ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలో తెలుసా ?

0
190

మన సంప్రదాయంలో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది నమస్కారం. అతిథులు, పెద్దవాళ్లు, గొప్పవారు, అపరిచితులు ఇలా ఎవరు మనకు తారసపడిన వారిని పలకరించేందుకు ముందుగా చేసే సంజ్ఞ నమస్కారు. రెండు చేతులు జోడించి సవినియంగా పలకరిస్తూ ఎదుటివారి ఆదరణ చూరగొంటారు.

నమస్కారంనమస్కారం అనేది కేవలం భారతీయ సంస్కారం మాత్రమే కాదు, మన సంస్కృతిలో భాగం. ఇది ఒక గౌరవసూచకం. మనషులందరిలోనూ దైవత్వము ఉంటుందని హిందువులు నమ్ముతారు. దీనినే ఆత్మ అంటారు. నమస్కారం పెట్టడం అంటే మన ఆత్మ ఎదుటి వ్యక్తిలోని ఆత్మను గుర్తించి దానికి విధేయత ప్రకటించడం.

నమస్కారంకానీ, ప్రతి నమస్కరానికి ఒక విధానం ఉంది. అందరికీ ఒకేలా చేతులెత్తి దండం పెట్ట కూడదట. ఎదుటి వ్యక్తి ఎవరూ అనే దాన్ని బట్టి మనం చేసే నమస్కారం ఉండాలట. ఎవరికీ ఏ విధంగా నమస్కారం చేయాలి అనే విషయాలను ఇప్పుడు పరిశీలిద్దాం… మనం నిత్యం తల్లిదండ్రులకు, గురువుకి, అతిధులకి అందరికంటే ముఖ్యంగా ఆ పరమాత్మకు నమస్కారం చేస్తాం. అయితే దేవుళ్లకు చేసే నమస్కారాలు ఒక విధంగా ఉంటాయి గౌరవపూర్వకంగా మనుషులకు చేసే నమస్కారం మరో రకంగా ఉంటుంది.

నమస్కారంశివకేశవులకు నమస్కరించేటపుడు తల నుంచి 12అంగుళాల ఎత్తున చేతులు జోడించి నమస్కరించాలి. అంటే చేతులెత్తి నమస్కరించాలి. ఒక హరిహరులకు తప్ప మిగతా ఏ దేవతలకు శిరసు మీద చేతులు జోడించి నమస్కరించకూడదట.

నమస్కారంగురువుకి వందనం చేసేటప్పుడు ముఖానికి నేరుగా చేతులు జోడించి నమస్కరించాలి. తండ్రికి, ఇతర పెద్దలకు నోటి నేరుగా చేతులు జోడించాలి. యోగులకు, మహానుభావులకు వక్షస్థలం వద్ద చేతులు జోడించి నమస్కరించాలి. తల్లికి నమస్కరించేటపుడు ఉదరమున నేరుగా చేతులు జోడించి నమస్కరించాలని మన శాస్త్రాలు చెప్తున్నాయి.

 

SHARE