ముఖంపై మచ్చలను తగ్గించాలని టూత్ పేస్ట్ వాడుతున్నారా?

0
267

అందంగా కనిపించడం కోసం ఆడవాళ్లు ఎన్ని ప్రయత్నాలైన చేస్తారు. ఇంటర్నెట్ లో చూసి ఏవేవో చిట్కాలు వాడుతుంటారు. ఏవేవో ముఖానికి రాస్తుంటారు. అందులో టూత్ పేస్ట్ కూడా ఒకటి. పూర్వంలో మహిళలు ముఖానికి చక్కగా నలుగు పెట్టుకునే వారు. కానీ ఇప్పుడు చర్మం కోసం రకరకాలా క్రీములు, చిట్కాలు పాటిస్తున్నారు.

toothpaste to reduce blemishes on the faceఅయితే అవి పని చేస్తే మంచిదే కానీ వాటి వలన ఫలితం లేకపోగా ఎన్నో సమస్యలు ఎదురవుతున్నాయి. కొంతమంది ఈ చిట్కాలను ప్రయత్నిస్తూ చర్మాన్ని మరింత పాడు చేసుకుంటారు. కొందరు మొటిమలు తగ్గాలని ముఖానికి టూత్‌ పేస్ట్‌ ను పూస్తుంటారు. ఇంకొందరు ముఖ సౌందర్యం కోసం బేకింగ్‌ సోడా, ఉప్పు వాడుతుంటారు. అయితే ఇలాంటివి వాడితే నష్టమే అంటున్నారు వైద్యులు.

toothpaste to reduce blemishes on the faceసాధారణంగా టూత్‌పేస్ట్‌లో సోడా, మెంథాల్, షాంపూ, సల్ఫర్ ఉంటుంది. ఇవి దంతాలపై రాసినా… దంతాలు గట్టిగా ఉంటాయి కాబట్టి ఏం కాదు. కానీ ముఖంపైనున్న చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి టూత్ పేస్ట్ రాసినప్పుడు తాత్కాలికంగా ఆ సమస్య తగ్గినా ఫ్యూచర్‌లో ఇబ్బందులు తప్పవు.

toothpaste to reduce blemishes on the faceటూత్‌పేస్ట్‌లో కాల్షియం కార్బోనేట్‌ ఉంటుంది. ఇది గోడలకు వేసే సున్నం, సిమెంట్‌ ప్లాస్టర్‌లో కూడా ఉంటుంది. మొటిమలపై పేస్ట్‌ రాస్తే అక్కడ చర్మాన్ని మరింత చికాకు పెడుతుందని వైద్యులు చెబుతున్నారు. దాని వల్ల మచ్చలు ఏర్పడతాయని చెబుతున్నారు. పేస్ట్‌లోని కెమికల్స్ ముఖంపైనున్న చర్మాన్ని పొడిబార్చి మరింత సమస్యకు గురిచేస్తుంది. దీని వల్ల సమస్య మరింత తీవ్రతరమవుతుంది. కాబట్టి ముఖానికి టూత్ ‌పేస్ట్ ముఖంపై రాయడం మంచిది కాదని చెబుతున్నారు నిపుణులు.

 

SHARE