ఏయే ఆకులో భోజనం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో తెలుసా ?

విదేశీయుల మోజులో పడి పాశ్చ్యత్య సంస్కృతి ముసుగులో, ఆధునికత పేరుతో మన ఆచారాలను వాటి వెనుక ఉన్న శాస్త్రీయతను కోల్పోతున్నాం. పొద్దునే లేచిన దగ్గర నుంచి పడుకునేవరకు ఏరోజువి ఆరోజే తాజాగా వాడటం మన పూర్వీకుల అలవాటు. అవి కూడా ప్రకృతి ఒడిలో సహజ సిద్ధమైనవి వాడేవారు. వాటివల్ల ఆరోగ్యం. పర్యావరణ హితం జరిగేవి.

ఆకులో భోజనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందటకానీ ఇప్పుడు సులభంగా ఉండాలని ఆధునిక పద్ధతులకు అలవాటు పడిపోయాం. రోజు మొదలైనప్పటి నుండి పడుకునే వరకు ప్రతీది ప్లాస్టిక్ మాయమైపోయింది. మన తాతలు, ముత్తాతలు నిత్యం భోజనం చేయడానికి ఆకులు వాడేవారు. దానివల్ల ఎక్కువ కాలం ఆరోగ్యంగా ఉండేవారు. ఆకులో భోజనం చేయడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయి అయితే ఏయే ఆకులో భోజనం చేస్తే ఏ ఫలితాలు ఉంటాయో తెలుసుకుందాం.

ఆకులో భోజనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందటఅరటి ఆకులో భోజనం చేయడానికి పెట్టడానికి కారణం అన్నంలో ఒకవేళ విషం కలిపితే ఆకు నలుపు రంగుగా మారిపోతుంది, వేడి అన్నం వడ్డిస్తే ఆకులోని అనేక రకాల పోషకాలు ఈ అరటి ఆకులో ఉన్నందున మంచి రుచిని కలిగిస్తాయి. పర్యావరణానికి విఘాతం కలుగకుండా తేలికగా మట్టిలో కలిసిపోతాయి. అందుకే ఇంటికి వచ్చిన అతిధుల మనసులో అనుమానం రాకూడదనే ఉద్దేశంతోనే అరిటాకులో భోజనం పెడతారు.

ఆకులో భోజనం చేస్తే ఐశ్వర్యం కలుగుతుందట

  • అరటి ఆకు విస్తరిలో భోజనం చేయడం వలన ఆకలి పెరుగుతుంది, ఆరోగ్యవంతులుగా ఉంటారు.
  • తామరాకులో భోజనం చేయడం వలన ఐశ్వర్యం కలిగి సాక్షాత్ లక్ష్మీ దేవి కటాక్షం కలుగుతుంది.
  • బాదం ఆకులో భోజనం చేయడం వలన కఠిన హృదయులవుతారు.
  • టేకు ఆకులో భోజనం చేయడం వలన భవిష్యత్ వర్తమానాలు తెలుసుకోగలిగే జ్ఞానం వస్తుంది.
  • జమ్మి ఆకు విస్తరిలో భోజనం చేస్తే లోకాన్ని జయించే శక్తి సంపాదించవచ్చునని మన పెద్దలు చెబుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR