Home Unknown facts శ్రీరాముడు అశ్వమేధయాగం వెనుక జరిగిన కథ ఏంటో తెలుసా ?

శ్రీరాముడు అశ్వమేధయాగం వెనుక జరిగిన కథ ఏంటో తెలుసా ?

0

దశరధ మహారాజు శ్రీరాముడు యవ్వన దశలో ఉన్నపుడు అశ్వమేధ యాగం జరిపిస్తాడు. అప్పుడు ప్రజలందరూ సంతోషంగా జీవనం సాగిస్తారు. పట్టాభిషేకం జరిగిన తరువాత శ్రీరాముడు అపవాదం భయంవల్ల సీతను అడవిలో విడిచిపెట్టేస్తాడు. అప్పటి నుండి అయోధ్య నగరంలో కరువు తాండవిస్తుంది. అందువల్ల శ్రీరాముడు అశ్వమేధయాగం చేయడానికి నిశ్చయించుకుంటాడు. సీతదేవి పక్కన లేకుండా యాగం చేయకూడదని పండితులు చెబుతారు.

హనుమంతుడు, శివుడికి మధ్య యుద్ధంస్వర్ణసీతాప్రతిమతో సంకల్పం జరుగుతుంది. అశ్వాన్ని పూజించి, విడుస్తారు. దానివెనుక శత్రుఘ్నుడు, అతని కుమారులు కూడా వెళతారు. రుక్మాందగుడు అనే ఒకడు గుర్రాన్ని పట్టుకోగా.. శత్రఘ్నుడు వానిని జయిస్తాడు. తరువాత ఆ అశ్వం రేవానదిలో మునిగిపోతుంది.

హనుమంతుడు, శత్రుఘ్నుడు పాతాళానికి వెళతారు. అక్కడ ఒక కన్య వీరికి కనబడి.. ‘‘రామకార్యం కోసం సహాయం అందించడానికి నేను ఈ అశ్వాన్ని తీసుకొచ్చాను. వాడీశ్వరుని వరంవల్ల ఎవరైతే అజేయుడుగా వుంటాడో.. అతనిని జయించడానికి నేనొక మంత్రం నీకిస్తాను’’ అని శత్రఘ్నుడికి ఆ మంత్రాన్ని ఉపదేశిస్తుంది.

అక్కడి నుండి అశ్వం మళ్ళీ బయలుదేరుతుంది. అశ్వాన్ని వీరమణి పట్టుకుంటాడు. అతనితో యుద్ధం చేస్తాడు శత్రజ్ఞుడు. అతనికి ఉన్న వరం వల్ల శివుడు శత్రజ్ఞుడికి అడ్డు పడతాడు. శత్రుఘ్నుడికి శివుడికి యుద్ధం జరుగుతుంది. శివుని త్రిశూలం దెబ్బకు శత్రఘ్నుడు మూర్ఛపోగా.. అతనితో వచ్చిన హనుమంతుడు శివుడితో యుద్ధానికి దిగుతాడు. శివుని రథాన్ని, శూలాన్ని విరగగొట్టి, రాళ్ల వర్షం కురిపిస్తాడు హనుమంతుడు.

అప్పుడు శివుడు అతని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించగా.. హనుమంతుడు తన తోకతో కొడతాడు. శివుడు హనుమంతుడి శక్తిని మెచ్చి.. ‘‘నీకేం వరం కావాలో కోరుకో’’ అని చెబుతాడు. అప్పుడు హనుమంతుడు ‘‘శత్రుఘ్నుడ్ని బ్రతికించు’’ అని కోరుకుంటాడు. అప్పుడు శివుడు సంజీవని గురించి హనుమంతుడికి వివరిస్తాడు. హనుమంతుడు.. ‘‘నేను అక్కడికి వెళ్లి తిరిగివచ్చేవరకు ఈయనను కాపాడు’’ అని చెప్పి, ద్రోణపర్వతానికి వెళ్లి, అక్కడ అడ్డుపడేవారందరినీ జయించి.. సంజీవని ఔషదాన్ని తీసుకొచ్చి రామానుజుని కాపాడుతాడు.

శత్రఘ్నుడు కన్య ఇచ్చిన సమ్మోహనాస్త్రం ద్వారా వీరమణిని వశపరుచుకుంటాడు. వాల్మీకి ఆశ్రమానికి అశ్వం వెళ్లగా కుశలవులు అశ్వాన్ని పట్టుకుంటారు. శత్రఘ్నుడు వారి నుంచి అశ్వాన్ని విడిపించడానికి యుద్ధం చేస్తాడు. కానీ కుశుని బాణంవల్ల అతడు మూర్ఛపోతాడు. ఆంజనేయుడు కుశునినిమీద ఒక చెట్టును వేయగా.. కుశుడు దానిని భగ్నంచేసి, సంహారాస్త్రంతో హనుమంతుడిని కొడతాడు. దాంతో హనుమంతుడు కూడా మూర్ఛపోతాడు. సుగ్రీవుడు అతనిమీద దాడిచేయడానికి ముందుకురాగా, వారుణాస్త్రంతో అతడిని బంధించేస్తాడు.

అశ్వ రక్షణకు వచ్చిన అంగదపుష్కలాదులను పడగొట్టి.. కుశలవులు అశ్వాన్ని తీసుకొచ్చి సీతకు చూపిస్తారు. అప్పుడు ఆమె వారిని మందలించి, రామయాగానికి భగ్నం కలిగించరాదని చెప్పి, సూర్యుని ప్రార్థించి, రణంలో చనిపోయినవారిని బ్రతికించి, అశ్వాన్ని ఇప్పిస్తుంది. వారు అశ్వంతో అయోధ్యకు చేరుకుని, సీతాకుశలవుల వృత్తాంతం అని చెప్పగా.. రాముడు వారిని అయోధ్యకు పిలిపిస్తాడు. సకలజనుల ఆమోదం పొంది, సీతతో కలిసి యాగం పూర్తిచేయడానికి అశ్వాన్ని సంహరించబోగా.. రాముని చేయి తగిలి అధి దివ్యరూపం ధరిస్తుంది. ‘‘తాను ఒక బ్రాహ్మనుడని, ఆడంబరంతో జనాలను వంచించి, ధనసంపాదన చేస్తుండగా.. దుర్వాసుడు శపించాడు. రాముడి చేయి తగలి విముక్తి పొందాను’’ అని చెప్పి దేవలోకానికి వెళ్లిపోతాడు. రాముడు వసిష్ఠాదిమహామునులతో ఆలోచించి.. కర్పూరంతో హోమాన్ని చేసి, దేవతలను ఆహ్వానించిగా.. వారు వచ్చి హవ్యాలు స్వీకరించారు. పూర్ణహుతి, అవతృథ స్నానాలు చేసుకుంటారు. ఈ యాగం పూర్తయిన తరువాత రాముడు మూడశ్వమేధయాగాలు చేసి, బ్రహ్మహత్యదోష విముక్తడవుతాడు. తరువాత సీత మాత భూగర్భంలోకి వెళ్ళిపోతుంది.

 

Exit mobile version