కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉందా? మీకు ఈ జాగ్రత్తలు తప్పనిసరి!

షుగర్ అనేది ఒక తీవ్రమైన అనారోగ్య సమస్య. ఒకసారి డయాబెటిస్ వచ్చిందంటే అది జీవితాంతం కొనసాగుతుంది. ఇది ఎవరికైనా రావచ్చు. ఏటా 10 లక్షల మందిని ఈ వ్యాధి బలితీసుకుంటోంది. రక్తప్రవాహంలోకి వచ్చే గ్లూకోజ్ మొత్తాన్నీ శక్తిగా మార్చే ప్రక్రియకు ఆటంకం కలిగినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. అంటే మనం ఆహారం తిన్నప్పుడు.. పిండిపదార్థాలను మన శరీరం ముక్కలుగా చేసి చక్కెరగా మారుస్తుంది. దానిని గ్లూకోజ్‌గా వ్యవహరిస్తారు. క్లోమంలో ఉత్పత్తి అయ్యే ఇన్సులిన్ అనే హార్మోన్.. ఆ చక్కెరను శక్తి కోసం లీనం చేసుకోవాలని మన శరీర కణాలకు నిర్దేశిస్తుంది.
ఈ ఇన్సులిన్ ఉత్పత్తి కానపుడు.. లేదంటే అది సరిగా పనిచేయనపుడు రక్తంలో చక్కెర పోగుపడుతుంది. అలా మధుమేహం వస్తుంది. అయితే ఇది కేవలం షుగర్ తోనే ఆగిపోదు. గుండె పోటు, స్ట్రోక్, అంధత్వం, మూత్రపిండాలు విఫలమవడం, పాదాలు, కాళ్లు తొలగించాల్సి రావటం వంటి పరిణామాలకు దారితీయగలదు. అంతేకాదు డయాబెటీస్ అనేది అంటువ్యాధిలా మారిపోయింది. ప్రపంచవ్యాప్తంగా మిలియన్ కంటే ఎక్కువ మంది ఈ డయాబెటీస్ తో బాధపడుతున్నారు.
ఇది కుటుంబంలో ఎవరికైనా ఉంటే చాలా ఇబ్బందికర పరిస్థితే. ఎందుకంటే వంశపారంపర్యంగా ఇది సోకే ప్రమాదం ఉంది. ఒకవేళ పేరెంట్స్ కి లేదా తోబుట్టువులకు ఎవరికైనా టైప్ టు డయాబెటీస్ ఉంటే.. జీవితంలో ఎప్పుడో ఒకసారి డయాబెటీస్ వచ్చే అవకాశాలున్నాయి. ఇతర అనారోగ్య సమస్యల కంటే టైప్ టు డయాబెటీస్ అనేది జన్యుపరంగా రావడానికి ఎక్కువ అవకాశాలున్నాయి. కాబట్టి ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతుంటే ముందుగానే దాన్ని అరికట్టే ప్రయత్నం చేయాలి. సహజమైన రెమిడీస్ తో డయాబెటీస్ ని నిరోధించవచ్చు.
అంటే ఆరోగ్యకరమైన ఆహార నియమాలు, క్రియాశీలమైన జీవనశైలితో రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుకోవచ్చు. కుటుంబ సభ్యుల్లో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతుంటే.. ముందుగా చేయాల్సిన పని.. మంచి డైట్ ఫాలో అవడం. ఫైబర్ ఫుడ్, తృణధాన్యాలు, గుండెకు మేలు చేసే ఆహారాలను డైట్ లో చేర్చుకోవాలి. ఈ మూడు రకాల ఆహార పదార్థాలను డైట్ లో చేర్చుకుంటే.. మధుమేహం రాకుండా కాపాడుకోవచ్చు.
ఇంట్లో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే.. అది వేగంగా ఇతరులకు వ్యాపించడానికి కారణమవతాయి. కాబట్టి కుటుంబంలో ఎవరికైనా డయాబెటిస్ ఉంటే ఆహరం విషయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి. శ్యాచురేటెడ్ ఫుడ్స్, ఫ్యాట్ ఫుడ్స్ ని అసలు తీసుకోకూడదు.  ఆరోగ్యకరమైన, తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారం తీసుకోవడం చాలా మంచిది.
అలాగే డయాబెటీస్ ని నిరోధించడానికి వ్యాయామం చాలా అవసరం. స్విమ్మింగ్, మెట్లు ఎక్కుడం, జిమ్ కి వెళ్లడం వంటి వ్యాయామాలు రెగ్యులర్ గా చేయడం వల్ల డయాబెటీస్ ని నియంత్రించవచ్చు. రోజుకి కనీసం 30 నిమిషాలు వ్యాయామం చేయాలని నిపుణులు సూచిస్తారు.
మద్యంతాగడం, పొగతాగడం వంటి అలవాట్ల కారణంగా టైప్ 2 డయాబెటీస్ కి కారణమవుతాయి. ముఖ్యంగా వంశపారంపర్యంగా వేగంగా సోకే అవకాశాలు ఎక్కువ. కాబట్టి ఈ అలవాట్లు ఉంటే నెమ్మదిగా మానేయడం మంచిది.
ఒత్తిడి రకరకాల అనారోగ్య సమస్యలకు కారనమవుతుంది. ప్రశాంతంగా ఉండటానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా డయాబెటీస్ ఉన్నప్పుడు ఒత్తిడి సాధ్యమైనంత వరకు దరిచేరకుండా చూసుకుంటే డయాబెటిస్ కు దూరంగా ఉండవచ్చు.
ఫ్యామిలీలో ఎవరికైనా మధుమేహం ఉన్నప్పుడు బీపీ కంట్రోల్ లో ఉండేలా జాగ్రత్త పడాలి. హై బ్లడ్ ప్రెజర్ కారణంగా టైప్ టు డయాబెటీస్ కి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి.
చక్కెర తీసుకోవడం ఎంత తగ్గిస్తే అంతమంచిది. షుగర్ కి బదులు తేనె, బెల్లం వంటివి తీసుకుంటూ ఉండాలి. ఫ్యామిలీలో ఎవరైనా డయాబెటీస్ తో బాధపడుతున్నప్పుడు చక్కెర తీసుకోవడంలో చాలా జాగ్రత్త వహించాలి. అలాగే వాడే నూనెల విషయంలో కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆలివ్ ఆయిల్, కొబ్బరి నూనె వంటివి ఆరోగ్యానికి మంచిది. కాబట్టి వీటినే తీసుకోవాలి. ఇందులో ఫ్యాట్ తక్కువగా ఉంటుంది… ఆరోగ్యానికీ మంచిది.

Related Articles

Stay Connected

1,378,511FansLike
640,000FollowersFollow
1,650,000SubscribersSubscribe

Latest Posts

MOST POPULAR