గులాబీ వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు ఏంటో తెలుసా ?

పువ్వుల్లో అందమైన పువ్వు గులాబీ అని వేరే చెప్పక్కర్లేదు. ఈ గులాబీ అందానికే కాదు ఔషధంగా కూడా మేలు చేస్తుంది. గులాబీలో ఆరోగ్య ప్రయోజనాలు పుష్కలంగా ఉన్నాయి. గులాబీ పువ్వుల నుండి ఆవిరి ద్వారా తీయబడిన నూనె, గులాబీ అత్తరుని పరిమళ ద్రవ్యాలలో కొన్ని శతాబ్దాలుగా ఉపయోగిస్తున్నారు. గులాబీ నూనె నుండి తయారయ్యే రోజ్ వాటర్ను ఆసియా దేశాల వంటలలో విరివిగా వాడుతున్నారు.గులాబీ రేకుల సారం నుండి తీసిన గులాబీ సిరప్కి ఫ్రాన్స్ ప్రసిద్ధి చెందింది. యునైటెడ్ స్టేట్స్ లో ఫ్రెంచ్ గులాబీ సిరప్ ని గులాబీ స్కోన్ తయారీకి వాడతారు.

health benefits of rosesగులాబీ పువ్వులు అనేక రుగ్మతల్ని నయం చేసే గుణాలు కలిగి వున్నాయి. ముఖ్యంగా ఇందులో మారిక్ యాసిడ్‌, టానిక్ యాసిడ్‌లు పుష్కలంగా ఉండటం చేత వీటి నుండి లభ్యమయ్యే తైలాలు ఆయుర్వేద పరంగా కొన్ని రుగ్మతలకి మంచి ఉపశమనాన్నిస్తున్నాయని ఆయుర్వేద వైద్యనిపుణులు చెబుతున్నారు.

health benefits of rosesప్రతిరోజు భోజనానంతరం చాలామందికి ఒక్కపొడి వేసుకునే అలవాటు ఉంటుంది. అంతకన్నా గులాబీ రేకుల్ని నమిలితే జీర్ణప్రక్రియ సులభంగా అవుతుంది.

వేసవి తాపం తీర్చుకునేందుకు కేవలం 10 గ్రాముల లోపు గులాబీ ద్రవాన్ని తీసుకుంటే మేలు కలుగుతుంది.

గులాబీ రెక్కల నుండి తీసిన రసంతో గులాబ్‌-జల్‌ని కూడా తయారుచేస్తారు. ఇది కంటి జబ్బులకి దివ్యౌషధంగా పనిచేస్తుంది.

health benefits of rosesచీముపట్టి బాధపెట్టే పుళ్ళ మీద గులాబీ పొడి చల్లితే యాంటీబయాటిక్ లా పనిచేయడమే కాకుండా వాటిని తొందరగా నివారిస్తుంది.

గర్భిణులు దీనిని రెండు మోతాదులుగా తీసుకుంటే వారిలోని ఉష్ణం తగ్గుముఖం పడుతుంది.

health benefits of rosesరోజూ రెండు గ్రాముల గులాబీ రసం తీసుకుంటే పిత్తాశయ వికారాలు తగ్గి ఆరోగ్యం యథాస్థాయికి చేరుతుంది.

గులాబీ రేకులు, బాదంపప్పు కలిపి రోజూ ఉదయాన్నే తీసుకుంటే రక్తపోటు తగ్గిపోతుంది.

health benefits of rosesశరీర దుర్గంధంతో బాధపడేవారు గులాబీ రేకుల రసాన్ని కొన్ని రోజులపాటు శరీరానికి మర్ధనా చేస్తే చమటని తగ్గించి దుర్గంధాన్ని కూడా నివారిస్తుంది.

గులాబీ రేకుల్ని కొబ్బరి నూనెతో కలిపి వేడిచేసి చల్లారిన తర్వాత తిలకంగా పెట్టు కుంటే మెదడు చల్లబడటమేకాక జ్ఞాపక శక్తి బాగా పెరుగుతుంది.

health benefits of rosesఆరు టీ స్పూన్ల గులాబీ రేకులను, ఆరు టీ స్పూన్ల సోపు గింజలను కలిపి నూరి రెండు కప్పుల నీళ్లలో వేసి మరిగించి, వడపోసి రోజుకు రెండుసార్లు తీసుకుంటుంటే క్రమంగా రక్తహీనత నుంచి బయటపడతారు.

ఒక టీ స్పూన్ గులాబీ నూనెను, నాలుగు టీ స్పూన్ల బాదం నూనెను కలిపి ఛాతి మీద ఉదయం, సాయంకాలాలు ప్రయోగించి మర్థనా చేసుకుంటుంటే గుండెనొప్పిలో హితకరంగా కూడా ఉంటుంది.

health benefits of rosesఒక కప్పు గులాబీ నీళ్లకు ఒక టీ స్పూన్ సోపు గింజలు, అర టీస్పూన్ ధనియాలు, 10 ఎండు ద్రాక్షలను కలిపి రాత్రంతా నానబెట్టి మర్నాడు ఉదయం వడపోసుకొని తీసుకుంటే గుండె దడ, ఆందోళన వంటివి తగ్గుతాయి.

గులాబీలు 100గ్రా., ద్రాక్షపండ్లు 100గ్రా. వేసి కషాయం కాచి చిటికెడు ఏలక్కాయ గింజల పొడికి కలిపి కొద్దికొద్దిగా తింటూ ఉంటే దీర్ఘకాలంనుంచి బాధించే తల నొప్పినుంచి తొందరగా ఉపశమనం లభిస్తుంది.

health benefits of rosesఒక టేబుల్ స్పూన్ గులాబీ రెక్కలను ఒక కప్పు నీళ్లలో వేసి మరిగించి తీసుకుంటే తల తిరగటం, తలనొప్పి వంటివి కూడా తగ్గుతాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,730,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR