Home Health నేరేడు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

నేరేడు తింటే ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలో తెలుసా?

0

నేరేడు కాయలు ఎన్నో అనారోగ్య సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తాయి. ఇందులో మనకు తెలియని ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. మధుమేహంతో పాటు అనేక శారీరక సమస్యలను నేరేడు పండు దూరం చేస్తుంది. నేరేడు పండు, నేరేడు ఆకులు, నేరేడు చెట్టు బెరడు కూడా అనేక అనారోగ్య సమస్యలను తగ్గించడంలో సహాయపడతాయి.

నేరేడునేరేడుపండు లో సోడియం, పొటాషియం, క్యాల్షియం, పాస్పరస్, మాంగనీస్, జింక్, విటమిన్ ఎ, సితో పాటు రైబోప్లెనిన్, పోలిక్ యాసిడ్లను సమృద్దిగా ఉంటాయి. మధుమేహం ఉన్న వారికి నేరేడు పండు మంచి ఔషధం. దీనిని రోజూ తింటే రక్తంలోని చక్కెర శాతం క్రమబద్దీకరించబడుతుంది. తరచూ దాహం వేయడం, మూత్రానికి పోవడం వంటి సమస్యలు అదుపులో ఉంటాయి. నేరేడు విత్తనాలు, పొడపత్రి కాచు, పసుపు, ఎండు ఉసిరిక కలిపి చూర్ణం చేసుకుని దాన్ని చెంచా చొప్పున రోజుకు మూడుసార్లు తీసుకుంటే మధుమేహం అదుపులో వుంటుంది.

నేరేడు పండు మన జీర్ణ శక్తిని మెరుగుపరుస్తుంది. కడుపులో ఏర్పడే గ్యాస్ వంటి సమస్యలకు ఇది ఒక చక్కని పరిష్కారాన్ని చూపుతుంది. కడుపు ఉబ్బరం మరియు వాంతి అయ్యేలా ఉండే లక్షణాలను తగ్గిస్తుంది. మలబద్దకంతో పాటు మూత్ర సంబందిత సమస్యలను నివారిస్తుంది.

ఇది మంచి యాంటీ డయాబెటిక్ గా పనిచేస్తుంది.నేరేడు పండు మాత్రమే కాక ఆకులు, గింజలు, చెట్టు బెరడు కూడా ఔషధాల తయారీలో వాడుతారు. ఈ అల్లనేరేడు చెట్టు కాయల నుండి వెనిగర్‌ను తయారు చేస్తారు. నేరేడు పండ్లను తినడం ద్వారా దంత సమస్యలను తగ్గించుకోవచ్చు. ఇది దంతాలను మరియు చిగుళ్లను బలంగా చేయడంతో పాటు నోటిలో కురుపులు పుండ్లగా చెప్పబడే నోటి అల్సర్లను నివారిస్తుంది. దంతక్షయాన్ని తగ్గిస్తుంది. అలాగే నేరేడు ఆకు చూర్ణంతో పండ్లు తోమితే కదిలే దంతాలు గట్టిపడతాయి. నేరేడు చెక్క కషాయాన్ని పుక్కిలిపడితే నోటిలోని పుండ్లు చాలా త్వరగా మానిపోతాయి.

ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ పనితీరును మెరుగుపరచడంలో కీలకపాత్ర పోషిస్తాయి. నేరేడు పండు రక్తాన్ని శుద్ది చేయడమే కాకుండా రక్తంలో కేన్సర్ కారకాలు వృద్ది చెందకుండా నిరోదిస్తుంది. ఇందులో ఉండే ఐరన్ మరియు విటమిన్ సి రక్తంలోని హిమోగ్లోబిన్ శాతాన్ని పెంచుతాయి.

అయితే నేరేడు పండ్లను ఎట్టి పరిస్థితుల్లో పరగడుపున తీసుకోకూడదు. ఇలా తీసుకుంటే జీర్ణాశయంలో సమస్య ఏర్పడి అనారోగ్యానికి గురవుతారు. అందువల్ల ముందుగా ఏదో ఒకటి తిన్న తర్వాత మాత్రమే వీటిని తీసుకోవాలి. ఆపరేషన్ చేయించుకున్నవారు కూడా వైద్య సలహాలు తీసుకున్న తర్వాత వాటిని తినవచ్చు. అలాగే గర్భధారణ సమయంలో గర్భిణీ స్త్రీలు వీటిని తినడం ఆరోగ్యకరమా ? అన్న అపోహ కూడా చాలా మందిలో ఉంది. కొంత మంది ఈ ఫ్రూట్ గర్భిణీలు తినడం వల్ల పుట్టబోయే బిడ్డ చర్మం రంగులో మార్పులు వస్తాయని, చర్మం మీద బ్లూ కలర్ మార్క్స్ ఏర్పడుతాయని అంటుంటారు.

అయితే దీనికి ఎటువంటి క్లీనికల్ నిర్ధారణ లేదు. హెల్తీ ప్రెగ్నెన్సీ పొందడానికి నేరుడు పండ్లను మితంగా తీసుకోవడం మంచిది . ప్రెగ్నెన్సీలో బ్లాక్ జామున్ ను మితంగా తినడం వల్ల హెల్తీ ప్రెగ్నెన్సీ పొందవచ్చు. నేరుడు పండ్లలో ఉండే హై యాంటీఆక్సిడెంట్ కంటెంట్ మరియు న్యూట్రీషియన్స్ ఫీటస్ కు రక్షణ కల్పిస్తుంది మరియు ఫీటల్ గ్రోత్ ను ప్రోత్సహిస్తుంది. ఇంకా బిడ్డ పెరుగుదలకు సహాయపడుతుంది. అయితే నేరేడు అరగడానికి ఎక్కువసమయం పడుతుంది కాబట్టి.. ఉప్పు వేసి అప్పుడప్పుడు తీసుకోవాలి. భోజనమైన గంట తరువాత ఈ పండ్లు తీసుకుంటే.. ఆహారం జీర్ణమవుతుంది. అధికంగా తీసుకుంటే.. మలబద్ధకం సమస్యతోపాటు నోట్లో వెగటుగా ఉంటుంది. కాబట్టి, గర్భిణీలు నేరుడు పండ్లను ఎక్కువగా కాకుండా మితంగా తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు.

 

Exit mobile version