ఐస్ టీ ప్రత్యేకతలు ఏంటో తెలుసా?

ప్రపంచవ్యాప్తంగా టీ తాగేవారి సంఖ్య రోజు రోజుకి పెరిగిపోతుంది. టీని ఆసియా దేశాలతోపాటూ… బ్రిటన్, రష్యాలో కూడా ఎక్కువగా తాగుతారు. అది బ్లాక్ టీ అయినా, గ్రీన్ టీ అయినా, ఏదైనా సరే… తేయాకు మొక్కల నుంచే వస్తుంది. అది ఆరోగ్యానికి మేలే చేస్తుంది. చాలా మందికి ఉద‌యం లేవ‌గానే వేడి వేడిగా ఓ క‌ప్పు టీ తాగే అల‌వాటు ఉంటుంది.అలాగే కాస్త తలనొప్పిగా అనిపించినా, తల తిరిగిన‌ట్టు ఉన్నా, ఒత్తిడిగా ఉన్నా, బ‌ద్ద‌కం నుంచి బ‌య‌ట ‌ప‌డాల‌నుకున్నా చాలా మంది టీనే ఎంచుకుంటారు.
టీ తాగడం వ‌ల్ల మంచి ఉత్తేజాన్ని పొందుతారు. అయితే టీ అనగానే వేడివేడిగా మనలో చాలామందికి తెలుసు. కొంతమందికి కోల్డ్ కాఫీ తాగడం అలవాటు ఉందనుకోండి, కానీ ఐస్ టీ గురించి చాలా తక్కువ మందికి తెలిసి ఉంటుంది. కొంతమంది ఈ పేరు కూడా ఎప్పుడు విని ఉండరు. కానీ వేడి వేడి టీ కంటే ఐస్ టీ ఆరోగ్యానికి ఇంకా మంచిదంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఐస్ టీ తాగితే మానసిక ఉల్లాసమే కాదు… ఎన్నో పోషకాల్ని పొందేందుకు వీలవుతుందంటున్నారు.
ఐస్ టీలో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి.ఈ యాంటీఆక్సిడెంట్లు శరీరంలోని మలినాలను, వ్యర్ధాలను బ‌య‌ట‌కు పంపుతాయి. దాంతో మీ చ‌ర్మం య‌వ్వ‌నంగా, కాంతివంతంగా ఉంటుంది. పండ్లు, కూరగాయల్లో కంటే… 8 రెట్లు ఎక్కువగా టీలో పాలీఫెనాల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి.
ఈ సీజ‌న్‌లో చాలా మంది డీహైడ్రేష‌న్‌కు గ‌ర‌వుతుంటారు. కానీ రోజుకో క‌ప్పు ఐస్ టీ తాగితే శ‌రీరంలో హైడ్రేటెడ్‌గా ఉంటుంది. ఐస్ టీని రెగ్యులర్‌గా తాగుతూ ఉంటే… మన బాడీలో లిక్విడ్స్ లెవెల్స్ పెరుగుతాయి. అవి ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
వెయిట్ లాస్ అవ్వాల‌ని ప్ర‌య‌త్నించే వారు, రెగ్యుల‌ర్‌గా ఐస్ టీ తీసుకోవ‌డం మంచిది.ఐస్ టీ తీసుకుంటే శ‌రీరంలో కొవ్వు క‌రుగుతుంది. 350 గ్రాముల కోలా డ్రింకులో 39 గ్రాముల పంచదార ఉంటుంది. అది 9న్నర టీస్పూన్‌లకు సమానం. దాని వల్ల 140 కేలరీల శక్తి వస్తుంది. అదే 350 గ్రాముల స్వీట్ లేని ఐస్ టీలో షుగర్ ఉండదు. 2 కేలరీల శక్తే వస్తుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఈ టీ తాగవచ్చు.
శరీరానికి ఎక్కువగా మాంగనీస్ కావాలనుకునేవారు… ఐస్ టీ తాగాలి. 300 గ్రాముల బ్లాక్ ఐస్ టీ… 520 మైక్రో గ్రాముల మాంగనీస్ ఇస్తుంది. అది రోజువారీ మహిళలకు కావాల్సిన మాంగనీసులో 35 శాతం కవర్ చేస్తుంది. మగవాళ్లకైతే… 23 శాతం కవర్ చేస్తుంది. మాంగనీస్ వల్ల దెబ్బలు త్వరగా తగ్గుతాయి. ఎముకలు గట్టిపడతాయి.
అలాగే క్యాన్స‌ర్ వంటి ప్రాణాంత‌క వ్యాధితో పోరాడే పోష‌కాలు ఐస్ టీలో ఉంటాయి. అందువ‌ల్ల ఐస్ టీని తీసుకుంటే క్యాన్స‌ర్ వ్యాధికి దూరంగా ఉండొచ్చు. టీలో ఉండే పోషకాలు కాన్సర్‌తో పోరాడతాయని 3వేలకు పైగా పరిశోధనల్లో తేలింది.
అంతేకాదు ఐస్ టీ తీసుకోవ‌డం వ‌ల్ల గుండె పోటు మ‌రియు ఇత‌ర గుండె సంబంధిత జ‌బ్బులు వ‌చ్చే రిస్క్ తగ్గుతుంది. ఇక ఐస్ టీ తీసుకుంటే ఒత్తిడి, డిప్రెష‌న్‌, త‌ల‌నొప్పి వంటి స‌మ‌స్య‌లు ద‌రి చేర‌కుండా ఉంటాయి. రోజూ 4 కప్పుల చొప్పున… ఆరు వారాల పాటు ఈ టీ తాగితే… బ్లడ్‌లో కార్టిసాల్ అనే స్ట్రెస్ హార్మోన్‌ తగ్గుతుంది. దంతాల్ని పాడు చేసే కేవిటీస్‌ను నాశ‌నం చేయ‌డంలో ఐస్ టీ అద్భుతంగా స‌హాయ‌ప‌డుతుంది. కాబ‌ట్టి, రోజుకో క‌ప్పు ఐస్ టీని తీసుకుంటే దంతాల ఆరోగ్యం కూడా మెరుగుప‌డుతుంది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR