మామిడి ఆకులలోని ఆరోగ్య రహస్యాలు ఏంటో తెలుసా ?

ఏదైనా పండగ వచ్చినా, శుభకార్యం చేస్తున్నా ముందుగా గుమ్మానికి మామిడి తోరణాలు కట్టాల్సిందే. ఇది తరతరాల నుండి వస్తున్న ఆచారం. దీనివెనక సైంటిఫిక్ రీజన్స్ ఉండటం వల్ల మామిడాలకును తప్పనిసరిగా.. గుమ్మాలకు కడతారు. అయితే మామిడి ఆకులలోని ఆరోగ్య రహస్యాలు చాలా మందికి తెలియదు. ఈ మామిడాకులకు డయాబెటిస్, ఆస్తమా వంటి వ్యాధులను నయం చేసే సత్తా కూడా ఉంది.

మామిడి ఆకుఒక్కసారి డయాబెటిస్ వ్యాధి బారిన పడితే జీవితాంతం మందులను వాడాల్సి వస్తోంది. కొందరికి డయాబెటిస్‌ నియంత్రణలో ఉండడం లేదు. అయితే మామిడి ఆకులను ఉపయోగించి షుగర్‌ లెవల్స్‌ను అదుపు చేయవచ్చు. ఈ చిట్కాను ఎంతో కాలంగా ఉపయోగిస్తున్నారు. దీని ద్వారా ఆస్తమా సమస్య కూడా తగ్గుతుంది. మామిడి ఆకుల్లో ఉండే ఎన్నో పోషకాలు షుగర్‌ లెవల్స్‌ను తగ్గించేందుకు ఉపయోగపడతాయి.

మామిడి ఆకు2010లో సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం మామిడి ఆకుల నుంచి తీసిన పదార్థాలను తీసుకోవడం వల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గాయని తేలింది. మామిడి ఆకుల రసాన్ని ఎలుకలపై ప్రయోగం చేసి నిరూపించారు. ఎలుకలకు మామిడి ఆకుల రసాన్ని ఇవ్వడం వల్ల తక్కువ గ్లూకోజ్ స్థాయిలను గ్రహిస్తాయి అని, రక్తంలోని చక్కెర స్థాయిలను నియంత్రణలో ఉంచడంలో మామిడాకులు బాగా పనిచేస్తాయని శాస్త్రవేత్తలు తెలియజేస్తున్నారు. అందువల్ల వీటిని ఉపయోగించి డయాబెటిస్‌ను అదుపు చేయవచ్చు.

మామిడి ఆకుడయాబెటిస్ తో బాధ పడుతున్న వాళ్ళు ప్రతిరోజు మామిడి ఆకుల రసాన్ని తీసుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్ లో ఉంటుంది. దానికోసం మామిడి ఆకులను 15 తీసుకుని వాటిని బాగా కడిగి 100 లేదా 150 ఎంఎల్‌ నీటిలో వేసి బాగా మరిగించాలి. అనంతరం వచ్చే కషాయాన్ని రాత్రంతా అలాగే ఉంచాలి. తరువాత రోజు ఉదయాన్నే ఆ కషాయాన్ని పరగడుపునే తాగాలి. ఇలా రోజూ చేయడం వల్ల మూడు నెలల్లో అద్భుతమైన ఫలితాలు వస్తాయి.

మామిడి ఆకుమామిడి ఆకులతో తయారు చేసే కషాయాన్ని తాగడం వల్ల శరీరంలో ఇన్సులిన్‌ ఉత్పత్తి పెరుగుతుంది. ఇది గ్లూకోజ్‌ను సక్రమంగా వినియోగం అయ్యేలా చేస్తుంది. దీని వల్ల చక్కెర స్థాయిలు తగ్గుతాయి. మామిడి ఆకుల్లో పెక్టిన్‌, ఫైబర్‌, విటమిన్‌ సి ఉంటాయి. అందువల్ల షుగర్‌ లెవల్స్‌ తగ్గడంతోపాటు కొలెస్ట్రాల్‌ స్థాయిలు కూడా తగ్గుతాయి.

మామిడి ఆకుఇక డయాబెటిస్‌ వల్ల రాత్రి పూట కొందరు తరచూ మూత్ర విసర్జన చేస్తుంటారు. కానీ మామిడి ఆకుల నీటిని తాగితే ఆ ఇబ్బంది ఉండదు. మామిడి ఆకుల లో విటమిన్ ఎ, సి, బిఅధికంగా ఉండటం వల్ల నిరోధక శక్తి పెరగడమే కాకుండా కంటి సమస్యలను రాకుండా కాపాడుతుంది. అంతేకాకుండా జుట్టు సమస్యలను నివారిస్తుంది.

మామిడి ఆకుమామిడి ఆకులతో టీ తయారు చేసుకొని తాగడం వల్ల శరీరంలో పేరుకుపోయిన చెడు కొలెస్ట్రాల్ ను తొలగిస్తుంది. అలాగే అధిక బరువును తగ్గించడానికి కూడా ఈ టీ సహాయ పడుతుంది. మామిడి ఆకుల్లో యాంటీ ఆక్సింట్స్ గుణాలు పుష్కలంగా ఉంటాయి. వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మామిడి ఆకుల పేస్ట్ అప్లై చేయడం వల్ల.. చాలా త్వరగా ఉపశమనం పొందవచ్చు.

మామిడి ఆకుఅంతేకాకుండా మామిడి ఆకుల్లో విటమిన్ సి, విటమిన్ ఏ, విటమిన్ బి,మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటాయి. ఇది శరీరంలోని జీర్ణక్రియను సక్రమంగా జరిగేటట్లు చేస్తుంది. అలాగే మలబద్ధకం సమస్యను తగ్గిస్తుంది. ఎక్కిళ్లు, గొంతు ఇన్ఫెక్షన్స్ నివారించడంలో మామిడాకులు ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మామిడాకులను కాల్చి ఆ పొగ ద్వారా గొంతు ఇన్ఫెక్షన్స్, నొప్పి, ఎక్కిళ్లు నివారించడానికి సహాయపడుతుంది.

మామిడి ఆకుకీళ్ల నొప్పులతో బాధపడుతున్న వాళ్లు ప్రతి రోజు 5 మామిడి ఆకులను తీసుకొని బాగా కడిగి నీటిలో మరగబెట్టి చల్లారిన తర్వాత ఉదయం పరగడుపునే తాగడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది. అంతేకాకుండా రక్తప్రసరణ సక్రమంగా జరిగేటట్లు చేసి రక్తపోటును నియంత్రణలో ఉంచుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,570,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR