గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో తెలుసా ?

పోషకాలతో కూడిన ఆహారం తీసుకోవడం ద్వారా శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుందని చెప్తున్నారు. కరోనా మహమ్మారి వ్యాప్తి కారణంగా ప్రజల్లో ఆరోగ్యం పై మరింత శ్రద్ధ పెరిగింది. మరి ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలు రోజూ తప్పనిసరిగా తీసుకోవాలి. వాటిలో గోధుమగడ్డి ముఖ్యమైనది. గోధుమ గడ్డి రసం ఆరోగ్యప్రదాయిని. దీనిని అనేక రోగాలకు నివారిణిగా ఉపయోగిస్తారు. ఒక గ్లాసు రసంలో ‘ఎ’ విటమిన్‌, బి కాంప్లెక్స, సి, ఇ, కె విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, పొటాషియం, సెలీనియమ్‌, సోడియం, సల్ఫర్‌, కోబాల్ట్‌, జింక, క్లోరోఫిల్‌ ఉంటాయి. దీనిలో కొలెస్ట్రాల్‌ ఉండదు. ఒకగ్లాసు లోనే 17 ఎమినో యాసిడ్స్‌ ఫైబర్‌ ఎంజైమ్స్‌ ఉంటాయంటే ఇది ఆరోగ్యానికి ఎంత ఉపయోగకరామో తెలుస్తుంది.

health benefits of drinking wheatgrass juiceగోధుమగడ్డి జ్యూస్ రోజూ తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది. ఇది రక్తహీనతను చాలా వేగంగా తగ్గిస్తుంది. అంతే కాదు శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచే అద్భుతమైన గుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. అందుకే దీన్ని గ్రీన్ బ్లడ్ అని కూడా పిలుస్తారు. గింజల్లో కన్నా మొలకెత్తిన గింజల్లో పోషకాలు ఎలా ఎక్కువ శాతంలో ఉంటాయో అదే విధంగా  గోధుమ గడ్డిలో మిగతావాటి కంటే చాలా రెట్లు ఎక్కువగా పోషకాలు ఉంటాయి. వెజిటబుల్ సూప్ లో కన్నా గ్రీన్ గోధుమ గడ్డి రసంలో రక్తవృద్ధికి తోడ్పడే పోషకాలు 8-9 రెట్లు ఎక్కువగా ఉంటాయని పోషకాహార నిపుణులు చెబుతున్నారు.

health benefits of drinking wheatgrass juiceగోధుమ గడ్డి మనకు పొడి, టాబ్లెట్ రూపంలోనూ లభిస్తోంది. కానీ దీన్ని జ్యూస్ రూపంలో తీసుకుంటేనే మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గోధుమ గడ్డిని ఇంట్లో పండించుకోవడం చాలా సులభం. ఇంట్లోనే కుండీలో కూడా పెంచుకోవచ్చు. ఎప్పటికప్పుడు దాన్ని కోసి జ్యూస్ తీసుకుని రోజూ తాగవచ్చు. దీన్ని నిత్యం 30 ఎంఎల్ మోతాదులో ఉదయాన్నే పరగడుపున తాగితే చాలు, ఎన్నో లాభాలు కలుగుతాయి. దీన్ని అన్ని వయసుల వారు తాగొచ్చు.

గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగడం వల్ల ఎలాంటి ఆరోగ్యకర ఫలితాలు కలుగుతాయో ఇప్పుడు తెలుసుకుందాం.

health benefits of drinking wheatgrass juice1. గోధుమ గడ్డిలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపు నిండిన భావనను కలిగిస్తుంది. దీంతో కొంత ఆహారం తిన్నా చాలు, ఎక్కువ సేపు వరకు ఆకలి వేయదు. దీని వల్ల బరువు తగ్గుతారు. అదేవిధంగా అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం సమస్యలు పోతాయి.

2. కడుపులో వికారం ఉన్నా, వాంతులు ఉన్నా గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగవచ్చు.

3. గోధుమ గడ్డి జ్యూస్‌ను రోజూ తాగుతుంటే పైల్స్ సమస్య నుంచి విముక్తి లభిస్తుంది.

4. జింక్, మెగ్నిషియం వంటి పోషకాలు గోధుమ గడ్డిలో పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో వాపులను తగ్గిస్తాయి. ఊపిరితిత్తులకు గాలి సరఫరాను క్రమబద్దీకరిస్తాయి. దీంతో ఆస్తమా వంటి శ్వాసకోశ వ్యాధులు తగ్గుతాయి. అలర్జీలు రావు.

5. ప్రేగులు, జీర్ణాశయంలో అల్సర్లు ఉన్న వారు గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే మంచిది. ఆ సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

6. గోధుమగడ్డిలో క్లోరోఫిల్ సమృద్ధిగా ఉంటుంది. ఇది రక్తంలోని హిమోగ్లోబిన్ లక్షణాలను కలిగి ఉంటుంది. కనుక గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే దాంతో క్లోరోఫిల్ శరీరంలోకి చేరి తద్వారా రక్తం పెరుగుతుంది. అనీమియా రాకుండా ఉంటుంది. మహిళలకు ముఖ్యంగా ఇది ఎంతగానో మేలు చేస్తుంది. గోధుమ గడ్డిలో క్లోరోఫిల్‌ ఉండటం వలన బ్యాక్టీరియాను నివారించి శరీరానికి నూతనోత్తేజం కలిగిస్తుంది.

7. గోధుమ గడ్డిలో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి ఒత్తిడి, ఆందోళన, డిప్రెషన్‌లను తగ్గించి మూడ్ మారుస్తాయి.

health benefits of drinking wheatgrass juice8. గోధుమ గడ్డి జ్యూస్‌ను తాగితే రక్త కణాలు ఆక్సిజన్‌ను ఎక్కువగా వాడుకుంటాయి. దీంతో శరీరానికి ఎల్లప్పుడూ శక్తి అందుతుంది. గోధుమ గడ్డి రసంలో ప్రొటీన్లు, ఎంజైమ్స్‌, విటమిన్లు, మినరల్స్‌ ఉన్న కారణాన ఈ రసాన్ని సేవించిన వారికి శక్తిని చేకూరుస్తుంది. తద్వారా యాక్టివ్‌గా ఉంటారు.

9. గోధుమ గడ్డి రసంలో యాంటీ ఆక్సిడెంట్స్‌, ఫైటో న్యూట్రియంట్స్‌, బీటా కెరోటిన్‌, బయో ఫ్లావో నాయిడ్‌, బి, సి, ఇ విటమిన్ల కారణాన క్యాన్సర్‌ కణాలను నశింపచేస్తుంది. రోగ నివారణా శక్తిని పెంచి ఎర్ర రక్త కణాల అభివృద్ధికి తోడ్పడుతుంది.

10. ఒక గ్లాసు రసాన్ని సేవిస్తే చర్మం పై ముడుతలు రావు. ముడుతలు మటుమాయ మవడమే కాక చర్మం కాంతివంతంగా, ప్రకాశ వంతంగా ఉంటుంది. కళ్ళ  కింద నల్లటి వలయాలూ, మచ్చలూ రాకుండా నిరోధిస్తుంది. నేడు కాస్మటిక్ పరిశ్రమ లో గోధుమగడ్డి రసాన్ని అధికంగా ఉపయోగిస్తున్నారు. ఇది చర్మానికి టానిక్ గా పనిచేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,770,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR