కంద మూలాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసా ?

పూర్వం మునులు అడవులలో దొరికే కందమూలాలు తిని బతికేవారని మన పురాణాలు చెబుతున్నాయి. మనం నిత్యం వాడే దుంప కూరగాయల్లో కంద గడ్డలకు ప్రత్యేక స్థానం ఉంటుంది. స్వీట్ పొటాటోగా పిలవబడే ఈ కందని కొంత మంది నీటిలో, ఇంకొంతమంది నూనెలో ఉడకబెట్టుకుని తింటారు.

importance of Kandaఅయితే ఈ పౌషకాహార కందని పరిమితంగా కాకుండా రోజువారీ ఆహారంగా మార్చుకుంటే ఆరోగ్యం మన అరిచేతుల్లో ఉన్నట్టే అంటున్నారు పరిశోధకులు. మరి ఆ కంద మూలాల ప్రాముఖ్యత ఏమిటో తెలుసుకుందాం.

importance of Kandaకంద ఒక అద్భుతమైన ఆహారమని ఇప్పటికే చాలా అధ్యయనాల్లొ రుజువైనది. దీనిలో విటమిన్ ఏ ఎక్కువ మోతాదులో ఉంటుంది అంతే కాకుండా కందలో ఉండే పొటాషియం, ఫైబర్, నాచురల్ షుగర్స్ చాలా తక్కువ కాలరీస్ తో ఎక్కువ బలం లభించేలా చేస్తాయి.

importance of Kandaఇక గర్భిణులకు చేసే మేలు అంతా ఇంతా కాదు, పుట్టబోయే బిడ్డకు కూడా ఆరోగ్యాన్ని, రోగ నిరోధకతని ఇస్తుంది. సింపుల్ గా చెప్పాలంటే , ఒక చిన్న కంద వంద మందులకు సమానం. కందలను తీసుకోవడం వలన జీర్ణశక్తి వేగమవ్వడమే కాకుండా రోగ నిరోధక శక్తి కూడా అధికమవుతుంది.

importance of Kandaకాన్సర్ బారిన పడకుండా కాపాడటమే కాకుండా ప్రోస్టేట్ కాన్సర్ నివారణకు కంద ఒక దివ్యమైన ఔషధంలా పనిచేస్తుంది. కంద గడ్డ ద్వారా మన శరీరానికి దాదాపు 6 గ్రాముల ఫైబర్ చేరుతుంది. వీటిని తినడం వలన ఒబేసిటీ, సుగర్ వ్యాదుల భారిన పడకుండా ఉండొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR