పాలిచ్చే తల్లులు కొబ్బరి నీళ్లు తాగితే ఏమవుతుందో తెలుసా?

హిందూ సంప్రదాయంలో కొబ్బరి బోండంకి విశిష్టమైన ప్రాధాన్యత ఉంది. కొబ్బరిబోండాంతో హిందువులది విడదీయరాని అనుబంధం. మన సంస్కృతిలో మన ఆచారాలలో అడుగడుగునా కొబ్బరి బొండాం కనిపిస్తూనే ఉంటుంది. కల్యాణ వేదిక పైకి నడిచి వచ్చే నవవధువు చేతులను కొబ్బరి బొండం లేకుండా ఊహించలేం. గుండ్రంగా, మచ్చలులేని నున్నని లేలేత పచ్చని బొండాన్ని ఎంచుకుని మరీ ఆయా కార్య క్రమాల్లో ఉపయోగిస్తాం. అందుకే ఎన్నో ఉపయోగాలున్న కొబ్బరిచెట్టు కల్పవృక్షమైంది.
కొబ్బరి యొక్క మరో విశిష్టత ఏమిటంటే నూటికి నూరుపాళ్లు సహజసిద్ధమైన, కల్తీకి ఆస్కారం లేని పానీయం. ప్రపంచంలో మరి ఏది దీనికి సాటిరాదు. దీనికి ప్రాసెసింగ్ ప్రక్రియతో పనిలేదు. మన రక్తంలో ఎలక్ట్రోలైట్ సమతౌల్యం ఏవిధంగా ఉంటుందో కొబ్బరి నీటి లోనూ అదే మాదిరి ఉంటుంది. కొబ్బరినీటిని తాగితే మెగ్నిషియం క్యాల్షియం పొటాషియం సోడియం వంటి అనేక రకాల పోషకాలు మనకు లభిస్తాయి.
కొబ్బరి నీటిని ఉష్ణోగ్రత ఎక్కువగా ఉండే వేసవి కాలంలోనే ఎక్కువగా తాగడం అందరికీ అలవాటు. కానీ ఏ కాలంలోనైనా కొబ్బరి బొండాం తాగొచ్చు. దానివల్ల ఎనలేని ఆరోగ్య ప్రయోజనాలు కలుగుతాయి. ఇందులో పొటాషియం ఎక్కువ కార్బోహైడ్రేట్స్‌ తక్కువగానూ, ఉంటుంది. ఇందులో ఫ్యాట్‌ కంటెంట్‌ ఉండకపోవడం,మాంగనీస్‌ ఎక్కువగా ఉండడం వలన బరువు తగ్గేందుకు మరియు జీర్ణక్రియారేటు పెరిగి నడుము, పొట్ట చుట్టూ ఉన్న కొవ్వు తగ్గుతుందని అనేకమైన పరిశోధనల్లో తేలింది. కొబ్బరి నీరు తాగితే త్వరగా ఆకలి వేయదు. అందుకే బరువు తగ్గాలనుకునే వారు కొబ్బరినీరు తాగితే మంచిది.
షుగరు తో బాధపడుతున్నవారు కొబ్బరి నీళ్లు తాగితే షుగర్అదుపులో ఉంటుంది. కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా చెయ్యడానికి కొబ్బరి నీళ్లు తాగడం చాల మంచి పద్దతి. మంచి నీళ్ల కంటే కూడా బాగా పనిచేస్తాయి. కొబ్బరి నీరు మూత్ర, వ్యవస్థలపై థెరపటిక్ ప్రభావాన్ని కలిగి ఉంటుంది. మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు, మూత్రపిండంలో రాళ్లను తగ్గించడంలో సహాయపడుతుంది. శృంగార శక్తిని పెంచడంలో కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. కొబ్బరి నీళ్లలో విటమిన్ సి, ఖనిజాలు పీచుపదార్థం,సమృద్ధిగా ఉంటాయి. కాబట్టి వ్యాయామం చేశాక కొబ్బరినీళ్లు తాగడం వలన శరీరం లో నీరసం తగ్గుతుంది.
తల తిరగడం, కడుపులో గడబిడలాంటి వాటిని కొబ్బరినీళ్లు బాగా తగ్గిస్తాయి. గుండెజబ్బులు అధిక రక్తపోటు ప్రధానకారణం. పొటాషియం, మెగ్నీషియం వంటి ఖనిజాలు రక్తపోటును తగ్గించడంలో సహకరిస్తాయి. ఈ రెండు ఖనిజాలు గల కొబ్బరి నీరు రక్తపోటును నివారించి, రక్తసరఫరాను మెరుగు చేయడంలో సహకరిస్తుంది. గుండె జబ్బులు గల వారికి కొబ్బరి నీరు. హార్ట్ ఫెయిల్యూర్ రిస్కును తగ్గించగలదని పరిశోధనలు తెలియజేస్తున్నాయి.
రక్తప్రసరణ తీరు సక్రమంగా ఉండాలంటే తరచూ కొబ్బరి నీళ్లు తాగడం మంచిది. అధిక రక్త పోటును అరికడుతూ, గుండెపోటును నివారించేందుకు కొబ్బరి బొండం దోహద పడుతుంది. అనేక పోషకాలు, విటమిన్లు ఉన్నందున కొబ్బరి నీళ్లు తాగితే శరీరంలో రోగ నిరోధక శక్తి వృద్ధి చెందుతుంది. వైరస్లు, బాక్టీరియాల బారిన పడ కుండా జాగ్రత్త పడొచ్చు.
రాత్రి నిద్రపోయే ముందు కొబ్బరి నీళ్లను ముఖంపై రాసుకుంటే మొటిమలు, మచ్చలు తెలగిపోతాయి. చేతులు, గోళ్లకు రాసుకుంటే మంచి నిగారింపు వస్తుంది.
ఇక గర్భిణీలు, పాలిచ్చే తల్లులు కొబ్బరి నీళ్లు తాగితే ఎన్నో ప్రయోజనాలు పొందొచ్చట. గర్భవతుల్లో మలబద్దకం, జీర్ణకోశంలో తేడాలు, గుండెలో మంట సాధారణంగా కనిపించే సమస్యలు. వీటిని కొబ్బరి నీరు తాగడం ద్వారా అధిగమించవచ్చు కాబట్టి గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను వీలున్నప్పుడల్లా
తాగుతూ ఉండాలి.
పాపాయి ఆరోగ్యానికి తల్లులు తాగే కొబ్బరి నీరు ఎంతగానో సహకరిస్తుంది. బిడ్డకు పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీటిని తాగితే పాల ద్వారా వారి బిడ్డలకు అనేక పోషకాలు అందుతాయి. కొబ్బరి నీరు తల్లి పాలలో లారిక్ యాసిడ్ ను పెంచుతుంది. దీనిలో యాంటీఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ. వైరల్ లక్షణాలు ఉంటాయి. కాబట్టి చిన్నపిల్లల్ని అనేక ఇన్ ఫెక్షన్ల నుంచి రక్షించడానికి సహాయపడుతుంది

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,490,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR