శాస్త్రనియమానుసారం దానం చేయగలిగనవి, చేయకూడనివి ఏవిటో తెలుసా ?

దానం, ధర్మం అనే మాటలు తరుచూ వినే ఉంటారు. ఎవరైనా పేదవానికి తమ శక్తి కొద్ది చేసే ద్రవ్య సహాయాన్ని కానీ,వస్తు సహాయాన్ని కానీ..‘ధర్మం’ అంటారు. ఇలా ‘ధర్మం’ చేయడం వల్ల వచ్చిన పుణ్యఫలం ఇహలోక సౌఖ్యాలకు దోహదం చేస్తుంది. మంత్రపూర్వకంగా ఓ సద్బ్రాహ్మణునకు చేసిన దానఫలం.,పరలోక సుఖాలను అందించడమే కాకుండా, ఉత్తమజన్మ సంప్రాప్తించడానికి ఉపయోగపడుతుంది.

‘ధర్మం’ చెయ్యడానికి పరిథులు లేవు. మనకు తోచింది ఏదైనా ధర్మం చెయ్యవచ్చు. కానీ, ‘దానం’ చెయ్యడానికి కొన్ని పరిథులు ఉన్నాయి. ఏదిపడితే అది దానం చెయ్యడానికి వీలులేదు. అలా చేయడానికి మనం సిద్ధంగా ఉన్నా… తీసుకోవడానికి విప్రులు సిద్ధంగా ఉండరు. శాస్త్రనియమానుసారం దానయోగ్యమైనవి కొన్నే ఉన్నాయి. వాటినే దానం చెయ్యాలి.

Dhanamమరి దానం చేయకూడనివి ఏవిటో ఇప్పుడు తెలుసుకుందాం :

చెడిపోయిన లేదా తినడానికి పనికిరాని ఆహారాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ దానం చేయకూడదు. ఇలాంటి ఆహారాన్ని దానం చేస్తే న్యాయపరమైన సమస్యలు ఎదురవుతాయి. కోర్టుల చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తుంది. అంతేకాదు ఎంత సంపాదించినా, వచ్చింది వచ్చినట్టు కర్పూరంలా కరిగిపోతుందట.

Rahasyavaaniచినిగిపోయిన దుస్తులు, పాడైపోయిన పాత్రలు, విరిగిపోయిన కుర్చీలను దానం చేస్తే దురదృష్టం వెంటాడి అన్ని అపజయాలే ఎదురవుతాయి. అసలు మనకి పనికిరాని వస్తువు ఇంకెవరికీ దానం చేయరాదట. చీపుర్లు దానం చేసినవారి ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండదు. లక్ష్మీదేవిగా భావించే చీపురును దానం చేయడమంటే చేజేతులా లక్ష్మీని ఇంట్లో నుంచి వెళ్లగొట్టినట్లేనట.

Rahasyavaaniప్లాస్టిక్ వస్తువులను దానం చేయడమే కాదు, బదులుగా ఇచ్చినా కూడా కెరీర్ నాశనమైపోతుందట. సూది, కత్తెర, కత్తులు లాంటివి దానం చేస్తే ఏరి కోరి సంసారంలో నిప్పులు పోసుకున్నట్లేనట.ఇవి దానం చేయడం వల్ల భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తి, జీవితంలో వారికి ఏదీ కలిసిరాదట.

కాబట్టి ఇకనుండి ఎప్పుడైనా దానాలు చేస్తే ఈ జాగ్రత్తలు తీసుకోండి. లేకపోతే పుణ్యం సంగతి దేవుడెరుగు తెలిసితెలిసి కష్టాలపాలవుతాం.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR