ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన ఆలయం ఎక్కడ ఉందొ తెలుసా ?

0
325

కొన్ని సార్లు ఆలయాల సందర్శన ఒక గొప్ప అనుభూతిని కలిగిస్తాయి. అక్కడికి వెళ్లి ఆలయాలను దర్శిస్తే ఎక్కడిలేని ప్రశాంతత దొరుకుతుంది. అక్కడ కొద్ది సేపు కూర్చుంటే చాలు మనసు పులకరిస్తుంది. రాత్రి ఆ సన్నిధిలో నిద్రపోతే చాలు మీ భయాలు దూరమయిపోతాయి. తీర్థ యాత్ర లకు వెళ్ళేటప్పుడు అక్కడ ఉన్న గుళ్ళు, గోపురాలు,వాటి చరిత్ర ఏమిటి ? అని తెలుసుకుంటే మీ పర్యటన మరింత గొప్పగా సాగుతుంది.

దెయ్యాలే నిర్మించిన ఆలయంపూర్వ కాలంలో సాధారణంగా ఆలయాలను రాజులు, యోగులు, రుషులు నిర్మించేవారు. కొన్నింటిని స్వయంగా దేవతలే నిర్మించినట్లు పురాణాలు పేర్కొన్నాయి. కొన్ని వందల ఏళ్ల కిందట నిర్మితమైన దేవాలయాలు ఇప్పటికీ చెక్కుచెదరకుండా ఉన్నాయి. మహిమలు కలిగిన దేవతల రహస్యాలు, అందమైన గోపురాలు, రమణీయ శిల్పాలతో కూడిన దేవాలయాలను చూడటమే ఒక అద్భుతం. కానీ ఈ ఆలయాన్ని మాత్రం దెయ్యాలు నిర్మించాయి. అవును ఇది అక్షరాలా నిజం. ఒకే రాత్రిలో స్వయంగా దెయ్యాలే నిర్మించిన దేవాలయమిది.

దెయ్యాలే నిర్మించిన ఆలయంబెంగుళూరు సమీపాన దొడ్డబళ్ళాపురం, దేవనహళ్ళి మార్గంలో ఉండే బొమ్మావర అనే గ్రామంలోని సుందరేశ్వర ఆలయాన్ని దెయ్యాలు నిర్మించాయి. మహాశివుడు ఇక్కడ సుందరేశ్వరునిగా పూజలందుకుంటాడు. సుమారు 600 ఏళ్లకు పూర్వం దెయ్యాలు ఆ ప్రాంతంలోని ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేవి. ఈ దెయ్యాల పనికి గ్రామంలోని ప్రజలు బేజారెత్తిపోయేదట.

దెయ్యాలే నిర్మించిన ఆలయంబొమ్మావర గ్రామంలో తాంత్రిక విద్యలో ప్రఖ్యాతిగాంచిన బొచ్చయ్య అనే వ్యక్తి శివుడికి పరమ భక్తుడు. ఈయన శివుడిపై అపార భక్తి భావంతో ఒక ఆలయాన్ని నిర్మించి బొమ్మావర ప్రజలకు సహాయం చేయడానికి పూనుకున్నాడు. దీంతో అందరూ కలిసి ఒక దేవాలయాన్ని నిర్మించారు.

దెయ్యాలే నిర్మించిన ఆలయంఈ ప్రదేశంలో ఆలయాన్ని నిర్మించడం ఇష్టం లేని దెయ్యాలు రాత్రికి రాత్రే నాశనం చేశాయి. తాను శివుడి కోసం నిర్మించిన దేవాలయాన్ని దెయ్యాలు నాశనం చేయడంతో ఆగ్రహించిన బొచ్చయ్య మరిన్ని మాంత్రిక విద్యలను నేర్చుకొని వాటిని తన మంత్ర శక్తితో వశం చేసుకున్నాడు. తమకు విముక్తి కలిగించమని వేడుకున్నా వదలలేదు. మిమ్మల్ని విడిచిపెట్టాలంటే తన షరతులకు అంగీకరించాలని దెయ్యాలను కోరితే అవి సరేనన్నాయి. ఆ షరతులు కారణంగానే నాశనం చేసిన దేవాలయాన్ని ఒకే రాత్రిలో పునఃనిర్మాణం చేశాయి. అలాగే బొమ్మావర గ్రామ ప్రజలకు ఎలాంటి ఇబ్బంది కలిగించకూడదని షరతు విధించాడు. ఆలయాల్లో దేవుని శిల్పాలు కనిపించడం సర్వసాధారణం. కానీ ఈ దేవాలయంలో దెయ్యాల శిల్పాలు కనిపిస్తాయి. ఆలయం అయితే నిర్మించాయి కానీ దేవతామూర్తిని స్థాపించలేదు.

దెయ్యాలే నిర్మించిన ఆలయంసుమారు 50 సంవత్సరాలకు పూర్వం తాగునీటి కోసం బావి తవ్వినప్పుడు ఒక శివలింగం లభ్యమైంది. ఎనిమిది అడుగుల ఎత్తైన ఈ లింగాన్ని ఆలయంలో ప్రతిష్ఠించారు. ఇది కర్ణాటకలోనే అతిపెద్ద శివలింగం. శివుడు భూతనాథుడు కాబట్టి దెయ్యాలు నిర్మించిన దేవాలయంలో అంతా మంచి జరుగుతుంది అని అక్కడ ప్రజల విశ్వాసం. అనంతరం సుందరేశ్వర స్వామిగా నామకరణం చేశారు.

 

SHARE