Home Health అరటి పువ్వు వలన కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా ?

అరటి పువ్వు వలన కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసా ?

0

మన పూర్వీకులు ఏ సమస్య వచ్చినా చుట్టూ దొరికే మొక్కలు, ఆకులు, పండ్లతోనే తగ్గించుకోడానికి ప్రయత్నించేవారు. ప్రకృతిలో ఉన్న అనేక మొక్కలలో అద్భుతమైన ఔషధ గుణాలు కూడా కనిపిస్తాయి. అలాంటి ఒక ఔషధ బాండాగారం అరటి చెట్టు. అరటి పండ్లు అంటే అందరికి తెలసిన హెల్తీ న్యూట్రీషియన్ ఫుడ్. కానీ అరటి పండ్లు మాత్రమే కాదు, అరటిపండ్లను అందించే అరటి చెట్టులో ఏ ఒక్కటీ నిష్ప్రయోజనం కాదు. దాని ఆకులు, కాండం మరియు పువ్వులు కూడా చాలా రకాలుగా ప్రయోజనాలను అందిస్తాయి.

అరటి పువ్వుసీజన్ తో సంబంధం లేకుండా వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ ఇష్టపడే పండ్లలో అరటిపండు ఒకటి. దీన్ని ఆరగించడం వల్ల ఎన్నో ఆరోగ్య‌క‌ర ప్ర‌యోజ‌నాలు కలుగుతాయి. శ‌రీరానికి పోష‌కాలు అంద‌డ‌మే కాదు, అనారోగ్య సమస్యలు కూడా దూరమవుతాయి. పైగా శ‌రీరానికి పుష్కలమైన శ‌క్తి ల‌భిస్తుంది. అయితే, అరటి పండు తరహాలోనే అరటి పువ్వులో కూడా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఆహార నిపుణులు చెబుతున్నారు.

ఇంకా చెప్పాలంటే.. అరటి పండు కంటే మెరుగైన ఔషద గుణాలు ఇందులో ఉన్నాయట. ఇది అనారోగ్య సమస్యలను దూరం చేయడమే కాకుండా.. శరీరానికి కావాల్సినంత శక్తిని ఇస్తోందట. ముఖ్యంగా పురుష్లో వీర్యవృద్ధికి ఇది ఎంతో మెరుగ్గా పనిచేస్తోండట. మరి, దీనివల్ల కలిగే మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలేమిటో తెలుసుకుందాం.

దక్షిణ ఆసియాలో అరటి పువ్వును హెల్తీ వెజిటేబుల్ గా తింటారు. దీన్ని పచ్చిగా లేదా ఉడికించి రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటారు. ఇంకా సూప్స్, కర్రీస్, ఫ్రైడ్ ఫుడ్స్ రూపంలో తీసుకుంటారు. అంతే కాదు అరటి పువ్వులో న్యూట్రీషన్ విలువలు కూడా ఎక్కువగా ఉంటాయి. 100గ్రాముల బనానా ఫ్లవర్ లో 51 క్యాలరీలు, 1.6 ప్రోటీన్స్, 0.6 ఫ్యాట్, 9.9 కార్బోహైడ్రేట్స్, 5.7ఫైబర్, 56mg ల క్యాల్షియం, 73mg ఫాస్పరస్, 56.4 mg ఐరన్, , 13mg కాపర్, 553.3mg పొటాషియం, ఇంకా మెగ్నీషియం, విటమిన్ ఇలు కూడా ఉన్నాయి.,

అరటి పువ్వు డయాబెటిస్ రోగులకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. డయాబెటీస్ తో బాధపడుతున్నవారు అరటి పువ్వు కూరను తింటే రక్తంలో చక్కెర స్థాయిలో నియంత్రణలో ఉంటాయట. అరటి పువ్వును శుభ్రం చేసుకుని సన్నగా తరిగి.. చిన్న ఉల్లి, వెల్లుల్లి, మిరియాలు చేర్చి వేపుడులా తయారు చేసి తీసుకుంటే ఉపశమనం లభిస్తుంది. ఇంకా అరటిపువ్వు శరీరంలో ఇన్సులిన్ స్థాయుల్ని పెంచుతుంది. తద్వారా డయాబెటిస్‌ను నియంత్రించవచ్చు.

