Home Health విటమిన్ సి యొక్క ఉపయోగాలు తెలుసా ?

విటమిన్ సి యొక్క ఉపయోగాలు తెలుసా ?

0

విటమిన్ సి అనేది నీటిలో కరిగే విటమిన్. ఇది నారింజ మరియు నిమ్మకాయలు వంటి కొన్ని ఆహార పదార్ధాలలో సహజంగా ఉంటుంది. మరియు ఈ విటమిన్ ఆహార-సంబంధమైనదిగా కూడా అందుబాటులో ఉంటుంది. సి విటమిన్ ని “L- అస్కోర్బిక్ ఆమ్లం” అని కూడా పిలుస్తారు.

Vitamin Cవిటమిన్ సి యొక్క కొన్ని ఉపయోగాలు తెలుసుకుందాం :

గాయాలు మాన్పడానికి విటమిన్ సి: గాయాల్ని మాన్పె ప్రక్రియలో విటమిన్ సి కీలక పాత్ర పోషిస్తుందని పరిశోధకులు పేర్కొన్నారు, మరియు గాయాలు తగ్గుముఖం పట్టె ప్రక్రియలోని ప్రతి దశలోనూ సి విటమిన్ అవసరమవుతుంది. పుండు యొక్క వాపు దశలో “న్యూట్రోఫిల్ అపోప్టోసిస్” అనే ప్రమాదాన్ని తగ్గించడంలో విటమిన్ సి ఎంతో అవసరం.

ఎముకులకు విటమిన్ సి: ఎముకలతో ఉండే ముఖ్యమైన ప్రోటీన్ కొల్లాజెన్. కొల్లాజెన్ జీవక్రియలో విటమిన్ సి చాలా ముఖ్యమైనది. చాలా పరిశోధనలు ఎముకల ఆరోగ్యానికి విటమిన్ సి ముఖ్యమైనదని తెలుపుతున్నాయి.

ఐరన్ మరియు విటమిన్ సి: ఐరన్ శోషణకు విటమిన్ సి అనేది ఎంతో అవసరం, ఆహరంలో ఉన్న ఐరన్ ధాతువులని శరీరంలోకి తీసుకోవడం లో విటమిన్ సి సహాయపడుతుంది.

వ్యాధినిరోధశక్తికి విటమిన్ సి అనుబంధకాలు: విటమిన్ సి అనేది తెల్లరక్తకణాల ఉత్పత్తిని పెంచి, శరీరంలో వ్యాధినిరోధక శక్తి పెరగడానికి సహాయం చేస్తుంది. శరీరం పై అలాగే స్వేచ్ఛ రాశుల (free radicles) యొక్క ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది.

జ్ఞాపక శక్తికి విటమిన్ సి: విటమిన్ సి కి ఉన్న గొప్ప యాంటీఆక్సిడెంట్ లక్షణాలు మెదడులో ఆక్సిజన్ ఒత్తిడిని తగ్గిస్తాయి తద్వారా అది వయసు సంబంధిత మతిమరుపు వంటి ఇతర మెదడు సమస్యలను నివారిస్తుంది.

గౌట్ కోసం: తినే ఆహారంలో విటమిన్ సి ను చేర్చడం ద్వారా గౌట్ సమస్య నుండి విముక్తి పొందవచ్చు. అధ్యయనాలలో విటమిన్ సి ఉన్న ఆహారాలను తినడం అనేది గౌట్ ను తగ్గించడంలో ప్రత్యక్ష సంబంధం ఉందని తెలిసింది.

పంటి చిగుళ్ల కోసం: విటమిన్ సి పంటి చిగుళ్ల నిర్మాణాన్ని కాపాడడమే కాక నోటిలో ఉండే వ్యాధి కారక సుక్ష్మ్యా క్రిములను నివారిస్తుంది. పంటి సమస్యలు ఉన్నపుడు దంతవైద్యులు విటమిన్ సి ఉన్న పేస్టులను , మౌత్ వాషులను సూచిస్తారు.

క్యాన్సర్ నివారణకు: క్యాన్సర్ నివారణకు తరచుగా విటమిన్ సి ఉన్న పళ్ళు మరియు ఆహారాలు సూచించబడతాయి. విటమిన్ సి కి ఉన్న యాంటీఆక్సిడెంట్ లక్షణాలు దీనికి కారణం కావొచ్చు.

మధుమేహం కోసం: విటమిన్ సి శరీరంలో సాధారణ చెక్కెర స్థాయిలను నిర్వహించడంలో సహాయపడుతుంది.

ఎలాంటి ఆహార ఉత్పత్తుల్లోనూ మరియు పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది చూద్దాం

Vitamin C

  • నారింజ, నిమ్మ, ద్రాక్షపండు, తీపి నిమ్మకాయ వంటి నిమ్మజాతి (సిట్రస్) పండ్లు.
  • స్ట్రాబెర్రీ, గూస్బెర్రీ, బ్లూబెర్రీ, మేడిపండు మరియు క్రాన్బెర్రీ వంటి బెర్రీస్ లేదా మృదు ఫలాలు.
  • దోసకాయ మరియు పుచ్చకాయ.
  • టొమాటాలు,అనాస పండు,కివి పండు,జామ పండ్లు,మామిడి పండ్లు,బొప్పాయి.
  • బ్రోకలీ, ఎర్ర మిరియాలు, ఆకుపచ్చ మిరియాలు మరియు కాలీఫ్లవర్ వంటి కూరగాయలు.
  • పాలకూర, క్యాబేజీ మరియు టర్నిప్ వంటి ఆకు కూరలు.
  • చిలకడ దుంపలు మరియు తెలుపు బంగాళాదుంపలు.
  • తృణధాన్యాలు మరియు పప్పుధాన్యాలు వంటి కొన్ని .
  • విటమిన్ సి పుష్కలంగా ఉండే ఆహార పదార్థాల్ని ముడిపండ్లగానే లేదా పచ్చివిగానే తినాలి.

 

Exit mobile version