Home Health ఇంగువ ఎందుకు వంటల్లో వాడుతారో తెలుసా?

ఇంగువ ఎందుకు వంటల్లో వాడుతారో తెలుసా?

0
ఇంగువ వేసి వండిన వంటలను చాలామంది ఇష్టంగా తింటారు. ఇంగువ వంటలకు మంచి రుచి, వాసనను ఇస్తుంది. ఇంగువని అసఫోటిడా అని కూడా పిలుస్తారు, మన దేశంలో దీనిని సాధారణంగా ప్రతి ఇంట్లో వాడుతారు. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే ఈ ఇంగువని భార‌తీయులు ఎంతో పురాత‌న కాలం నుంచి ఉప‌యోగిస్తున్నారు. 16 వ శతాబ్దం నుండి మన దేశంలో వంటలలోఇంగువ వాడటం మొదలుపెట్టారు. అసఫోటిడా లేదా హీంగ్ ప్రాథమికంగా ఫెర్యులా అస్సా-ఫోయిటిడా అని పిలువబడే ఒక రకమైన శాశ్వత హెర్బ్ నుండి తీసుకోబడిన లేటెక్స్ గం.
  • ఇంగువ మనకు రెండు రకాలుగా మార్కెట్‌లో దొరుకుంతుంది. మొదటిది పసుపు రంగులో మసాలాల ఉండే ఇంగువ. దీనికి పసుపు లేదా బియ్యం పిండితో కలుపుతారు. ఇలా కలపడం వల్ల ఇంగువకు వుండే ఘాటైన వాసన రుచిని పెంచుతుంది. రెండవది, ఇంగువ (హీంగ్) యొక్క స్వచ్ఛమైన రూపం. సాధారణంగా అంటుకునే గోధుమ ముద్దగా లభిస్తుంది. జీర్ణ సమస్యలను నయం చేయడానికి స్వచ్ఛమైన హీంగ్‌ను యునాని, సిధా మరియు ఆయుర్వేద మెడిసిన్ తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తారు.
  • ఇంగువ (హీంగ్) లోని సహజ లక్షణాలు అనేక వ్యాధులను నయం చేయడానికి శక్తివంతంగా పనిచేస్తుంది. ఇంగువ వేయడంవల్ల వంటకాలకు రుచి మరియు వాసన రావడమే కాకుండా ఇది మన కడుపు మరియు గట్ ఆరోగ్యాని మెరుగుపరచడానికి అద్భుతంగా పనిచేస్తుంది. ఇది సహజంగా జీవక్రియను మెరుగుపరుస్తుంది. ఇంగువ‌ను ఆహారాల్లో తీసుకోవ‌డం వ‌ల్ల గ్యాస్‌, పేగుల్లో పురుగులు, ఇర్రిట‌బుల్ బౌల్ సిండ్రోమ్‌, అజీర్ణం, క‌డుపునొప్పి, క‌డుపు ఉబ్బ‌రంగా ఉండ‌డం, మ‌ల‌బ‌ద్ద‌కం, డ‌యేరియా, అల్స‌ర్లు వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.
  • ముఖ్యంగా ఇంగువ కార్మినేటివ్, యాంటీ వైరల్, యాంటీ బాక్టీరియల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ, ఉపశమన మరియు మూత్రవిసర్జన లక్షణాలు, జీర్ణ క్రియ కు సంభందించిన వ్యాదులని నయం చేయడమే కాకుండా, రక్తపోటును తగ్గించడంలో హీంగ్ సహాయపడుతుంది. ఇంగువ మన శరీరంలో రక్తం మందంగా తయారు కాకుండా రక్తాన్ని పలచగా చేస్తుంది. దీని వల్ల మన శరీరంలో రక్తపోటు బాలన్స్ గా ఉంటుంది. ఇంగువ‌లో యాంటీ వైర‌ల్‌, యాంటీ బ‌యోటిక్‌, యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు ఉంటాయి. అందువ‌ల్ల శ్వాస‌కోశ స‌మ‌స్య‌ల నుంచి విముక్తి క‌లుగుతుంది.
  • శ‌రీరంలో అధికంగా ఉండే మ్యూక‌స్ క‌రుగుతుంది. దీంతోపాటు బాక్టీరియా ఇత‌ర సూక్ష్మ‌క్రిములు న‌శిస్తాయి. శ‌రీర రోగ నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది. బ్రాంకైటిస్‌, ఆస్త‌మా, కోరింత ద‌గ్గు వంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారికి ఇంగువ ఎంత‌గానో మేలు చేస్తుంది. ఇంగువ‌ను తీసుకోవ‌డం వ‌ల్ల స్త్రీల‌కు వారి అనారోగ్య స‌మ‌స్య‌లు రాకుండా ఉంటాయి. రుతు స‌మ‌యంలో అధికంగా ర‌క్త‌స్రావం కాకుండా ఉంటుంది. పీరియడ్స్ టైం లో వచ్చే కడుపు నొప్పిని నయం చేస్తుంది, తలనొప్పిని తగ్గిస్తుంది, ఉబ్బసం నుండి ఉపశమనం కలిగిస్తుంది. అలాగే సంతాన లోపం, ముందుగానే ప్ర‌స‌వ నొప్పులు రావ‌డం వంటి స‌మ‌స్య‌లు ఉండ‌వు.
  • దంతాలు, చెవుల నొప్పి ఉన్న‌వారికి ఇంగువ ఎంత‌గానో మేలు చేస్తుంది. ఒక గ్లాస్ నీటిలో కొద్దిగా ఇంగువ‌ను క‌లిపి నోట్లో ఆ నీరు పోసి బాగా పుక్కిలిస్తే దంతాల నొప్పి త‌గ్గుతుంది. అలాగే కొబ్బ‌రినూనె, ఇంగువ‌ను క‌లిపి ఆ మిశ్ర‌మాన్ని రెండు చుక్క‌ల మోతాదులో చెవుల్లో వేస్తే చెవి నొప్పి త‌గ్గుతుంది. ఇంగువ‌లో ఉండే యాంటీ ఇన్‌ఫ్లామేట‌రీ గుణాలు నొప్పులు, వాపుల‌ను త‌గ్గిస్తాయి. ఛాతీ కంజెక్షన్ ని కూడా నయం చేయడానికి ఇది మరింత సహాయపడుతుంది. కీటకాల కరిచినప్పుడు కూడా ఇది నయం చేస్తుంది.

Exit mobile version