గ్రీన్ టీ తాగడానికి టీ బ్యాగ్స్ వాడుతున్నారా?

టెక్నాలజీ మనుషులను ఎంత బద్ధకంగా మార్చిందంటే… ప్రతీది మనం కూర్చున్న చోటుకే రావాలి. క్షణాల్లో పనులన్నీ అయిపోవాలి. ఆఖరికి తినే తిండి కూడా క్షణాల్లో రెడీ అయిపోవాలి. చాలామంది ఈజీ కుక్కింగ్ ప్రాసెస్ కు అలవాటు పడిపోతున్నారు. అలా వచ్చినవే ఈ ప్రజర్ కుక్కర్స్. అసలు కుక్కర్స్ లో వండిన అన్నం తినొద్దు మొర్రో అని చెప్పినా..ఏం చేస్తాం..గ్యాస్ మీద వండేంత టైం లేదు. అంత ఓపిక కూడా లేదు.
అదైతే పెట్టేసి వేరే పని చూసుకొవచ్చు అంటున్నారు. అలానే టీ తాగడానికి కూడా చాలామంది పౌడర్స్ కంటే..బ్యాగ్ లనే ప్రిఫర్ చేస్తున్నారు. గిన్నె పెట్టి టీ పెట్టి మరిగించి, వాడకట్టుకొని తాగేంత టైం లేదు. అంత ఓపిక కూడా లేదు. అందుకే ఇన్స్టాంట్ టీ బ్యాగ్స్ వాడుతుంటారు. ముఖ్యంగా గ్రీన్ టీ. గ్రీన్ టీ ఆరోగ్యానికి మంచిదే..కానీ బ్యాగ్స్ లో ఉండేది తాగటం అసలు మంచిది కాదట. అనారోగ్యాన్ని కోరితెచ్చుకున్న వాళ్లవుతారంటున్నారు నిపుణులు.
సాధారణంగా చాలామంది పొద్దున్న లేవగానే వేడి వేడి కాఫీ లేదా టీ తాగుతుంటారు.
టీ తాగదానిదే ఏ పని మొదలుపెట్టలేరు. అయితే మనం ఇంట్లో చక్కగా మనకు నచ్చిన టీ పొడి వేసుకొని టీ తాగితే పర్వాలేదు. కానీ… బయట అందుబాటులో దొరుకుతున్నాయి కదా అని… కాఫీ లేదా టీ , గ్రీన్ టీ పొడిలకు సంబంధించిన టీబ్యాగులు ఇంటికి  తెచ్చేసుకుంటారు. త్వరగా అవుతాయని చెప్పి పొడికి బదులుగా వాటి బ్యాగులను వాడుతుంటారు.
ప్రస్తుతం జరుగుతున్న పరిశోధన ప్రకారం, చిక్కంతా టీలో లేదు.. టీ బ్యాగులోనే ఉంది. కార్పొరేట్‌ ఆఫీసుల్లో రిలీఫ్ కోసం కప్పుల మీద కప్పులు టీ, కాఫీలు తాగుతుంటారు. అయితే టీలో ఎన్నిరకాలున్న టీ బ్యాగు మాత్రం ఒకటే కాబట్టి ఎలాంటి టీ తాగినా అనారోగ్యం బారిన పడక తప్పదంటున్నారు నిపుణులు. ఎందుకంటే సదరు కాఫీ లేదా టీ బ్యాగ్స్ మన శరీరానికి హాని కలిగిస్తాయని ఇటీవలే జరిగిన పరిశోధనల్లో తేలింది.
పలువురు సైంటిస్టులు చేసిన ప్రయోగాల్లో ఒక టీ బ్యాగ్‌ 11 బిలియన్ మైక్రో ప్లాస్టిక్ అంటే 11వందల కోట్ల మైక్రో ప్లాస్టిక్, దాంతో పాటు 3బిలియన్ నానో ప్లాస్టిక్ కణాలను విడుదల చేస్తుందని గుర్తించారు. కాఫీ, టీ బ్యాగులను నైలాన్, పీవీసీ, ఎపిక్లోరోపైడ్రిన్, థర్మో ప్లాస్టిక్, పాలిప్రొపెలిన్, ప్లాస్టిక్ వంటి పదార్థాలతో తయారు చేస్తారు. ఈ క్రమంలో సదరు బ్యాగులను వేడి వేడి పాలు, లేదా నీటిలో ముంచినప్పుడు వాటి నుంచి ప్రమాదకరమైన రసాయనాలు వెలువడి ఆ ద్రవంలో కలుస్తాయి.
ముఖ్యంగా ఈ రసాయనాలు కార్సినోజెన్ల జాబితాకు చెందుతాయని సైంటిస్టులు చెబుతున్నారు. కార్సినోజెన్లు అంటే క్యాన్సర్ కారకాలే. అవి క్యాన్సర్ వ్యాధులను కలగజేస్తాయి. మనం మామూలుగా అయితే టీబ్యాగ్‌తో తయారైన టీలో వీటిని చూడలేం. కానీ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారా పరిశోధకులు వీటిని గుర్తించారు. అందుకే మార్కెట్‌లో మనకు దొరికే కాఫీ, టీ బ్యాగులను వాడకూడదని, పొడిని మాత్రమే వాడాలని వారు చెబుతున్నారు.
గత కొన్ని సంవత్సరాలుగా టీ బ్యాగ్ లతోనే గ్రీన్ టీను తాగేవాళ్లు ఎందరో ఉన్నారు. ఇకనైనా వాటిని మానేసి టైం పట్టినా పొడినే ప్రిఫర్ చేయండి. అయితే ఈ టీ బ్యాగ్స్ తో కూడా కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. గ్రీన్‌ లేదా బ్లాక్ టీ బ్యాగ్‌ ను కళ్ల వాపులు, మంటలను వచ్చినప్పుడు ఉపయోగిస్తే కళ్లకి రిలీఫ్ ఇస్తుంది. టీలో ఉండే యాంటీ ఇరిటెంట్‌ గుణాలు కళ్ల చుట్టూ ఉండే వాపును తగ్గిస్తాయి. దానికోసం వాడేసిన 2 టీ బ్యాగులను 30 నిమిషాలపాటు ఫ్రిజ్‌లో ఉంచాలి. తర్వాత కళ్ల మీద ఉంచుకోవాలి. అలా 10 నిమిషాలపాటు టీ బ్యాగులను కళ్ల మీద ఉంచుకుని తీస్తే.. కళ్ల మంటలు తగ్గుతాయని నిపుణులు చెబుతున్నారు.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR