Do You Know Why Gandadari Cursed Sri Krishna after the End of Kurukshetra?

0
2644

మహాభారతంలో కురుక్షేత్ర యుద్ధం ముగిసేవరకు కూడా శ్రీకృష్ణుడు పాండవుల పక్షానే ఉంటాడు. అయితే కౌరవుల అహంకారానికి, అసూయ చేష్టల కారణంగా పాండవుల చేతిలో వధించబడుతారనేది దైవ నిర్ణయం. మరి కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తరువాత గాంధారి ఎందుకు శ్రీ కృష్ణుడిని శాపం పెడుతుంది? దానికి అయన ఏమని సమాధానం చెప్పాడనే విషయాలను మనం ఇప్పుడు తెలుసుకుందాం.

Gandadari Cursed Sri Krishna

కురుకేత్ర యుద్ధం ముగిసి కౌరవుల అంతం జరిగిన తరువాత వ్యాసమహాముని ధృతరాష్ట్రుణ్ణి తో, రాజా ఒకనాడు దేవసభకు వెళ్ళాను నేను. దేవతలతో, మహామునులతో మట్లాడుతున్న సమయంలో భూదేవి ఏడుస్తూ అక్కడికి వచ్చి  నా భారం తొలగిస్తానని మీరంతా బ్రహ్మసభలో ప్రతిజ్ఞలు పలికారు. ఇప్పుడిలా ఎందుకు ఆలస్యం చేస్తున్నారో తెలీడం లేదు. ఇంక నా భారం తొలిగే మార్గమేమిటి? అని దేవతలను ఆమె ప్రశ్నించింది.  అప్పుడు ఆయన ధృతరాష్ట్రుడనే రాజుకు నూరుగురు కొడుకులు పుడతారు. వాళ్ళలో పెద్దవాడైన దుర్యోధనుడి వల్ల నీ భారమంతా నశిస్తుంది. వాణ్ణి చంపడానికీ, రక్షించడానికీ ముందుకు వచ్చి భూమిమీద వున్న రాజులంతా సేనలతో సహా కురుక్షేత్రంలో హతులవుతారు. ఆ దుర్యోధనుడు కూడా తమ్ములతో పాటు మరణిస్తాడు. అంతటితో నీ భారం తీరిపోతుంది. వెళ్ళు! నిశ్చింతగా భూతధారణం చెయ్యి అని చెప్పుతాడు. అలా చెప్పిన తరువాత నారాయణుడు విన్నావు కదా రాజా కౌరవులు నాశనమయ్యారంటే బాధపడకు విధిని ఎవరు తప్పించలేరు అని చెప్పగానే ధృతరాష్ట్రుడు ధైర్యం తెచ్చుకుని గాంధారినీ, కుంతినీ, కోడళ్ళనూ వెంటపెట్టుకుని యుద్ధభూమికి బయలుదేరాడు.

Gandadari Cursed Sri Krishna

పెదతండ్రి వస్తున్నాడని తెలిసి ధర్మనందనుడు ముందే అక్కడికి వెళ్ళాడు. అతని వెంట తమ్ములూ ద్రౌపదీ కృష్ణుడూ కూడా వున్నారు. కళ్ళనీళ్ళు కారుస్తూ మౌనంగా తల వంచుకున్నాడు ధర్మరాజు. ధృతరాష్ట్రుడి పాదాలకు నమస్కరించాడు. తరువాత పాండవులు కృష్ణసహితంగా వెళ్ళి గాంధారికి నమస్కరించారు. శత్రువుల్ని చంపొచ్చు. కాని ఈ గుడ్డివాళ్ళిద్దరికీ ఊతకర్రగా ఒక్కణ్ణయినా మిగల్చకుండా అందర్నీ నాశనం చేశారే! మీకు అపకారం చెయ్యనివాడు వందమందిలో ఒక్కడైనా లేకపోయాడా? ఒక్కణ్ణి అట్టేపెడితే మీ ప్రతిజ్ఞ భంగమౌతుందా? అ ఒక్కడూ మిమ్మల్ని రాజ్యం చెయ్యనివ్వకుండా అడ్డగిస్తాడా అంటూ కోపానికి గురైన ఆమె కృష్ణుడితో  కృష్ణా! కౌరవ పాండవ కుమారులు తమలో తాము కలహించుకున్నప్పుడు నువ్వు నచ్చచెప్పకపోయావు. కదన రంగాన కాలూనినప్పుడూ నువ్వు అడ్డుపడకపోయవు. సమర్ధుడవై వుండి కూడా ఉపేక్ష చేశావు. అందర్నీ చంపించావు. దేశాలన్నీ పాడుబెట్టావు. జనక్షయానికి కారకుడైన జనర్థనా! దీని ఫలం నువ్వు అనుభవించవలసిందే. నా పాతివ్రత్య పుణ్యఫల తపశ్శక్తితో పలుకుతున్నాను  నువ్వు వీళ్ళందర్నీ ఇలా చంపావు కనుక ఈనాటికి ముప్ఫై ఆరో సంవత్సరంలో నీ జ్ఞాతులు కూడా వీళ్ళలాగే పరస్పరం కలహించుకుని చస్తారు. అదే సమయాన నువ్వు దిక్కులేక నీచపు చావు చస్తావు. మీ కుల స్తీలు కూడా ఇలాగే అందర్నీ తలుచుకుని ఏడుస్తారు. ఇది ఇలాగే జరుగుగాక  అని శపించింది గాంధారి.

Gandadari Cursed Sri Krishna

అప్పుడు కృష్ణుడు, ఈ శాపం యాదవులకు ఇది వరకే ఇచ్చారు కొందరు మునులు. నువ్విప్పుడు చర్చిత చర్వణం చేశావు. యదువంశీయులను దేవతలు కూడా చంపలేరు. అందుచేత వాళ్ళలో వాళ్ళే కొట్టుకు చస్తారు అంటూ సమాధానాన్ని నవ్వుతూ చెప్పాడు.

Gandadari Cursed Sri Krishna

ఈవిధంగా పుత్రశోకానికి గురైన గాంధారి నూరు మంది కొడుకులు చనిపోయారనే బాధలో శ్రీకృష్ణుడిని శపిస్తుంది.