అర్జునుడి రథంపై హనుమంతుడి చిహ్నం వెనుక కారణం తెలుసా

0
308

హనుమంతుడు లేని రామాయణం అసంపూర్ణం. లోకాభిరాముణ్ణి హృదయ మందిరంలో నిలుపుకున్న అంజనీసుతుడు చిరంజీవిగా భక్తుల గుండెల్లో నిలిచిపోయాడు. ఆనవాలు అందించి రఘురాముని కుశలము తెలిపి సీతమ్మ కృపకు పాత్రుడయ్యాడు. సంజీవిని తెచ్చి లక్ష్మణుడి ప్రాణాలను నిలిపాడు. రావణుడి లంకను దహనం చేసి రాముడి విజయంలో భాగమయ్యాడు.అలాంటి హనుమంతుడు లేకపోతే రామాయణం ఎలా పూర్తవుతుంది మరి.

Lord Hanumanకానీ హనుమంతుడి పాత్ర రామాయణంతో పూర్తవలేదు. చిరంజీవిగా వరం పొందిన హనుమంతుడు కురుక్షేత్ర యుద్ధంలో కూడా ఉన్నాడు. అదేంటి భారతంలో ఎక్కడా హనుమంతుడి గురించి చదవలేదే అనుకుంటున్నారా… హనుమాన్ ప్రత్యక్షంగా ఆయుధాలు పట్టి యుద్ధం చేయలేదు. కౌరవులతో యుద్ధంలో అర్జునుడి రథకేతనంపై పాండవుల విజయచిహ్నంగా నిలిచాడు హనుంతుడు. దీని వెనుక ఒక బలమైన కారణం ఉంది.

arjunaఒకానొక నాడు రామేశ్వరం వద్ద ఒక సాధారణ కోతి రూపంలో ఉన్న హనుమంతుడిని అర్జునుడు కలుసుకుంటాడు. అప్పుడు లంకకు వెళ్ళటానికి రాముడు నిర్మించిన వంతెన చూసిన అర్జునుడు “ఈ వంతెనను నిర్మించడానికి కోతుల సహాయం తీసుకున్నారా! అదే నేనయితే ఒక్కడినే బాణాలతో ఈ వంతెనను నిర్మించి ఉండేవాడినని అనుకున్నాడు. ఆ మాటలకు ఆగ్రహించిన హనుమాన్ వెటకారంగా నీ బాణంతో నిర్మించిన వంతెన అయితే ఒక్క వ్యక్తి బరువును కూడా మోసి ఉండేది కాదని విమర్శిస్తాడు. దాన్ని సవాలుగా తీసుకున్న అర్జునుడు, తాను నిర్మించిన వంతెన సంతృప్తికరంగా లేదంటే, అప్పుడు తాను అగ్నిలో దూకుతానంటాడు.

Arjunaఆ మరు నిమిషంలోనే తన శక్తిని ఉపయోగించి అర్జునుడు బాణాలతో ఒక వంతెన నిర్మిస్తాడు. కానీ వీర హనుమాన్ దానిపై కాలు మోపగానే ఆ వంతెన కూలిపోతుంది. అది చూసి నిశ్చేష్టుడైన అర్జునుడు తన జీవితం అంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అప్పుడు కృష్ణుడు అర్జునిని గెలిపించేందుకు కూర్మ రూపం దాల్చి ఆ వంతెనను మునిగిపోకుండా కాపాడతాడు. ఈసారి హనుమంతుడు తన బలం మొత్తం ఉపయోగించిన ఈసారి వంతెన కూలిపోలేదు. తరువాత తన బరువును మోస్తున్నది సాక్షాత్తు తన ఆరాద్యమైన శ్రీరాముడి అవతారమేనని గుర్తించి కృష్ణుణ్ణి క్షమాపణ కోరుతాడు.

Hanumanఆ తరువాత హనుమాన్ కృష్ణుడి ఆజ్ఞ మేరకు… జరగబోయే యుద్ధంలో అర్జునుడికి సహాయం చేస్తానని వాగ్దానం చేశాడు. అందుకే కురుక్షేత్ర యుద్ధం సంభవించినప్పుడు హనుమంతుడు అర్జునుని రథజెండాపై యుద్ధప్రారంభం నుండి ముగిసేవరకు ఉన్నాడు. కురుక్షేత్రయుద్ధం చివరి రోజున, కృష్ణుడు, అర్జునుడిని మొదటగా రథాన్ని దిగమని కోరాడు. అర్జునుడు క్రిందికి దిగిన తరువాత, శ్రీ కృష్ణుడు యుద్ధం అంతం వరకు అక్కడ ఉన్నందుకు హనుమంతుడికి ధన్యవాదాలు తెలిపాడు.

kurukshethramఅప్పుడు హనుమంతుడు వంగి నమస్కరించి రథం వదిలి వెళ్ళిపోతాడు. హనుమంతుడు వెళ్లిన వెంటనే రథం అగ్నికి ఆహుతి అయింది. ఇదంతా వీక్షించిన అర్జునుడు ఆశ్చర్యపోయాడు. అప్పుడు కృష్ణుడు “ఇప్పటివరకు హనుమంతుడు రక్షించటం వలన ఏ దివ్యధాలు ఏమి చేయలేకపోయాయి. లేనట్లయితే ఎప్పుడో రథం అగ్నికి ఆహుతి అయి వుండేదని” చెబుతాడు. ఆ విధంగా కురుక్షేత్రంలో హనుమంతుడు కూడా పాలు పంచుకొని ధర్మ యుద్ధాన్ని గెలిపించాడు.

SHARE