషకాలు లభిస్తాయి… ఇదే ఉత్తమమైన జీవన విధానమని పకృతి వైద్యుల నమ్మకం.
ప్రకృతిలో జీడిమామిడి పండు ఒక అద్భుత సృష్టి అని చెప్పుకోవచ్చు. అన్ని పండ్లకి గింజ లోపల ఉంటే, దీంట్లో అది బయటకే కనపడుతుంది. ఇసుక నేలల్లో విరివిగా పండే జీడిపళ్లు వేసవిలో లభిస్తాయి. పచ్చిగానూ, వేయించి తినే జీడిపప్పులో ఎన్ని పోషకాలు ఉన్నాయో తెలుసుకుందాం.
అధిక కేలరీల శక్తిని అందించే జీడిపప్పు తింటే బరువు పెరుగుతారనీ, ఊబకాయం సమస్య వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారు. కానీ జీడిపప్పు వల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీడిపప్పులో ప్రొటీన్లు సమృద్ధి ఉంటాయి. ఈ ప్రొటీన్ చాలా సులభంగా జీర్ణమవుతుంది కూడా. జీడిపప్పులోని సెలీనియం, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని అరికట్టి క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతాయి.
జీడిపప్పులో ఉండే కొవ్వు మంచి కొలెస్ట్రాల్ పెరుగుదలకు, చెడు కొలెస్ట్రాల్ తగ్గడానికి కారణమవుతుంది. అందువల్ల, సరైన బరువు నిర్వహణ కోసం ప్రతిరోజూ 3-4 జీడిపప్పులు తినవచ్చు. జీడిపప్పులో జీరో కొలెస్ట్రాల్ ఉంటుంది. కనుక గుండెకు ఎలాంటి హాని చేయదు. మెగ్నీషియం నిల్వలు కూడా అధికంగా ఉండటంతో ఎముకల దృఢత్వానికి ఇవి దోహదపడుతాయి.
ఇక రక్తపోటు ఉన్నవారు కూడా జీడిపప్పును తినేందుకు భయపడాల్సిన పనిలేదు. ఇందులో సోడియం శాతం తక్కువగానూ పొటాషియం నిల్వలు ఎక్కువగా ఉంటాయి. కేన్సర్ సమస్యను అడ్డుకునే యాంటి ఆక్సిడెంట్లను జీడిపప్పు కలిగి ఉంది. జీడిపప్పులోని సెలీనియం, విటమిన్-ఇ వంటి యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్ ప్రభావాన్ని అరికట్టి క్యాన్సర్ ముప్పు నుంచి కాపాడుతాయి.