Home Unknown facts త్వర త్వరగా ప్రదక్షిణలు చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి

త్వర త్వరగా ప్రదక్షిణలు చేస్తున్నారా? ఒక్క నిమిషం ఆగండి

0

గుడికి వెళ్ళేదే ప్రశాంతంగా దేవుణ్ణి ధ్యానించడానికి అలాంటప్పుడు ఆగమేఘాలమీద ప్రదిక్షణలు చేస్తారెందుకు. అసలు ప్రదక్షిణలు చేసే నియమాలు ఏంటో తెలుసుకుందాం. ఏ గుడిలొనైనను ప్రదక్షిణలు చేసేటప్పుడు, ఒక తొమ్మిది నెలల గర్భిణి స్త్రీ ఎంత నిధానముగ నడుస్తుందో అంత నిధానముగ నడుచుకుంటూ ప్రదక్షిణలు చేయాలి కాని, అంతకు మించిన వేగముతొ చేయరాదు.

ప్రదక్షిణలుఎన్ని ప్రదక్షిణలు చేసామో లెక్కపెట్టుకోడానికి, వక్కలు, పసుపు కొమ్ములు లేక బియ్యము కాని వినియోగించుకోవాలి తప్ప వేళ్ళతో లెక్కపెట్టొకొవడము, పేపర్ మీద గళ్ళు వేసుకుని పెన్సిల్తో గుర్తు పెట్టుకోడము లాంటివి కూడదు.

శ్రీ పరాశర మహర్షి’ వారు పెట్టిన నియమము ప్రకారం, మనము ఎన్ని ప్రదక్షిణలు చేయదలుచుకున్న, ప్రతి ప్రదక్షిణము తరువాత ఒక చోట ఆగి ఈ శ్లోకం చెప్పుకుని తిరిగి ప్రదక్షిణము చేయవలెను. వేరే ఏ శ్లోకాలు చెప్పరాదట.

!!ఆంజనేయం మహావీరం బ్రహ్మ విష్ణు శివాత్మకం

అరుణార్కం ప్రభుం శమథం రామదూతం నమామ్యహం !!
బయటికి చదవటం ఇబ్బందిగా ఉంటే మనసులో చదువుకున్న సరిపోతుంది.

Exit mobile version