అరటి పువ్వుని తినడం వల్ల జీర్ణక్రియ తేలికగా జరిగి సుఖ విరేచనం అవుతుంది. మలబద్దక సమస్యతో బాధపడేవారు అరటి పువ్వుని తీసుకోవడం వల్ల మంచి ఫలితం ఉంటుంది. అరటిపువ్వులో ఉంటే విటమిన్-C వ్యాధి నిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది. అరటి పువ్వులో ఉండే ఐరన్, కాల్షియం, పొటాషియం, మెగ్నీషియం, ఫాస్పరస్ మొదలైనవి నాడీవ్యవస్థ సక్రమంగా పనిచేసేలా చేస్తాయి. మూత్రపిండాల వ్యాధుల‌తో బాధపడేవారు, కిడ్నీల్లో రాళ్ల సమస్యతో బాధపడేవారికి కూడా అరటి పువ్వు మంచిదట.

వారానికి రెండుసార్లు అరటి పువ్వును పెసళ్లతో కలిపి కూర చేసుకుని తీసుకోవడం ద్వారా శరీర ఉష్ణోగ్రత క్రమంగా వుంటుంది. కీళ్ల నొప్పులకు అరటిపువ్వు దివ్యౌషధంగా పనిచేస్తుంది. వర్షాకాలంలో వేధించే జలుబు, దగ్గుకు అరటిపువ్వు జ్యూస్ ఉపశమనాన్ని ఇస్తుంది. అరటిపువ్వు రసాన్ని మిరియాల పొడితో కలిపి తీసుకుంటే.. దగ్గు తగ్గిపోతుంది. జలుబు మాయమవుతుందని ఆయుర్వేద నిపుణులు చెప్తున్నారు.

పాలిచ్చే త‌ల్లుల‌కు అరటి మంచి ఆహారమని నిపుణులు చెబుతున్నారు. స్త్రీల‌లో గ‌ర్భాశ‌య సంబంధ సమస్యలను దూరం చేసే శక్తి అరటి పువ్వుకు ఉందట. అరటిపువ్వును కూరగా చేసుకుని ఆరగించడం వల్ల జీర్ణాశ‌యంలో అల్స‌ర్లు కరిగిపోతాయట. వీర్య కణాల సమస్యతో ఇబ్బందిపడేవారు అరటిపువ్వుని ఆహారంలో భాగంగా చేసుకోవాలని ఆహార నిపుణులు చెబుతున్నారు. అరటి పువ్వు తినడం వల్ల వీర్యవృద్ధి జరిగి సంతానోత్పత్తి సామర్థ్యం పెరుగుతుందట.

డిప్రెషన్ లో ఉన్నప్పుడు యాంటీ డిప్రెజెంట్స్ కోసం వెతకాల్సి పనిలేదు, ఆందోళనగా ఉన్నప్పుడు, బనాన ఫ్లవర్ ను ట్రై చేయండి. బనానఫ్లవర్ లో ఉండే నేచురల్ యాంటీ డిప్రెసెట్స్ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా డిప్రెషన్ తగ్గిస్తుంది. గ్యాస్‌, అసిడిటీ సమస్యలతో బాధపడేవారికి అరటి పువ్వు మేలు చేస్తుందట. అరటి పువ్వు కూరతో హైబీపీ అదుపులో ఉంటుంది. ఫలితంగా గుండె సంబంధ వ్యాధులు దరిచేరవని ఆరోగ్య నిపుణులు తెలుపుతున్నారు.

ఆడవారిలో పీరియడ్స్ సమయంలో అధిక రక్తస్రావం కాకుండా అరటి పువ్వు అరికడుతుంది. పీరియడ్స్ లో మహిళల్లో వచ్చే పొట్ట నొప్పిని తగ్గిస్తుంది. కొంత మంది, చాలా తీవ్రంగా ఇబ్బంది పడుతుంటారు, ఇంకొంత మందిలో ఎక్సెసివ్ బ్లీడింగ్ అవుతుంది. ఈ సమయంలో ఒక కప్పు, ఉడికించిన అరిటిపువ్వును, పెరుగు తింటే , శరీరంలో ప్రొజెస్ట్రాన్ హార్మోన్ బ్లీడింగ్ ను తగ్గిస్తుంది. తెల్లబట్ట ఇబ్బందులను కూడా ఇది తొలగిస్తుంది.

Exit mobile version