కంసుడు అక్రూరుడుని గోకులం పంపడానికి గల కారణం ఏమిటో తెలుసా ?

కృష్ణుని మేనమామ, క్రూరుడైన కంసునికి తనను చంపే పిల్లవాడు ఎక్కడో పెరుగుతున్నాడని, అతడిని నాశనం చేసేందుకు తను చేసిన ప్రయత్నాలన్నీ వ్యర్థమైపోయాయని తెలిసింది. ఒకనాడు కృష్ణుడు వచ్చి తనను వధిస్తాడనే భవిష్యవాణిని తరచు చుట్టూ ఉండే జనం అతనికి గుర్తు చేస్తూనే ఉన్నారు. ఆ బాలుడు రేపల్లెలో పెరుగుతున్నాడనే విషయం తెలుసుకొన్నాడు. కనుక ఏ విధంగానైనా బలరామునితో సహా మధురకు రప్పించి అతడిని కుట్ర పన్ని చంపించాలని నిర్ణయించుకున్నాడు. కృష్ణునికి బంధువైన అక్రూరుని శ్రీకృష్ణ బలరాములను మధురకు ఆహ్వానించి తీసుకొని రమ్మని నియమిస్తాడు.+

Sri Krishna Balaramaబలరామ కృష్ణులను ఆహ్వానించేందుకు ఒక సాకుగా కంసుడు ధనుర్యాగాన్ని ఏర్పాటు చేస్తాడు. ఆ కాలంలో ధనుర్యాగాన్ని చేయటం సర్వసాధారణం. ధనుర్యాగానికి రాజు ప్రత్యేకంగా ఒక ధనుస్సును నిర్మింపచేస్తాడు. అది సామాన్యులకు లేపటానికి గాని, ఎక్కుపెట్టానికి గాని సాధ్యం కాని విధంగా తయారు చేయిస్తారు. అత్యంత అనుభవశాలి, వీరుడు అయిన వాడు మాత్రమే ఆ ధనుస్సు నారిని బిగించి ఎక్కుపెట్టగలిగే విధంగా ఆ ధనుస్సు నిర్మిస్తారు. ధనస్సుకు గల నారిని సంధించి నిర్ణీతమైన గురిని కొట్టగలగిన వ్యక్తిని విజేతగా ప్రకిస్తారు. సాధారణంగా ధనువును ఎక్కుపెట్టి నారి సంధించి బాణ ప్రయోగం చేయటం అనేది స్వయంవరాలలోగాని, ఇతర శౌర్య పరీక్షలలో గాని ఏర్పాటు చేస్తారు. (సీతాస్వయం వరం, ద్రౌపది స్వయం వరం ఇటువంటి పరీక్షలే) ఈ ధనుర్యాగ సందర్భంలో కంసుడు అనేకమైన ఇతర క్రీడలను, బాహు యుద్ధం అని పిలువబడే మల్లయుద్ధాన్ని కూడా ఏర్పాటు చేసాడు.

Kamsuduఆ కాలంలో ఏవీరుడు గాని, రాజు గాని మల్లయుద్ధ ప్రవీణుడై ఉండటం అత్యంత అవసరం అని తలచేవారు. ఎందుకంటే అన్ని రకాల ఆయుధాలు నిరుపయోగమై పోయిన సందర్భం వస్తే వారికి బాహుయుద్ధం రక్షణ కలిగిస్తుంది. వీరుడైన వాడు చేతులతోనే శత్రువును బంధించటం తెలిసికొని ఉండటం అవసరమని, భావించేవారు. సైనికులకు ఆయుధాలను ఉపయోగించటమే కాక ఒకరితో ఒకరు కలియబడి యుద్ధం చేయటంలో కూడా శిక్షణ ఇస్తారు. ఈ బాహు యుద్ధం లేక మల్లయుద్ధం అనేది ఈ సంస్కృతిలో చిర కాలంగా వర్ధిల్లుతోంది. కంసుడు స్వయంగా గొప్ప మల్లయుద్ధ వీరుడు. అతని ఆస్థానంలో ప్రసిద్ధి పొందిన మల్లయోధులు ఎందరో ఉండేవారు.

Akuruduఒకవేళ మధుర చేరిన తరువాత కృష్ణుని చంపేందుకు ఏర్పాటు చేసిన ఇతర ప్రయతాలన్నీ విఫలమైతే, చివరగా కృష్ణుని మల్లయుద్ధపు బరిలో చంపించాలని నిశ్చయించుకున్నాడు. అంతకన్నా మరొక విధంగా యాదవులు చూస్తుండగా కృష్ణుని చంపటం సాధ్యంకాదు. యాదవులకు కృష్ణుడంటే ప్రాణం కన్నా ఎక్కువ. అతడు ఎన్నో సందర్భాలలో వారిని రక్షించిన కథలు అప్పటికే బాగా ప్రచారం పొందాయి. యాదవులతో పాటు మధురలోనూ అందరూ కృష్ణుని గురించి చెప్పుకుంటున్నారు. ఇవన్నీ వింటున్న, చూస్తున్న కంసునికి చిరాకుతో పాటుగా అంతరంగంలో ఒక విధమైన భయం కూడా కలిగింది. ఆ భయం వల్లనే కంసుడు ధనుర్యాగం మిషతో కృష్ణుని మధురకు రప్పించి అంతం చెయ్యాలని ఏర్పాట్లు చేసాడు. ఈ పనికి అక్రూరుడు సరియైన వాడని భావించి అక్రూరుని గోకులానికి పంపించాడు.

Sri Krishnaబలరామ కృష్ణులను మధురకు ఆహ్వానించేందుకై వచ్చిన అక్రూరుడు ప్రపంచాన్ని గ్రహించినవాడు, సాధుశీలి. అతడు బలరామ కృష్ణులను చూడగానే పూర్తిగా కృష్ణుని ప్రభావంలో మునిగిపోయాడు. భవిష్యవాణి చెప్పిన వ్యక్తి నిజంగా ఇతడేనా?’ అనే సందేహం పదహారేళ్ళ కృష్ణుని చూసినప్పుడు ఏభైఏళ్ళ అక్రూరుడికి వచ్చింది ‘ఇతడు భగవంతుని అవతారమా, ఈ చిన్న బాలుడు ప్రపంచాన్ని కాపాడే వాడా?’ ఎన్నో ప్రశ్నలు అక్రూరునిలో చెలరేగాయి.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,530,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR