భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి? దీని వెనుక చరిత్ర ఏంటో తెలుసా ?

తింటే గారెలే తినాలి వింటే భారతమే వినాలి అంటారు. ఎందుకంటే మనిషి జీవితానికి సంబంధించిన అన్నీ కోణాలు భారతం నుంచి నేర్చుకోవచ్చు. అలాంటి భారతంలో భీష్ముని పాత్ర గురించి ఎంత చెప్పినా తక్కువే. ఆయన గొప్ప వ్యక్తి, కారణ జన్ముడు. గంగా పుత్రుడైన భీష్ముడు అష్ట వసువులలో ఒకడు. అలాంటి ఆయన గురించి చెబితే కచ్చితంగా బీష్మ ప్రతిజ్ఞ గుర్తువస్తుంది. అసలు భీష్మ ప్రతిజ్ఞ అంటే ఏంటి? అది ఎందుకు చేయాల్సి వచ్చింది? దాని వెనుక ఉన్న చరిత్ర ఏమిటో ఇప్పుడు చూద్దాం.

Bhishmaశంతనుడుకి, గంగాదేవికి భీష్ముడు పుత్రుడిగా కలిగిన తరువాత కొడుకుని తండ్రికి అప్పగించి గంగ వెళ్ళిపోతుంది. ఆ తరువాత సంసార జీవితంపైన కోరికతో తాను మోహించిన సత్యవతిని వివాహం చేసుకోవాలి అని శంతనుడు భావిస్తాడు. ఆమె తల్లిదండ్రులని కలిసి తన కోరిక చెబుతాడు.

Bhishmaఅయితే అప్పటికే శంతనుడికి భీష్ముడు పుత్రుడిగా ఉన్నాడని శంతనుడికి తమ కుమార్తెను ఇచ్చి వివాహం చేయటానికి సత్యవతి తల్లిదండ్రులు ఒప్పుకోరు. ఆ తరువాత తన తండ్రి ప్రవర్తనలోని తేడాను గమనించి, మంత్రి ద్వారా తండ్రి కోరికను తెలుసుకుని తానే స్వయంగా తండ్రి వివాహం జరిపించడానికి సిద్ధమయ్యాడు భీష్ముడు.

Bhishmaదానికోసం సత్యవతి తల్లిదండ్రులు ఏం చెప్పినా అన్నీంటికి భీష్ముడు ఒప్పుకుంటాడు. తాను రాజ్యాధికారం చేపట్టనని, రాజ్య సంరక్షణా బాధ్యతను స్వీకరిస్తానని, తన పుత్రుల ద్వారా ఎలాంటి అడ్డంకులు లేకుండా ఉండేందుకు, అసలు వివాహమే చేసుకోనని భీష్మ ప్రతిజ్ఞ చేస్తాడు. అందుకు వారు ఒప్పుకుని అతని తండ్రికి సత్యవతిని ఇచ్చి వివాహం చేస్తారు.

Bhishmaతన కోరిక తీర్చినందుకు, తాను ఎప్పుడు కోరుకుంటే అప్పుడు మరణం సంభవించే స్వచ్ఛంద మరణ వరాన్ని భీష్మునికి ప్రసాదించాడు శంతనుడు… అలా తండ్రి కోసం బ్రహ్మచారి గా మారిన గొప్ప వ్యక్తిగా చరిత్రలో నిలిచిపోయాడు భీష్ముడు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR