Home Unknown facts గంగా నది భూమి మీదికి రావడానికి కారణమేమిటో తెలుసా ?

గంగా నది భూమి మీదికి రావడానికి కారణమేమిటో తెలుసా ?

0

పురాణాల్లో గంగా దేవికి సంబంధించిన చాలా కథలు ఉన్నాయి. అయితే ఒక కథ ప్రకారం, ఒకసారి నారదుడు భూలోకానికి వచ్చాడు, హిమాలయ ప్రాంతాలకు చేరుకునేసరికి సాయంత్రం అయింది. అక్కడి ప్రకృతి సౌందర్యానికి పరవశించిపోతుండగా, అప్పుడే అతనికి వినడానికి ఎంతో వినసొంపుగా ఉన్న చక్కని సంగీతధ్వనులు వినిపించసాగాయి.

Do you know the reason why the river Ganga came to earthఆ ప్రకృతిమాత అందించిన పారవశ్యంలో మునిగిపోయి ముందుకు కదిలిన నారదుడు బండరాళ్ళపై పాకుకుంటూ వెళ్తున్న ఒక బృందాన్ని చూశాడు. చూపులకు ఎంతో అందంగా కనిపించినప్పటికీ, ఏదో ఒక అవయవ లోపంతో ఉండటం కనిపించింది. నారదుడు విషయమేమిటని అడిగాడు. అప్పుడు వారు తాము గంధర్వులమని, తాము సంగీతంలోని రాగాలమనీ, ఏ గాయకుడైనా పాడుతున్నప్పుడు, వారి గొంతులో అపశ్రుతులు దొర్లినా, గాత్రంలో గర్వం, అహంకారం పొడచూపినా, రాగలక్షణాలను పట్టించుకోపోయినా తమకు దెబ్బలు తగులుతుంటాయని చెప్పారు.

అందుకేధైనా తరుణోపాయం లేదా? అని నారదుడు అడిగాడు, శివుడు గానం చేస్తే, తమకు ఈ దురావస్థ తప్పుతుందని వారు చెప్పారు. వారి మాటలను విన్న నారదుడు, కైలాసానికి వెళ్ళి శివుని పాడాల్సిందిగా అభ్యర్థించాడు. నారదుని అభ్యర్థనను విన్న శివుడు, పాడేందుకు తనకెలాంటి అభ్యంతరాలు లేవనీ, అయితే, తను పాడుతున్నప్పుడు విని ఆనందించగలిగే శ్రోతలు కావాలని షరతు పెట్టాడు.

శ్రోతలుగా బ్రహ్మ, విష్ణువులను ఆహ్వానించిన నారదుడు, అంగవైకల్యం గల గంధర్వులను కూడా అక్కడికి రప్పించాడు. శివుని గానంతో విశ్వమంతా మునకలేసింది. క్షణంలో గంధర్వుల అంగవైకల్యం మాయమైంది. అంతటితో కథ ఆగితే విశేషం ఏముంది. శివుని పాటలో మునిగి మైమరచిపోయిన విష్ణువు దేహం కరిగిపోయి నీరై ప్రవహించడం మొదలైయింది. ఈ సంగతిని గమనించిన బ్రహ్మ, ఆ నీటిని తన కమండలంలోకి తీసుకున్నాడు. కొన్ని యుగాలపాటు ఆ నీరు కమండలంలోనే ఉండిపోయింది. దివినుంచి భువికిదిగిన గంగ శివుని జటలపై ముందుగా కాలుపెట్టి, అనంతరం ఈ భూమిపై అడుగుపెట్టిన విషయం మనకు తెలిసిందే. అయితే, అదే గంగను శివుడు తన జటలో బంధించిన ఉందంతం ఒకటి ఉంది.

పూర్వ కాలంలో ఒకసారి భూమిపై భయంకర దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. ఎటుచూసినా నీటి చుక్క లేక భూమి బీటలు వారింది. ఆ స్థితిని చూసిన మునీశ్వరులంతా సత్యలోకానికి వెళ్ళి బ్రహ్మదేవునితో, “స్వామీ! నిత్య నైమిత్తిక కర్మలను ఆచరించడానికి, స్నాన, పానాలకు మాకు నీరే లేదు. మమ్మల్ని అనుగ్రహించి నీటి ఇబ్బందిని తొలగించు స్వామీ!” అని వేడుకున్నారు. వారి ప్రార్థనలను విన్న చతుర్ముఖుడు తన కమండలంలోని ఒక బిందువును వదిలాడు.

ఆ చిన్న నీటి బిందువే మహా ప్రవాహమై తరంగాలతో ఉవ్వెత్తున లేచి గలగలా ధ్వనులతో ప్రవహిస్తూ చివరికి ఈ భూమండలాన్నంత ఆక్రమించేట్లుగా విజృంభించింది. జరుగబోయే ఉపద్రవాన్ని గమనించిన శంకరుడు సకల లోకవాసులను కాపాడేందుకు ఆ జలాన్ని తన జటాజూటంలో బంధించి ఒక బిందువును మాత్రం ప్రజోపయోగాని కోసం మానస సరోవరంలో వదిలాడని పురాణాలు చెబుతున్నాయి.

 

Exit mobile version