కరక్కాయ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా

ప్రకృతి లో మనకు లభించే ఔషధాలలో కరక్కాయ ఒకటి. కరక్కాయ శాస్త్రీయ నామం టెర్మినాలియా చెబుల్లా. చెబ్యులిక్ మైరోబాలన్, హరిటాకి, హారార్డ్ అనేవి ఇతర పేర్లు. ఇది 6-20 మీటర్ల ఎత్తువరకు పెరిగే వృక్షం. పత్రాలు కణుపు ఒకటి లేదా రెండు చొప్పున పొడవుగా, దాదాపు కోలగా ఉంటాయి. పుష్పాలు తెలుపు లేదా లేతాకుపచ్చ రంగులో సన్నని కంకులపై నక్షత్రాలలా వస్తాయి. ఫలాలు కోలగా ఉండి, ఎండితే నిడుపాటి నొక్కులను కలిగి ఆగస్టు నుంచి అక్టోబరు వరకు లభిస్తాయి. ఇది విత్తనాల ద్వారా వ్యాప్తి చెందుతుంది. కరక్కాయ లేదా కరక ఔషధ జాతికి చెందిన మొక్క. కరక్కాయత్రిఫలాలలో ఒకటి. ఇది జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది.

Do you know the health benefits of Myrobalanకరక్కాయ పెంకులు, వస ఆకులు కలిపి రెండు రోజులు నానబెట్టాలి. తర్వాత వీటిని ఎండబెట్టి పొడిచేసి పూటకు అర టీస్పూన్ చొప్పున నేరుగా లేదా తేనెతో కలిపి తీసుకుంటే అవయవాల్లో అంతర్గత రక్తస్రావం ఆగుతుంది.

Do you know the health benefits of Myrobalanకరక్కాయ, శొంఠి, తానికాయ, పిప్పళ్లు చూర్ణాలను సమానంగా కలిపి నిల్వచేసి, అర టీస్పూన్ చొప్పున రోజుకు మూడుసార్లు తేనె లేదా నీటిలో కలిపి తీసుకుంటే దగ్గుతోపాటు ఆయాసం కూడా తగ్గుతుంది.

Do you know the health benefits of Myrobalanదగ్గుతో బాధపడుతున్న పిల్లలకు పెద్దలకు కరక్కాయ రసం తాగిస్తుంటారు. రక్తహీనతతో బాధపడేవారు కరక్కాయలను గోమూత్రంలో నానబెట్టి, తర్వాత ఎండబెట్టి, పొడిచేసి, రోజుకు రెండుసార్లు అర టీస్పూన్ చొప్పున నీళ్లతో కలిపి తీసుకోవాలి.కరక్కాయ, తానికాయ, ఉసిరిని గోమూత్రంలో ఉడికించి, మెత్తగా నూరి టీ స్పూన్ చొప్పున తీసుకుంటే కామెర్లు, రక్తహీనతలు తగ్గుతాయి.

Do you know the health benefits of Myrobalanకరక్కాయ, శొంఠి కలిపి చూర్ణం చేసి బెల్లం కలిపి నిల్వచేసుకొని రోజుకు టీస్పూన్ చొప్పున చప్పరించి నీళ్లు తాగితే మలబద్ధకం తగ్గుతుంది.

Do you know the health benefits of MyrobalanDo you know the health benefits of Myrobalanకరక్కాయ, శొంఠి మిశ్రమానికి బెల్లం కలిపి, రోజుకు రెండుసార్లు అర చెంచాడు చొప్పున మజ్జిగతోపాటు తీసుకుంటే శరీరంలో చేరిన అదనపు నీరు బయటకుపోతుంది.

కరక్కాయ పొడిని తేనెలో కలిపి తీసుకుంటే విష జ్వరాలు తగ్గుతాయి. కరక్కాయ పొడిని ఆముదంలో కలిపి ప్రతి రోజూ తీసుకుంటే కీళ్ల నొప్పులు తగ్గుతాయి.

Do you know the health benefits of MyrobalanDo you know the health benefits of Myrobalanకరక్కాయ చూర్ణం, శొంఠి చూర్ణం, దేవదారు చూర్ణం మూడు సమభాగాలు కలిపి పూటకు అర టీ స్పూన్ మోతాదుగా, వేడినీళ్లతో రెండుపూటలా తీసుకుంటే శరీరంలో చేరిన నీరు వెళ్లిపోయి వాపు తగ్గుతుంది. మరియు కడుపులో ఉండే విష మలినాలు బయటికి పోతాయి.

Do you know the health benefits of MyrobalanDo you know the health benefits of Myrobalanకరక్కాయ పొడిని ఆముదంతో కలిపి తాగితే, ఆర్థ్రయిటిస్‌ నొప్పులు తగ్గుముఖం పడతాయి. కరక్కాయలోని బెబులిన్‌ అనే పదార్థం కడుపునొప్పిని తగ్గిస్తుంది. చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. మొటిమలు, చర్మవ్యాధులకి కూడా ఔషధంలా పనిచేస్తుంది. నాలుక రుచి మొగ్గల్ని కోల్పోయిన సందర్భాల్లో దీని కషాయాన్ని పుక్కిలిపడితే సాధారణ స్థితికి వస్తుంది.

Do you know the health benefits of MyrobalanDo you know the health benefits of Myrobalanకరక్కాయ కళ్ళు, చర్మ ఆరోగ్యానికి మంచిది. త్రిఫల చూర్ణాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా తీసుకుంటే, జుట్టు అంత త్వరగా తెల్లగా మారదు. అలాగే జుట్టు బాగా పెరిగేందుకు ఇది ఎంతగానో సహకరిస్తుంది. దీని ప్రభావం వల్ల ముసలితనం త్వరగా రాదు. జ్ఞాపకశక్తిని వృద్ధి చేయడంలో త్రిఫల చూర్ణం చక్కగా ఉపకరిస్తుంది. ఎర్ర రక్త కణాలను బాగా వృద్ధి చేస్తుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR