తమలపాకులో ఎవరు కొలువై ఉంటారో తెలుసా??

ప్రపంచంలోనే అత్యంత పురాతన మతం హైందవ మతం. హిందూ సంస్కృతి ఏదో రూపంలో ప్రకృతిని పూజించటం. ఆరాధించటానికి ప్రాధాన్యతనిచ్చింది. మనకు సంబంధించిన ఏ పండుగ తీసుకున్నా అందులో ప్రకృతి ఆరాధన మిళితమై వుంటుంది.

festivalఉగాది పండుగకు వేపచెట్టు, సంక్రాంతి పండుగకు ధాన్యరాశులు, పశు సంతతి పట్ల ప్రేమ చూపటం… అలాగే వినాయక చవితి అంటే నానావిధ ఫల.పత్ర, పుష్పాలతో స్వామిని అర్చించటం వుంటుంది. ఇలాంటి విశిష్ట సంస్కృతి మరి ఏ ఇతర మతంలోనూ కనబడదు.

neemహిందూ సంస్కృతిలో తాంబూలానికి – అంటే తమలపాకులకు ఎంతో ప్రాముఖ్యత వుంది. కొందరు దేవుళ్ళకి నిర్ణీత సంఖ్యలో తమలపాకులతో పూజలు చేస్తారు. తమలపాకుల తాంబూలం మన సంస్కృతిలో విశిష్ట స్థానం ఆక్రమించింది. ఆయర్వేద శాస్త్రం తమలపాకు సేవనం ఆరోగ్యానికి మంచిదని సూచిస్తుంది.

fruitsహిందూ ధర్మంలో తమలపాకును అష్ట మంగళాల లో(1.పూలు 2.
అక్షింతలు, 3.ఫలాలు,4,అద్దం, 5.వస్త్రం, 6.తమలపాకు మరియు వక్క ,7.దీపం, 8.కుంకుమ) ఒకటిగా భావిస్తారు. కలశ పూజలో మరియు సంప్రోక్షణలు చేసే సమయంలో తమలపాకుని ఉపయోగిస్తారు.
పూజలలో, వ్రతాలలో, నోములలో తమలపాకును తప్పనిసరిగా ఉపయోగిస్తారు. పసుపు గణపతినీ, గౌరీదేవినీ తమలపాకుపైనే అధిష్టింపజేస్తాం.

pasupu ganapatiభారత దేశంలో తాంబూల సేవనం చాలా ప్రాచీనమైన అలవాటు. భగవంతుని పూజలోనూ, అతిథి మర్యాదలలోనూ, దక్షిణ ఇచ్చేటప్పుడూ, భోజనానంతరం తమలపాకుని తప్పని సరిగా ఉపయోగిస్తారు. దంపతులు తాంబూల సేవనం చేయడం వల్ల వారి అనురాగం రెట్టింపు అవుతుందని మన పెద్దలు చెప్పుతూ ఉంటారు.

స్కాంద పురాణం ప్రకారం క్షీర సాగర మథనంలో వెలువడిన అనేక అపురూపమైన వస్తువులలో తమలపాకు ఒకటి. కొన్ని జానపద కధల ప్రకారం శివపార్వతులే స్వయంగా తమలపాకు చెట్లను హిమాలయాలలో నాటారని ప్రతీతి.

shiva and parvatiతమలపాకు యొక్క మొదటి భాగంలో కీర్తి, చివరి భాగంలో ఆయువు, మధ్య భాగంలో లక్ష్మీదేవీ నిలిచి ఉంటారని మన పెద్దలు చెబుతారు. తమలపాకు పైభాగం లో ఇంద్రుడు, శుక్రుడు ఉంటారు.
తమలపాకు కాడకీ కొమ్మకీ మధ్యన జ్యేష్టా దేవి ఉంటుంది. తమలపాకులో విష్ణుమూర్తి ఉంటాడు.

betel plant and god hanumanతమలపాకు పైభాగంలో శివుడు, కామదేవుడు ఉంటారు.
తమలపాకులోని ఎడమవైపున పార్వతీదేవి, మాంగల్య దేవి ఉంటారు. తమలపాకుకి కుడి భాగంలో భూమాత ఉంటుంది. సుబ్రహ్మణ్య స్వామి తమలపాకు అంతటా వ్యాపించి ఉంటారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,620,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR