Home Health పడుకునేటప్పుడు తల ఎటువైపు పెట్టాలో తెలుసు కానీ ఎటు తిరిగి పడుకోవాలో తెలుసా?

పడుకునేటప్పుడు తల ఎటువైపు పెట్టాలో తెలుసు కానీ ఎటు తిరిగి పడుకోవాలో తెలుసా?

0

మన పెద్దలు ఎద్ధి చెప్పినా మన మంచికే. అందుకే పెద్దల మాట చద్దన్నం మూట అంటారు. వారు చెప్పే ప్రతీ ఆచారం వెనుక ప్రతీ సంప్రదాయం వెనుక ఎంతో సైన్స్ నిగూఢమై ఉంటుంది. కానీ మనం దాన్ని తెలుసుకోలేక చాదస్తం అని కొట్టిపారేస్తుంటాం. కానీ ఆ నియమాల్లో శాస్త్రీయ కోణం దాగి ఉందని ఇప్పటికే అనేక పరిశోధనల్లో రుజువైంది. మన రోజువారీ తినే ఆహారం విషయంలోను..పాటించే పద్ధతుల్లోను..ఉదయం లేచింది మొదలు రాత్రి పడుకోబోయే వరకూ పాటించే పద్ధతుల గురించి మన పెద్దలు చాలా ఉపయోగకరమైన విషయాలను చెప్పారు. వాటినే సంప్రదాయాలుగా మార్చారు.

మనం రోజంతా కష్టపడి రాత్రి శరీరానికి విశ్రాంతినిస్తూ నిద్ర పోయే విషయంలో కూడా మన పెద్దలు కొన్ని నియమాలను పెట్టారు. తల తూర్పు వైపు పెట్టి పడుకోవాలని..లేదంటే దక్షిణం వైపు తలపెట్టి పడుకోవాలని చెప్పారు.. అలాగే ఉత్తరం వైపు తలపెట్టి పడుకోకూడదని నియమం పెట్టారు. వాస్తుపరంగా ఏ దిక్కు వైపు తలపెట్టి పడుకోవాలో చాలామంది చెబుతారు. కానీ ఎటువైపు తిరిగి పడుకుంటే మంచిదనే విషయంపై కొద్దిమందికి మాత్రమే అవగాహన ఉంటుంది.

sleepingకుడివైపు నిద్రపోవడం మంచిది కాదని.. ఎడవైపు మాత్రమే నిద్రపోవాలని చెబుతారు. కొంతమంది కుడివైపు తిరిగి పడుకుంటే మంచిదంటారు. మరి ఇందులో ఏది నిజం? తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రోజు మొత్తం శ్రమించి ఆఫీస్ లో వర్క్ మాత్రమే కాదు గంటల కొద్ది ప్రయాణం చేసి అలసిపోయి సాయంత్రం అనుకున్నది రాత్రికి ఇంటికొచ్చి చేరుతాం. అలా రావడం ఆలస్యం ఫ్రెష్ అవడం కాస్త డిన్నర్ చేయడం అలా మంచం ఎక్కడం ఇదే సగటు మనిషి పాటించే విధానం. అయితే అలసిపోయి వస్తారు కాబట్టి ఏ వైపుకి తిరిగి పడుకున్నా సరే నిద్రలోకి జారుకుంటారు.

కాని ఇక్కడ మన పడుకునే విధానానికి ఆరోగ్య సూత్రాలు ఉన్నాయట. నిద్ర ఎప్పుడూ ఎడమ ప్రక్కకు తిరిగి, ఎడమ చెయ్యి క్రిందకు వచ్చే విధంగా పడుకోవడమే మంచిదని మన పూర్వికులు చెప్పారు. దీనిని పురాణాల్లో వామ కుక్షి అవస్థలో విశ్రమించడం అంటారు.. శరీరంలో సూర్యనాడి, చంద్రనాడి, మధ్యనాడి అనే మూడు నాడులు ఉంటాయి. సూర్యనాడి తిన్న భోజనం జీర్ణం చేయడానికి పనికొస్తే.. సూర్యనాడి ఎడమవైపుకి తిరిగి పడుకుంటేనే చక్కగా పనిచేస్తుంది.

ఇదే విషయాన్ని ఆరోగ్య నిపుణులు, శాస్త్రవేత్తలు కూడా చెబుతున్నారు. ఎడమ వైపు తిరిగి పడుకోవడం వల్ల జీర్ణాశయంలోని యాసిడ్స్ అన్నీ సక్రమంగా పనిచేస్తాయి. తద్వారా జీర్ణక్రియ మెరుగుపడుతుంది. అదే కుడివైపు తిరిగి పడుకుంటే, ఈ యాసిడ్స్ అన్నీ పైకి ఎగదన్నుతాయి. అందుకే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ సమస్యలు ఉన్నవాళ్లు ఎడమ వైపు తిరిగి పడుకోవాలి. ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రక్తప్రసరణ బాగా జరిగి గుండె ఆరోగ్యంగా ఉంటుంది. వెన్నెముక సమస్యలు ఉన్నవారు ఎడమవైపు తిరిగి పడుకుంటే ఉపశమనం కలుగుతుంది.

ఎప్పుడైనా అలసట అనిపించినప్పుడు ఎడమవైపుకి తిరిగి కొద్దిసేపు పడుకుంటే అలసట తీరిపోతుంది. ఎడమవైపు పడుకోవడం వల్ల గురక తగ్గిపోతుంది. ముఖ్యంగా గర్భిణి స్త్రీలు ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల రక్ర ప్రసరణ బాగా జరుగుతుంది. కడుపులో పిండం, మూత్ర పిండాలకు మంచి రక్త ప్రసరణ లభిస్తుంది. అంతేకాదు అనారోగ్యానికి కారణమైన విష పదార్ధాలు బయటికి పంపించడం కూడా ఎడవవైపు తిరిగి పడుకోవడం వల్ల జరుగుతుంది. కాలేయం మరియు మూత్ర పిండాలు సక్రమంగా పని చేసేలా చూస్తాయి.

ఎడమవైపు తిరిగి పడుకోవడం వల్ల మెదడు చురుకుగా పని చేస్తుంది. పార్కిన్ సన్ మరియు అల్జీమర్ వ్యాధులను కంట్రోల్ చేస్తుంది. కుడివైపు తిరిగి పడుకునే వాళ్ల కంటే, ఎడమ వైపు తిరిగి ఎక్కువ సేపు నిద్రపోయే వాళ్లు మరింత చురుగ్గా ఉన్నట్టు శాస్త్రీయంగా రుజువైంది.

Exit mobile version