Home Health జంక్ ఫుడ్ అనుకొని ఈ హెల్దీ ఫుడ్ కూడా తినడం మానేస్తున్నారా?

జంక్ ఫుడ్ అనుకొని ఈ హెల్దీ ఫుడ్ కూడా తినడం మానేస్తున్నారా?

0

ఫాస్ట్ ఫుడ్ మరియు జంక్ ఫుడ్ ని ఇష్టపడని వారు ఈ జనరేషన్ లో ఉండరేమో. ఫాస్ట్ ఫుడ్ లేదా జంక్ ఫుడ్ అనగానే నోట్లో నోరూరి, మనల్ని అవి తినేలా టెంప్ట్ చేస్తాయి. అందుకే డైటింగ్ చేసేవారు కూడా తరచూ “చీట్ మీల్” పేరుతో ఇలాంటి అనారోగ్యకరమైన ఆహారాన్ని జిహ్వచాపల్యం కొద్దీ లాగించేస్తారు. కానీ దాని పేరులోనే ఉందిగా జంక్ అంటే చెత్త అని.. అంటే మనం తినే ఆహారంలో ఉండాల్సిన పోషకాలు, విటమిన్లు, ఫైబర్ వంటివి ఏవీ లేకుండా కేవలం సారంలేని హై కెలరీ ఫుడ్ నే మనం జంక్ ఫుడ్ అని ముద్దుగా పిలుచుకుంటాం. చిన్నా-పెద్దా, ఆడా-మగాకు అత్యంత ఫేవరెట్ ఫుడ్ అంటే ఈ జంక్ ఫుడ్డే. ఫుడ్డీలే కాదు ఈ జంక్ ఫుడ్ టేస్ట్ కు అడిక్ట్ అయ్యేవారు క్రేవింగ్స్ తో సతమతమవుతుంటారు.

junk foodవీటిలో యాడెడ్ షుగర్స్ ఎక్కువగా ఉంటాయి, అంతేకాదు సాల్ట్, శాచురేటెడ్ ట్రాన్స్ ఫ్యాట్ అత్యధికంగా ఉంటాయి. కొన్ని అధ్యయనాల్లో జంక్ ఫుడ్ కు మనం ఎంత బానిసలవుతామంటే ఇది ఆల్కహాల్, డ్రగ్స్ లానే మనల్ని తనవైపుకు తిప్పుకుంటుందని తేలింది కూడా. అయితే జంక్‌ ఫుడ్‌.. పేరు వినగానే ఆరోగ్యప్రియులు గుబులు చెందుతారు. ఎక్కడ జంక్‌ ఫుడ్‌ తినాల్సి వస్తుందో, తమ ఆరోగ్యానికి ఇబ్బందులు ఎదురవుతాయోనని భయపడతారు. అందుకే జంక్‌ఫుడ్‌ తినేందుకు చాలా మంది విముఖత వ్యక్తం చేస్తుంటారు.

అయితే పలు జంక్‌ ఫుడ్‌ ఐటమ్స్‌ మాత్రం అలా కాదు. వాటిని తింటే ఆరోగ్యకర ప్రయోజనాలే తప్ప, అనారోగ్య సమస్యలు కలగవు. అవును, మీరు విన్నది నిజమే. అయితే అలాంటి లాభాలనిచ్చే హెల్దీ జంక్‌ ఫుడ్స్‌ ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం… జంక్ ఫుడ్ లో మొదటగా వినిపించేది పిజ్జా. అయితే అన్ని పిజ్జాలు జంక్ ఫుడ్ కాదట. పిజ్జాలో కేవలం టమాటా పిజ్జా మాత్రమే ఆరోగ్యకరం. ఎందుకంటే టమాటాల్లో పుష్కలంగా ఉండే లైకోపీన్‌ అనబడే యాంటీ ఆక్సిడెంట్‌ మనకు ఆరోగ్యకరమైన ప్రయోజనాలను ఇస్తుంది. మిగతా పిజ్జాలన్నీ జంక్ ఫుడ్ గానే గుర్తించాల్సి ఉంటుంది.

పాప్‌కార్న్‌ను అందరూ జంక్‌ ఫుడ్‌ అనుకుంటారు. కానీ కాదు. ఎలాంటి ఫ్లేవర్‌ కలపకుండా అలాగే తయారు చేయబడిన సాధారణ పాప్‌ కార్న్‌ జంక్‌ ఫుడ్‌ కాదు. దాన్ని నిర్భయంగా తినవచ్చు. అలాంటి పాప్‌కార్న్‌ను తింటే చాలా తక్కువ క్యాలరీలు లభిస్తాయి. అంతేకాదు, ఆ పాప్‌కార్న్ లో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. పాప్‌కార్న్‌లో ఉండే ఫైబర్‌ ఆకలిని నియంత్రిస్తుంది. జీర్ణ సమస్యలను లేకుండా చేస్తుంది.

పీనట్‌ బటర్‌ అంటే.. పల్లీల నుంచి తయారుచేయబడేది. దీన్ని జంక్‌ ఫుడ్‌ గా భావిస్తారు. కానీ కాదు. నిజానికి ఈ బటర్‌ మనకు ఎంతో శ్రేయస్కరం. ఇందులో విటమిన్‌ ఇ, మెగ్నిషియం, యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. వారంలో రెండు సార్లు పీనట్‌ బటర్‌ను తిన్నా చాలు, అనేక లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా మహిళలు దీన్ని తింటే అధికంగా బరువు పెరిగే అవకాశం తక్కువగా ఉంటుందని అధ్యయనాలు చెబుతున్నాయి. చాలా మంది పీనట్‌ బటర్‌లో కొవ్వు ఉంటుందని అనుకుంటారు. అయితే అది నిజమే అయినప్పటికీ అవన్నీ మోనో అన్‌శాచురేటెడ్‌, పాలీ అన్‌శాచురేటెడ్‌ కొవ్వులు. ఇవి మనకు ఆరోగ్యకరమైన కొవ్వులే. కనుక భయపడాల్సిన పనిలేదు.

ఇక పిల్లలని జంక్ ఫుడ్ తరహాలోకే వస్తాయని చాకోలెట్లకు దూరంగా ఉండమని చెబుతాం. అయితే అన్ని చాకొలెట్లు ఆరోగ్యకరమైనవి కావు. కానీ డార్క్‌ చాకొలెట్స్‌ మాత్రం ఆరోగ్యకరమైనవే. వాటిల్లో అధిక శాతం కోకో ఉంటుంది. అందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు గుండెకు మేలు చేస్తాయి. ఇక రెడ్‌వైన్‌ అన్ని ఆల్కహాల్‌ పానీయాల్లా కాదు. ఈ వైన్‌లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి గుండె జబ్బులు, క్యాన్సర్‌ వంటి వ్యాధులు రాకుండా చూస్తాయి. అలాగే శరీరం వాపులకు గురి కాకుండా చూసే యాంటీ ఇన్‌ఫ్లామేటరీ గుణాలు రెడ్‌ వైన్‌లో ఉంటాయి.

Exit mobile version