కార్తీకమాసంలో చేసే ఉపవాసానికి ఎంతో విశిష్టత ఉంది ఏంటో తెలుసా ?

శివకేశవులు ఇద్దరికీ ప్రీతికరమైన మాసం కార్తీకమాసం. కార్తీక మాసంలో సూర్యోదయానికి పూర్వం స్నానం, దీపారాధన, ధ్యానం, జపం, దానం, భూ శయనం తప్పనిసరిగా చేయాల్సిన నియమాలు. వీటితో పాటు ఈ మాసంలో చేసే ఉపవాసానికి కూడా ఎంతో విశిష్టత ఉంది.

కార్తీకమాసంకార్తీకమాసంలో 3 రకాల ఉపవాస నియమాలు ఉంటాయి. అవి 1. ఏకభుక్తం. 2. నక్తవ్రతం, 3. ఉపవాసం. ఈ పద్ధతుల్లో ఎవరికి తోచిన పద్ధతిని వారు పాటించవచ్చు. అయితే ఒకసారి మొదలు పెడితే మాసం అంతా ఒకే రీతిగా ఉండాలి.

కార్తీకమాసంఏకభుక్తం అనగా ఉదయం భోజనం చేసి రాత్రికి టిఫిన్‌లాటివి ఏమీ చేయకుండా ఉండడం, నక్తం అనగా పగలంతా ఏమీ తినకుండా ఉండి సాయంకాలం పూజ చేసి నక్షత్ర దర్శనం చేసాక భోజనం చేయడం. మూడింటిలో ఏది చేసినా కొన్ని నియమాలు తప్పక పాటించాలి.

కార్తీకమాసంఉపవాసం అంటే ఉడికినవి తినకుండా, ఉప్పుకారాలు లేకుండా, నూనె వాడకుండా తినగలిగేవి మాత్రమే తింటూ ఉండడం. ఇలా చేయలేని వారు సోమవారాలు, ఏకాదశి, పౌర్ణమి, మాస శివరాత్రి, అమావాస్య మొదలైన రోజుల్లో ఉపవాసం ఉండి ఈ దీక్షను పూర్తి చేస్తారు. ఈ మాసంలో ఉల్లి, వెల్లుల్లి, దుంపలు, ముల్లంగి మొదలైనవి తినకూడదు. బయటి పదార్థాలు కూడా వీలైనంత తక్కువ తినాలి. పూర్తిగా తినకుండా ఉండడం మంచిది.

కార్తీకమాసంపితృ తిథులు చేసేవారు భోజనం చేయడం మానకూడదు. ప్రతినిత్యం శివారాధన, కేశవారాధన తప్పనిసరిగా చేస్తూఉండాలి. చలిమిడి పెసరపప్పు, పానకం, కొబ్బరి తీసుకోవచ్చు. అనగా ఈ మాసంలో సుఖపడడానికి దూరంగా ఉండాలి అని అర్థం. శరీరాన్ని మనస్సును బాగా కష్టపడాల్సిన మాసం. కానీ ఏ పని చేసినా భక్తి శ్రద్ధలతో చేయాలి. ఇతరుల ధనాన్ని ఏమాత్రం ఆశించకుండా సేవ చేయాలి. మానవ సేవయే మాధవ సేవ. దేవ ఋణం, పితృ ఋణం, ఋషి ఋణం తీర్చుకోవడానికి అనువైన మాసం ఈ కార్తీక మాసం.

కార్తీకమాసంకార్తీకంలో మనస్సు, పంచేంద్రియాలు, సప్తధాతువులతో నిర్మితమైన ఈ దేహంతో ఎన్ని మంచి పనులు చేయ గలిగితే అన్ని మంచి పనులు చేయాలి. ధార్మిక, ఆధ్యాత్మిక కార్యక్రమాలు అన్నీ తప్పనిసరిగా చేయాలి. అప్పుడు మాత్రమే శివ కేశవుల అనుగ్రహానికి పాత్రులు అవుతారు.

 

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR