వేసవిలో వేడినీళ్లు తాగడం వల్ల ఎదురయ్యే ఇబ్బందులు ఏంటో తెలుసా ?

నీళ్లు ఎక్కువగా తాగడం వలన శరీరానికి ఎంతో మేలు జరుగుతుంటుందనే విషయం అందరికి తెలిసిందే. అందులోనూ వేడి నీళ్లు తాగితే జీర్ణ ప్రక్రియ మెరుగుపడి గ్యాస్ సమస్యలు తగ్గిపోతాయి. అందుకే చాలా మంది ఉదయం లేవగానే వేడి నీళ్లు తాగుతూ ఉంటారు. ఇక కరోనా వైరస్ తీవ్రంగా వ్యాపిస్తున్నప్పటి నుండి ఈ అలవాటు ఎక్కువైపోయింది.

problems caused by drinking hot water in summeప్రతి ఒక్కరూ రోజుకు నాలుగైదు సార్లు వేడి నీళ్లు తాగుతున్నారు. కానీ దీని వల్ల కలిగే అనారోగ్య సమస్యల గురించి తెలుసుకోలేకపోతున్నారు. ముఖ్యంగా వేసవిలో వేడి నీటిని తీసుకోవడం వల్ల దాహం తీరదు. అందుకని ఎక్కువగా వేడి నీళ్లు తాగడం ఆరోగ్యానికి అంత మంచిది కాదు అంటున్నారు వైద్యులు. దీని వల్ల ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందంటున్నారు. మరి ఆ ఇబ్బందులేంటో ఇప్పుడు తెలుసుకుందాం.

problems caused by drinking hot water in summeఆరోగ్యానికి మంచిది అని చెప్పగానే చాలామంది దాహం వేయకపోయినా వేడి నీళ్లు ఎక్కువగా తీసుకుంటూ ఉంటారు. అయితే ఎక్కువ కాలం నుంచి ఇదే రిపీట్ చేస్తే నరాలు కూడా చిట్లి పోవచ్చు అని వైద్యులు అంటున్నారు. పదేపదే వేడి నీళ్లు తాగడం వల్ల తలనొప్పి కూడా వస్తుందని చెబుతున్నారు. అందువల్ల దాహం వేయకపోయినా వేడినీళ్లు తాగడం తగ్గించుకోవడం మంచిది.

problems caused by drinking hot water in summeఇక కొంతమందికి రాత్రి పడుకునేటప్పుడు వేడి నీళ్లు తాగే అలవాటు ఉంటుంది. అయితే నిద్రపోయే ముందు వేడి నీళ్లు తాగితే సమస్యలు వస్తాయి. టాయిలెట్ సమస్య, యూరిన్ లాంటివి రావచ్చు. అదే విధంగా బ్లడ్ వెస్సెల్స్ సెల్స్ పై ప్రెషర్ పడుతుంది. కాబట్టి పడుకునే ముందు వేడినీళ్లు తాగకూడదు. ఒకవేళ తాగిన వెంటనే నిద్రపోకుండా కాసేపు వాకింగ్ చేస్తే బెటర్.

problems caused by drinking hot water in summeతరుచూ వేడి నీళ్లు తాగడం వల్ల కిడ్నీ సమస్యలు కూడా రావచ్చు. అది కిడ్నీ చేసే సాధారణ ఫంక్షన్ ని ప్రభావితం చేస్తుందని అంటున్నారు. రక్తం మీద కూడా ఇది ప్రభావం చూపిస్తుంది ఎక్కువ వేడి నీళ్లు తాగడం కారణంగా బ్లడ్ వాల్యూమ్ పెరుగుతుంది. అదే విధంగా బ్లడ్ ప్రెషర్ పెరగడం వంటి సమస్యలు వస్తాయి.

problems caused by drinking hot water in summeవేడి నీళ్లు ఎక్కువగా తాగడం వల్ల స్టమక్ లో ఇరిటేషన్ లాంటివి జరుగుతాయి. లోపల ఉండే టిష్యూస్ చాలా సెన్సిటివ్ గా ఉంటాయి కనుక వేడి నీళ్లు తాగినప్పుడు వాటికి ఇబ్బంది అయ్యి బ్లిస్టర్స్ లాంటివి ఏర్పడొచ్చు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,450,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR