ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తో పోలిస్తే జ‌పాన్ దేశ‌వాసులు ఆరోగ్యంగా ఎందుకు ఉంటారో తెలుసా ?

ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక దేశాల్లోని ప్ర‌జ‌లు త‌మ అభిరుచులు, ఆహార‌పు అల‌వాట్ల‌కు అనుగుణంగా నిత్యం ఆహారం తీసుకుంటుంటారు. ఇక వారి జీవ‌న‌విధానం కూడా భిన్నంగా ఉంది. అయితే ప్ర‌పంచంలోని అన్ని దేశాల‌తో పోలిస్తే.. జ‌పాన్ దేశ‌వాసులు ఆరోగ్యంగా ఉంటారు. అవును.. నిజ‌మే.. అందువ‌ల్లే ఆ దేశం ప్ర‌పంచంలోనే ఆరోగ్య‌వంత‌మైన దేశంగా పేరుగాంచింది. అమెరికాలో స‌గ‌టున 100 మందికి 31 శాతం మంది ఒబెసిటీతో బాధ‌ప‌డుతుండ‌గా.. జ‌పాన్‌లో మాత్రం అది 3.5 శాతంగా ఉంది. అంటే.. జ‌పాన్ వాసులు త‌మ ఆరోగ్యంపై ఏవిధంగా దృష్టి పెడుతున్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

Healthy Foodజపానీయుల ఆరోగ్య రహస్యం ఏమిటో తెలుసుకోవడానికి ఇటీవల జపాన్‌లో ఓ సర్వే నిర్వహించారు. అక్కడ యువతరమే ఎక్కువగా ఉన్నారని తేల్చారు. వయసు మళ్లినా వారిలో వృద్ధాప్య ఛాయలు రావడం లేదని సర్వేలో నిర్ధారించారు. ఆ సర్వే ఆహారపు అలవాట్లు, వ్యాయామం తదితర అంశాలపై నిర్వహించడం జరిగింది. ఇందులో ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చాయి. జపాన్ ప్రజలు కేలరీలు తక్కువ, పోషకాలు ఎక్కువగా ఉండే ఆహారాన్ని తీసుకుంటున్నారు. చిన్నప్పటి నుంచే మంచి పోషక విలువలున్న ఆహారం తీసుకుంటున్నారు.

Japanese Dietనిజానికి జ‌పాన్‌లో ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య‌, ఆహార క్ర‌మ‌శిక్ష‌ణ ఎక్కువ‌. వారు అనారోగ్యాల‌ను క‌లిగించే జంక్ ఫుడ్‌ను ఎక్కువ‌గా తిన‌రు. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారాన్నే ఎక్కువ‌గా తింటారు. చిన్న‌త‌నంలోనే పిల్ల‌ల‌కు పోష‌కాహారం తీసుకోవ‌డం, జంక్‌ఫుడ్‌కు దూరంగా ఉండ‌డం.. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహార‌పు అలవాట్ల‌ను, జీవ‌న‌విధానాన్ని క‌లిగి ఉండ‌డం.. త‌దిత‌ర అంశాల‌పై అవ‌గాహ‌న క‌ల్పిస్తారు. అందువ‌ల్ల వారికి చిన్న‌ప్పుడే ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం ఏది, అనారోగ్య‌క‌ర‌మైన ఆహారం ఏది.. అనే విష‌యాల‌పై ప‌రిపూర్ణ అవ‌గాహ‌న వ‌స్తుంది. అనారోగ్య స‌మ‌స్య‌ల‌ను క‌లిగించే జంక్ ఫుడ్ జోలికి వారు దాదాపుగా వెళ్ల‌రు.

Junk Foodజపాన్ ప్రజల డైట్‌లో ఎక్కువగా గింజలు, ధాన్యాలు, కాయగూరలు, సముద్ర చేపలు, పాలు, పండ్లు ఉంటున్నాయి. హెర్బల్ టీ కూడా ఆరోగ్యాన్ని పెంచుతుంది. ఇవన్నీ అధిక బరువును తగ్గించేవే. జపాన్ ప్రజలు అధికంగా కూరగాయలు తింటుంటారు. వీటిలో పోషకాలు ఎక్కువ. శరీరంలోని వ్యర్థాల్ని తరిమికొట్టే యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి కూరగాయలు, ఆకుకూరల్లో ఎక్కువగా ఉంటాయి.

Japanese Dietబ్రకోలి, కాలీ ఫ్లవర్, మొలకలు, చైనీస్ క్యాబేజీ వంటివి ఆరోగ్యాన్ని కాపాడుతున్నాయి. వాటితో పాటు జపాన్ ప్రజలు సముద్ర ఆహారం ఎక్కువగా తింటున్నారు. చేపల్ని బాగా తింటారు. చేపల్లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. చర్మం ముడతలు పడకుండా, జుట్టు రాలిపోకుండా కాపాడుతుంది. ప్రతి రోజు ఉదయం లేచాక గ్లాసుడు నీళ్లు తాగుతారు. దాంతో కడుపులోని మలినాలు తొలగిపోతాయి. వాళ్ల డైట్ విధానం పాటిస్తే యాభైలలోకి అడుగుపెట్టినా యువకులుగానే ఉంటారని సర్వే చేసిన సంస్థ వెల్లడించింది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR