Home Health చలికాలంలో బరువు పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

చలికాలంలో బరువు పెరగడానికి గల కారణాలు ఏంటో తెలుసా ?

0

చలికాలం వచ్చిందంటే బద్దకం ఎక్కువ అవుతుంది. చాలా మంది బరువు పెరుగుతారు. ఇలా బరువు పెరగడం వల్ల పలు ఆరోగ్య సమస్యలు కూడా వస్తాయి. జ్వరం, జలుబు, ఫ్లూ, అర్థరైటిస్, చర్మం, శ్వాసకోశ వ్యాధులు వస్తాయి. అంతేకాకుండా బరువు హెచ్చుతగ్గులకు దారితీస్తుంది. ఓ అధ్యయనం ప్రకారం చలికాలంలో చాలా మంది మూడు నుంచి ఐదు కిలోల బరువు పెరుగుతారు. ఇలా బరువు పెరగడానికి కారణాలేంటో తెలుసుకుందాం…

winter seasonచలికాలంలో మన మానసిక స్థితి తీవ్రంగా ప్రభావితం అవుతుంది. సూర్యరశ్మి తగినంత లేకపోవడం వల్ల చాలా మందిలో సీజనల్ ఎఫెక్టివ్ డిజార్డర్(SAD) అభివృద్ధి చెందడానికి దారితీస్తుంది. ఇది ఓ రకమైన క్లినికల్ డిప్రెషన్. తరచుగా అతిగా తినడం, తక్కువ ఆహార ఎంపికలు, వంటి వాటివలన కాలక్రమేణా ఓ వ్యక్తి బరువు పెరగవచ్చు. ఈ సమస్యలను అధిగమించడానికి సాధ్యమైనప్పుడల్లా సూర్యకాంతిలో కొంత సమయాన్ని గడపడానికి ప్రయత్నించండి.

ఆరోగ్యకరంగా బరువు తాగించుకోదని తాగించుకోడానికి తగినన్నీ నీటిని తీసుకోవాలి. వేసవిలో చేతిలో తప్పనిసరిగా వాటర్ బాటిల్ ఉంటుంది. శీతాకాలంలో మాత్రం నీటిని దూరంగా ఉంచుతారు. ఫలితంగా డీహైడ్రేషన్ అవ్వడమే కాకుండా ఆకలి అనుభూతిని కలుగుతుంది. కాబట్టి శీతాకాలంలో బరువును అదుపులో ఉంచుకోవడానికి ప్రతిరోజూ- 2 నుంచి 3 లీటర్ల నీరును తాగడానికి ప్రయత్నిచండి. ఉష్ణోగ్రత తగ్గడంతో ఎల్లప్పుడూ భారీ లేదా వెడిగా ఉండే ఆహారాలను ఎంచుకోవాలి. వెచ్చని ఆహారం శరీర ఉష్ణోగ్రత పెంచడానికి, మానసిక స్థితిని పెంచేందుకు సహాయపడుతుంది. బరువు పెరగకుండా ఉండేందుకు క్రీమీ సూప్ కు బదులుగా స్పష్టమైన సూప్ లాంటి ఆరోగ్యకరమైన ప్రత్యామ్నాయల కోసం చూడాలి. అలాగే అధిక కేలరీలను బర్న్ చేయడానికి మిమ్మల్ని మీరు చురుకుగా ఉండేందుకు ప్రయత్నించండి.

చల్లని వాతవారణం వల్ల ప్రజలు ఎక్కువగా ఇంటి లోపల ఉండేందుకే ఇష్టపడతారు. శీతాకాలంలో చాలా మంది మంచానేకి అతుక్కుపోయి ఉంటారు. నిద్రపోవడం, కాలక్షేపం కూడా మంచానికే పరిమితమవుతుంది. ఫలితంగా శారీరక శ్రమ స్థాయి తగ్గుతుంది. అంతేకాకుండా చాలా మంది నడక, జాగింగ్ లాంటి నిత్యకృత్యాలను దాటవేస్తారు. తీసుకునే కేలరీలను కూడా బర్న్ చేయరు. చివరకు శరీరంలో కొవ్వు పెరిగుతుంది. కాబట్టి ఈ సీజన్ లో చురుకుగా ఉండాలంటే వ్యాయామానికి ఎక్కువ సమయం కేటాయించండి. స్నేహితులు లేదా సహచరులతో కలిసి శారీరక శ్రమ చేయడానికి ప్రయత్నించండి.

డయాబెటిస్, థైరాయిడ్ తో బాధపడుతున్న వ్యక్తులు ఈ సీజన్లో నిజమైన సవాలును ఎదుర్కొంటారు. అంతేకాకుండా ఈ కాలంలో సాధారణంగానే హార్మోన్లు నియంత్రణలో ఉండవు. అసమతూల్య హార్మోన్లు ప్రజలను ఎక్కువగా తినడానికి లేదా బరువును తగ్గించేందుకు కారణమవుతాయి.

 

Exit mobile version