Home Health అవిసె గింజలతో ఎన్నో వైద్య చిట్కాలు ఏంటో తెలుసా ?

అవిసె గింజలతో ఎన్నో వైద్య చిట్కాలు ఏంటో తెలుసా ?

0

అవిసె గింజలను మదనగింజలు, ఉలుసులు, అతశి అని కూడా అంటారు. అవిసె గింజ ఎన్నో రకాల రుగ్మతలను నివారించడంలో క్రియాశీలకంగా పనిచేయగల వని ఇటీవలి పరిశోధనలు పేర్కొంటున్నాయి. భారతదేశంలోని గ్రామాలలో బరువు, కీళ్ళ నొప్పులు, దగ్గు, జలుబు నయం చేయడానికి, పచ్చళ్ళు చేసుకోవడానికి ఉపయోగిస్తారు.

అవిసె గింజలమన పూర్వీకులు ఈ అవిసెగింజలతో ఎన్నో వైద్యాలు చేసేవారు. ఇప్పటికీ బామ్మలు, అమ్మమ్మలు ఈ గింజలతో ఏవో చిట్కా వైద్యాలు చేస్తుంటారు. ఈ చిరు గింజలలో పలు ప్రయోజనాలున్నాయి. ఆరోగ్యానికి సంబంధించినంత వరకు, అవిసె అత్యంత శక్తివంతమైనది.

అవిసె గింజలతో చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. అవేమిటో తెలుసుకుందాం…

1. చెడు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ స్థాయిని పెంచుతుంది.

2. గుండె మరియు మెదడు నుంచి కాపాడుతుంది.

3. ఆర్థరైటిస్ ను తగ్గించడంలో సహాయపడుతుంది.

4. గర్భిణని సమయంలో మలబద్ధకాన్ని పోగొడుతుంది.

5. క్యాన్సర్ కణాలునీ చంపుతుంది.

6. అన్ని రకాల ఇన్ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది.

7. గ్యాస్ట్రిక్ సమస్యలను మరియు జీర్ణ సమస్యలకు అద్భుతంగా పనిచేస్తుంది.

8.చాలామందికి ఉదయాన్నే నిద్ర లేవగానే తలనొప్పితో బాధపడుతూ ఉంటారు దీనికి చక్కటి పరిష్కారం అవిసె గింజలుతో మనకు లభిస్తుంది.

9.అవిసె గింజలు జలుబు, దగ్గును తగ్గిస్తుంది.

10.అవిసె గింజలలో ఉండే ముసిలేజ్ అనే పదార్థం జీవక్రియను నెమ్మది చేసి రక్తంలో గ్లూకోస్ కలవడాన్ని తగ్గిస్తుంది.

11.రక్తపోటు మరియు బిపిని తగ్గించడంలో అవిసె గింజలు చాలా బాగా పనిచేస్తాయి.

12. మహిళలలో ఋతు క్రమానికి ముందు తలెత్తే(పిలిమిలిన్) బాధాకరమైన నొప్పులను నివారించడంలో అవిసె గింజలు తోడ్పడతాయి. రొమ్ము క్యాన్సర్ రాకుండా నివారిస్తాయి.

13. అవిసె గింజలో ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉన్నాయి. ఇవి ఇన్ ఫ్లమేషన్ ను నివారించడం ద్వారా కీళ్ళవాతం, ఉబ్బసం, మధుమేహం ఇంకా కొన్ని క్యాన్సర్ల నుంచి శరీరాన్ని కాపాడతాయి.

14.పొడి చర్మం, సూర్యరశ్మి వేడిని తట్టుకోలేని సున్నితమైన చర్మాలకు బాగా పనిచేస్తుంది. ఎగ్జిమాలను నయం చేస్తుంది. ఎండవల్ల చర్మం పేలడమూ, చెమట కాయలు రావడంవంటి సమస్యలను నివారించడంలో సహాయ పడతాయి..

Exit mobile version