తొగరు ఫలాలు అంటే ఏమిటో తెలుసా?

కరోనా మహమ్మారి చేసిన విలయతాండవం చుసిన తరువాత ప్రతి ఒక్కరు శరీర రోగనిరోధక శక్తిని పెంచుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. మెడిసిన్, కెమికల్స్ జోలికి వెళ్లకుండా సహజసిద్ధంగా ఆరోగ్యానికి మేలు చేసే ఆహారాలకు, ఆయుర్వేద మూలికల కోసం వేట మొదలు పెట్టారు. సాధారణంగా ఎన్నో మొక్కల నుంచి లభించే వేర్లు, కాండం, ఆకులు, కాయలు వంటి వాటి ద్వారా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను పొందుతారు అనే విషయం మనకు తెలిసిందే. కానీ రోగనిరోధక శక్తిని పెంపొందించుకోవాలి అనుకునేవారు తొగరు జ్యూస్ గురించి తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతో ఉంది.

togaru juiceతొగరు ఫలం గురించి చాలామందికి తెలిసి ఉండదు. అయితే దీనికి సంబంధించి ఆకులు, కాండం, పండ్ల జ్యూస్ అన్నీ ఔషధంగా ఉపయోగించబడతాయి. ఈ అద్భుత ఫలానికి 100 కంటే ఎక్కువ వ్యాధులను నయం చేసే శక్తి ఉందని, దానిలో 150 కి పైగా పోషకాలు ఉన్నట్లు పెద్దలు చెబుతారు. దీనిని సేవిస్తే, క్యాన్సర్ తో పాటు ప్రాణాంతక వ్యాధులను కూడా నివారిస్తుందట. ఈ జ్యూస్ ను ప్రతి రోజూ మనం తీసుకోవడం వల్ల శరీరానికి కావల్సినంత రోగనిరోధకశక్తిని పెంపొందించుకోవచ్చు. ఈ తొగరు జ్యూస్ లో యాంటీ ఒబేసిటీ లక్షణాలు అధికంగా ఉండటం వల్ల శరీర బరువును తగ్గించి సిటీ నుంచి ఉపశమనం పొందడానికి ఈ జ్యూస్ ఎంతగానో దోహదపడుతుందని చెప్పవచ్చు.

fatఇది ప్రధానంగా ఆగ్నేయ ఆసియా ఖండంలో కనిపిస్తుంది. దీని కాయలు అద్భుత ఔషధ గుణాలు గలవి. అందువల్ల తొగరును నేడు హవాయి, పిలిప్పియన్స్, మలేషియా, ఆస్ట్రేలియా, భారత్ వంటి దేశాల్లో వాణిజ్య పంటగా పండిస్తున్నారు. హవాయి దేశాల్లో తొగరు కాయను నోని ఫ్రూట్ అని అంటారు. తొగరు చెట్టు ఏ నేలలోనైనా ఎదుగుంది. సంవత్సర పొడవునా ఫలాలను ఇస్తుంది. మొక్క నాటిన సంవత్సరంలోనే కాపు మొదలవుతుంది. పాలినేషియన్లు తొగరు చెట్టును 2000 సంవత్సరాలుగా వివిధ వ్యాధులకు ఔషధంగా వాడుతున్నారు. తొగరు కాయలను నోని కాయలు అని కూడా అంటారు.

togaruఈ నోని కాయలు రుచికి వగరుగా, చేదుగా ఉంటాయి. కొన్ని ప్రాంతాల్లో నోని కాయలను కరువు సమయాల్లో తింటారు. నోని కాయల నుండి తీసిన రసం బహిష్టు సమస్యలకు, మధుమేహానికి, కాలేయ వ్యాధులకు, క్యాన్సర్, మూత్ర సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుంది. మార్కెట్లో సులభంగా తొగరు పండ్లను పొందవచ్చు. తొగరు జ్యూస్ రక్తంలో చక్కెర స్థాయిని నియంత్రిస్తుంది. దీన్ని రెగ్యులర్‌గా తీసుకోవడం వల్ల షుగర్ వ్యాధిని కంట్రోల్ చేయవచ్చు. అలాగే సాధారణ ప్రజలను షుగర్ వ్యాధి బారిన పడకుండా కూడా కాపాడుతుంది.

sugar or diabetesనోని కాయల పొడిలో కార్బోహైడ్రేట్స్, చిన్న మోతాదులో పీచు పదార్ధాలు ఉన్నాయి. విటమిన్ సి, ఐరన్, పొటాషియం, నియాసిన్, విటమిన్ ఎ, కాల్షియం, సోడియం కూడా చిన్న మోతాదుల్లో ఉంటాయి. ఈ చెట్టు ఆకులు కీళ్ళ నొప్పులకు ఉపయోగపడాతాయి. పచ్చి కాయ రసం నోటి పొక్కులకు ఉపయోగపడతాయి. మగ్గిన కాయలు తిన్నచో గొంతురు రొంపకు, కాళ్ళ పగుళ్ళకు, ఆకలికి, పంటి నొప్పులకు ఉపయోగపడతాయి. ఈ చెట్టు బెరడు కషాయం కామెర్లకు ఉపయోగపడతాయి. నోని రసం ఎండోమెట్రిసిస్, ఆస్త్మాకు, ఎలర్జీలకు కూడా ఉపయోగపతుంది.

allergyసంతానం కావాలనుకునే వారికి కూడా ఇది చాలా ప్రభావంతంగా పనిచేస్తుంది. దీనిని తీసుకోవడం ద్వారా పురుషుల్లో నపుంసకత్వం, మహిళల్లో వంధ్యత్వం సమస్యను అధిగమించవచ్చు. ఇది పురుషులలో స్పెర్మ్ కౌంట్ పెంచడానికి.. మహిళల పీరియడ్స్ సమస్యను అధిగమించడానికి కూడా పనిచేస్తుంది. తొగరు ఫలంలో బీటా-గ్లూకాన్స్, కంజుగేటెడ్ లినోలెయిక్ యాసిడ్ ఉన్నాయని పరిశోధనల్లో తేలింది. ఈ క్రమంలో తొగరు ఫలం జ్యూస్ సేవించడం ద్వారా ప్రోస్టేట్ క్యాన్సర్, రొమ్ము క్యాన్సర్‌ నుంచి రక్షణ పొందవచ్చని నిపుణులు తెలిపారు. అదనంగా, ఇది సాధారణ క్యాన్సర్ నుంచి కూడా రక్షణ ఇస్తుంది.

prostate cancerఅయితే కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడేవారు తొగరు జ్యూస్ తాగకూడదు. హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకునే వారు వీటికి దూరంగా ఉండటం మంచిది. గర్భిణీలు, పాలిచ్చే తల్లులు నోని రసం సేవించడం ప్రమాదకరం. హై బీపీ సమస్యతో మెడిసిన్ తీసుకుంటుంటే డాక్టర్ల అభిప్రాయం తెలుసుకున్న తర్వాతే ఈ జ్యూస్ సేవించాలి.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,580,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR