Home Health పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా ?

పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో తెలుసా ?

0

వాడకుండానే సువాసన వచ్చే అద్భుతమైన మొక్క పుదీనా. పుదీనాను.. ఔషధాల సంజీవనిగా పేర్కొంటారు. పుదీనాతో ఎన్నో ఆరోగ్య ఉపయోగాలు ఉన్నాయని నిపుణులు చెబుతారు. సంవత్సరం పొడువునా లభించే పుదీనాలో ఎన్నో ఔషధాలు ఉన్నాయని.. వాటి ద్వారా జబ్బులను సులభంగా నయం చేసుకోవచ్చని అందరూ చెబుతారు కానీ ఎవరూ పాటించరు. కొందరికైతే పుదీనా వల్ల ప్రయోజనాలేంటో కూడా తెలియదు. పుదీనా వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

పుదీనాపుదీనాలో కేలరీలు తక్కువగా ఉంటాయి. కొవ్వు పదార్థాలూ తక్కువే. విటమిన్ ఏ, విటమిన్ సి, డీ, బీ కాంప్లెక్స్ విటమిన్లు ఈ ఆకుల్లో దండిగా ఉంటాయి. ఇవి చర్మానికి మేలు చేస్తాయి. అధిక ఐరన్, పొటాషియం, మాంగనీస్ వంటి వాటివల్ల రక్తంలో హీమోగ్లోబిన్ పెరిగడంతోపాటు.. మెదడు పనితీరు బాగా మెరుగవుతుంది.

రోగనిరోధక శక్తి పెరుగుతుంది:

పుదీనాలో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. పుదీనాలో ఉండే విటమిన్ సి, డీ, ఇ, బి లు కాల్షియం, పాస్పరస్ మూలకాల వల్ల రోగనిరోధక శక్తి పెరిగి.. అనారోగ్యాలను దూరం చేస్తాయి.

జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది:

పుదీనా ఆకులతో టీని తయారుచేసుకుని ప్రతిరోజూ తీసుకుంటే జీర్ణవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. ఈ పుదీనా ఆకులను పేస్ట్‌లా చేసుకుని దీంతో దంతాలు తోముకుంటే పళ్లు ఆరోగ్యంగా ఉంటాయి.

వికారం, వాంతులు తగ్గుతాయి:

పుదీనా ఆకుల రసంలో కొద్దిగా నిమ్మరసం, తేనెను కలుపుకుని తీసుకోవడం వలన అజీర్ణం, కడుపు ఉబ్బరం, వికారం, వాంతులు వంటి సమస్యల నుండి విముక్తి లభిస్తుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేయాలంటే పుదీనాను క్రమం తప్పకుండా వాడితే మంచిదని వెైద్యులు చెబుతున్నారు.

జ్వరం, కామెర్లు తగ్గుతాయి:

పుదీనా ఆకుల రసంలో అల్లంరసం, కలబంద గుజ్జు, ఏలకులు, దాల్చిన చెక్క కలిపి నూరి ప్రతి రోజూ 2-3 చెంచాలు సేవిస్తూవుంటే అరుగుదల పెరుగుతుంది. పుదీనా కషాయం ఎలాంటి జ్వరాన్నైనా తగ్గిస్తుంది. అంతేకాదు ఈ కషాయం వల్ల కామెర్లు, ఛాతిమంట, కడుపులో మంట, మూత్ర సంబంధవ్యాధులు కూడా తగ్గుముఖం పడతాయి.

ఉదరసంబందిత వ్యాధులు నయం అవుతాయి:

పుదీనా, మిరియాలు, ఇంగువ, ఉప్పు, జీలకర్ర, ఎండుద్రాక్ష, ఖర్జూరాలు కలిపి మొత్తం నూరుకుని లేహ్యంలా సేవిస్తే ఉదరసంబందిత వ్యాధులు నివారణ అవుతాయి.

గ్యాస్ సమస్యని దూరం చేస్తుంది:

ఆకలి ఎక్కువగా లేని వారు, పుల్లత్రేనుపులతో బాధపడేవారు, కడుపులో గ్యాస్ పేరుకుపోయి ఇబ్బంది పడేవారు కూడా ఈ లేహ్యాన్ని తీసుకుంటే ఫలితం కనపడుతుంది.

ప్రెగ్నెన్సీ సమయంలో వచ్చే వాంతులకు నివారణ:

ప్రెగ్నెన్సీ సమయంలో కొంతమంది వాంతులతో బాధపడేవారు చెంచాడు పుదీనా రసంలో అదే కొలతలో నిమ్మరసం, తేనే కలుపుకుని కొద్ది కొద్దిగా తాగుతూ ఉంటే వాంతులు తగ్గుతాయి. వికారం కూడా రాకుండా ఉంటుంది.

మానసిక ఒత్తిడి తగ్గి నిద్ర పడుతుంది:

నిద్రలేమితో బాధపడేవారు రాత్రి పడుకోవటానికి ముందు ఈ ఆకుల్ని ఒక గ్లాసుడు నీళ్ళల్లో వేసి మూతపెట్టి అరగంట తర్వాత తాగితే మంచి నిద్ర పడుతుంది. మానసిక ఒత్తిడి కూడా తగ్గుతుంది.

అరికాళ్ళ మంటలు తగ్గుతాయి:

పుదీనా ఆకులను మొత్తగా రుబ్బి పేస్టులా చేసుకుని ఫ్రిజ్‌లో కాసేపు ఉంచిన తరువాత బయటకు తీసి చల్లగా ఉన్నప్పుడు అరికాళ్లకు రాస్తూ ఉంటే మంటలు క్రమంగా తగ్గుముఖం పడతాయి.

గొంతునొప్పి తగ్గుతుంది:

పుదీనా ఆకుల్ని ఎండబెట్టి దానిని టీ పొడిలో కలిపి టీ చేసుకుని తాగితే గొంతునొప్పి తగ్గటంతో పాటు గొంతులో మాధుర్యం కూడా పెరుగుతుంది.

ఇన్ఫెక్షన్ ని తగ్గిస్తుంది:

చెవి, ముక్కుల్లో ఏర్పడే ఇన్‌ఫెక్షన్‌కి తాజా పుదీనా ఆకులు కొన్ని చేతితో రసంలా తీసి ఆ రసంలో దూదిని ముంచి ఆ డ్రాప్స్ చెవిలో, ముక్కులో ఆరారా వేస్తూ ఉంటే ఇన్ఫెక్షన్ క్రమంగా తగ్గిపోతుంది.

నోటి దుర్వాసనకు చెక్:

నోటి దుర్వాసనకి కూడా ఇది మంచి మందు. నోరు వాసన వచ్చేవారు పుదీనా ఆకుల్ని ఎండబెట్టి పొడిచేసి అందులో కాస్త ఉప్పు వేసుకుని ఆ పొడితో రోజూ పళ్ళు తోముకుంటే నోటి దుర్వాసన మాయం అవ్వటమే కాదు చిగుళ్ళు కూడా గట్టిపడతాయి.

వేసవి లో రిఫ్రెష్ చేస్తుంది:

ఎండాకాలంలో మజ్జిగలో పుదీనా ఆకులు వేసుకుని తాగితే చాలా చలవ చేస్తుంది. నిమ్మరసంలో పుదీనా కలుపుకుని తాగితే దాహం కూడా తీరుతుంది. వేసవికాలానికి పుదీనా ఒక మంచి నేస్తంలాంటిది.

 

Exit mobile version