నరక చతుర్దశి వెనుక అసలు ఉదేశ్యం ఏమిటో తెలుసా ?

0
177

దీపావళికి ముందు రోజుని నరక చతుర్దశిగా జరుపుకుంటాము. ఆశ్వయుజ బహుళ చతుర్దశినే నరక చతుర్దశి అంటాం. నరకాసురుని సంహరించినందుకు దీపావళి జరుపుకుంటామనే విషయం తెలిసిందే. దుర్మార్గుడైన నరకాసురుని భూదేవి అవతారమైన సత్యభామాదేవి సంహరించి రాక్షసపీడ నుండి విముక్తి కలిగించడమే నరక చతుర్దశి వెనుక అసలు ఉదేశ్యం.

నరక చతుర్దశిఈ ఆశ్వయుజ బహుళ చతుర్దశినాడు లోక కంటకుడైన నరకుని మరణం సంభవించింది. యాదృచ్ఛికంగా నరకాసుని మరణం సత్యభామ రూపంలో తన తల్లి భూదేవి చేతిలోనే సంభవించింది. అయితే తన పుత్రుని పేరైనా కలకాలం నిలిచి ఉండేలా చేయమని సత్యభామ ప్రార్థించడంతో ఆ రోజు నరక చతుర్థశిగా పిలువబడుతుందని వరం ప్రసాదిస్తాడు శ్రీకృష్ణుడు.

నరక చతుర్దశినరకుని చెరనుండి సాధుజనులు, పదహారువేలమంది రాజకన్యలు విడిపించబడ్డారు, ధ్రర్మం సుప్రతిష్టమైంది. నరకాసురుని పీడ విరగడైందన్న సంతోషంతో ఆ మరుసటి రోజు ప్రజలు సంబరాలు జరుపుకుంటారు. ఈ సంబరాలు జరుపుకునే రోజు అమవాస్య కావడంతో, చీకటిని పారద్రోలుతూ ప్రజల దీపాలతో తోరణాలు వెలిగించి, బాణాసంచా కాల్చి వేడుక చేసుకున్నారు. కాలక్రమంలో అదే దీపావళి పర్వదినంగా మారింది.

నరక చతుర్దశిఇదంతా ధ్యాత్మికపరంగా… కానీ ఈ పండుగలకు, ఖగోళ సంఘటనలకు సంబంధం ఉంది. నరకాసుర వధ అనగా చతుర్దశి నాడు (ఆశ్వయుజ బహుళం) ఆకాశంలో రాసులస్తితిని సూచించేది. తులారాశి తూర్పు క్షితిజం మీద ఉదయిస్తుంటే పడమటి క్షితిజం మీద మేషరాశి అస్తమిస్తుంటుంది. నరకుడు భూదేవి కొడుకు. మేషం సహజంగా మంచిదే అయినా మూర్ఖత్వమూర్తి. కనుక అతని పాలన అంధకారమయం!

నరక చతుర్దశిఆ రోజు మేష రాశి సూర్యాస్తమయ సమయంలో ఉదయిస్తుంది. అది అస్తమించే వరకు చీకటే. మేష రాశి అస్తమించే వేళకు తులారాశి తూర్పు దిక్కున క్షితిజం మీదికి వస్తుంది. స్వాతి నక్షత్రానికి వాయువు దేవత. దాన్ని అధిష్టించి నరకుని మీదికి బయలుదేరిన కృష్ణుడు – సూర్యుడు, సత్యభామ-చంద్రుడు.

నరక చతుర్దశినరకుడు చనిపోగానే ఆకాశపు అంచులపై దీపచ్చాయాల్లో కన్యారాశి (కన్యల గుంపు) నరకుని బంధాలనుంచి విముక్తులై, తమను విడిపించిన సూర్యున్ని- కృష్ణున్ని నాయకునిగా చేసుకుంటారు. ఇలాంటి స్థితి నరక చతుర్దశి, దీపావళి రోజుల్లో తప్ప మిగిలిన రోజుల్లో లేదు. నరక భావాలు అంటే దుర్భావాలను, కృష్ణభక్తి అనే చక్రాయుధంతో ఖండింప చేసి, జీవుడు భవద్దర్శన ప్రాప్తితో ఆనందించాలి అనేది ఇందులోని అంతరార్ధం.

 

SHARE