సంక్రాంతి పండుగ వెనుక పురాణా గాథలు గురించి తెలుసా ?

తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంతో వైభవంగా జరుపుకుంటాము. సంక్రాంత్రి మూడురోజుల పండుగ. ప్రస్తుత రోజుల్లో సంక్రాంతి అంటే అందరూ బోగిపండ్లు, పిండివంటలు, ముగ్గులు, గాలిపటాలు అనే భావిస్తారు. కానీ అసలు ఈ పండుగ వెనుక పురాణాల్లో పలు గాథలు ఉన్నాయి. వాటిని గురించి తెలుసుకుందాం.

సంక్రాంతిసంక్రాంతి అంటే సూర్యుడు మకరరాశిలోకి ప్రవేశించే రోజు అని చాలామందికి తెలుసు. కానీ ఈ పండుగలో అంతకుమించిన ప్రత్యేకతలు చాలానే ఉన్నాయి. పూర్వం సగరుడు అనే రాజు ఉండేవాడు. ఆయనకు అరవైవేల మంది కొడుకులు. వీళ్లంతా ఓసారి కపిలముని ఆశ్రమంలోకి ప్రవేశించి, ఆయన తపస్సుని భంగం చేశారు. దాంతో కపిలముని వాళ్లందరినీ బూడిదగామార్చేశాడు.

సంక్రాంతిఆ బూడిద కుప్పల మీద గంగ ప్రవహిస్తే కానీ, వారి ఆత్మశాంతించదని తెలుస్తుంది. ఆకాశంలో ఉండే గంగని ఎవరూ నేల మీదకి తేలేకపోయారు. సగరుడి వంశంలో పుట్టిన భగీరధుడు ఈ పని చేయగలిగాడు. ఆయన తపస్సుకి మెచ్చి సంక్రాంతి రోజునే గంగమ్మ నేల మీద అవతరించింది.

సంక్రాంతిఇక సంక్రాంతికి గాలిపటాలు ఎగరవేయడం వెనుక ఓ కథ ఉంది. సంక్రాంతితో ఉత్తరాయణ పుణ్యకాలం మొదలవుతుందట. ఇది దేవతలకు పగలు అని నమ్మకం. దేవతలంతా ఈ కాలంలో ఆకాశంలో విహరిస్తారట. దేవతలకి స్వాగతం పలికేందుకు, వారి దృష్టిని ఆకర్షించేందుకు గాలిపటాలు ఎగరేయాలని చెబుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,760,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR