కరివేపాకు వలన కలిగే ఆరోగ్యకర ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

పురాతన కాలం నుండి కూడా భారతీయులు వంటల్లో కరివేపాకును వాడుతున్నారు. కరివేపాకు వల్ల వంటలకు చక్కని రుచి, వాసన వస్తాయి. కూరల్లో, చారుల్లో కరివేపాకును ఎంతో శ్రధ్ధగా వేస్తాము. కానీ దానిని తినేసమయంలో నిర్లక్షంగా తీసిపారేస్తాం. నిజానికి కరివేపాకు ఉపయోగాలు పూర్తిగా తెలిస్తే దాన్ని తినకుండా ఉండలేము. కరివేపాకులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అది మనకు పలు ఆరోగ్యకర ప్రయోజనాలను అందిస్తుంది.

health benefits of curryముఖ్యంగా కరివేపాకు కళ్ళకు చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో అతివల అందంలో కూడా కీలక పాత్ర పోషించి మీ జుట్టు అందాన్ని రెట్టింపు చేయటంలోనూ సహాయపడుతుంది. జుట్టు తెల్లబడకుండా చేయటంలో దీన్ని మించిన ఔషధం మరోటి లేదు. కురులు నిగనిగలాడుతూ అందంగా కనిపించాలంటే సరైన పోషణ అవసరం.

health benefits of curryమరి కురుల అందానికి కరివేపాకు ఎలావాడాలో ఇప్పుడు తెలుసుకుందాం… కరివేపాకును మెత్తగా రుబ్బుకుని ఆ పేస్ట్ లో మూడు స్పూన్ల మెంతిపొడి కలిపి జుట్టుకు ప్యాక్‌లా వేసుకుని, ఎండిన తర్వాత తలస్నానం చేయాలి. వారానికి ఒకసారి ఇలా చేస్తే 2 నెల్లల్లో తెల్లజుట్టు నల్లగా మారుతుంది.

health benefits of curryకరివేపాకు, ఉసిరికాయ ముక్కలు, గుప్పెడు మందార పువ్వుల్ని తీసుకొని కొన్ని నీళ్లు వేసి మెత్తగా రుబ్బుకొని ఆ పేస్ట్ ను తలకు బాగా పట్టించి 20 నిమిషాల తర్వాత తలస్నానం చేస్తే జుట్టు మృదువుగా తయారవుతుంది. రోజూ నాలుగైదు పచ్చి కరివేపాకులుతిన్నా లేదా కనీసం కూరల్లోని ఆకు వదిలిపెట్టకుండాతిన్నా జుట్టు తెల్లబడదు.

health benefits of curryకొబ్బరినూనెలో కొన్ని కరివేపాకు ఆకులను వేసి మరిగించి, చల్లారిన తర్వాత ఆ మిశ్రమాన్ని జుట్టుకుదుళ్లకు పట్టించి, మసాజ్‌చేసుకోవాలి. వారానికి రెండుసార్లు ఈ విధంగా చేయడం వల్ల జుట్టు రాలడం, తెల్లబడటం వంటి సమస్యలు తగ్గుతాయి.

health benefits of curryకొబ్బరినూనెలో ఉండే ప్రొటీన్లు జుట్టుకుదుళ్లకు బలాన్ని ఇస్తాయి. కరివేపాకు జుట్టు చిట్లిపోకుండా మాయిశ్చరైజర్‌లా ఉపయోగపడుతుంది.

health benefits of curryగోరింటాకు, కరివేపాకు, మందార ఆకులు కలిపి నీరు పోసి పేస్ట్ లాగా చేసుకుని తలకు పట్టించి కుంకుడు కాయలతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి రెండు సార్లు చేస్తే మీ జుట్టు మిల మిలా మెరుస్తుంది. బాగా పెరుగుతుంది కూడా.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR