Home Health స్టెరాయిడ్స్ వాడకపోయినా బ్లాక్ ఫంగస్ వస్తుందా?

స్టెరాయిడ్స్ వాడకపోయినా బ్లాక్ ఫంగస్ వస్తుందా?

0

కరోనా రెండో వేవ్ సమయంలో బ్లాక్ ఫంగస్ కేసులు ఎక్కువగా నమోదవడం చూసాం. బ్లాక్ ఫంగస్ అనేది కోవిడ్ అనంతర రోగులలో విస్తృతంగా వ్యాపించే భయంకరమైన వ్యాధి. కరోనా వచ్చి తగ్గిన వారిలో… వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. ఆ సమయంలో బ్లాక్ ఫంగస్ సోకే ప్రమాదం ఎక్కువ. ఇది పాతదే అయినప్పటికీ ఈ కరోనా సమయంలో దేశవ్యాప్తంగా కేసులు ఎక్కువగా కనిపిస్తున్నాయి.

black fungus”బ్లాక్ పంగస్ అనేది వైరస్ కాదు. అలాగే అంటువ్యాధి కూడా కాదు. ఇది కొంతమందికి మాత్రమే వచ్చే వ్యాధి. ఎక్కువ షుగర్ లెవెల్స్ ఉన్నవారికీ, కరోనా తగ్గి ఇమ్యూనిటీ లెవల్స్ తక్కువగా ఉన్నవారిలో ఈ సమస్య వస్తోంది. కోవిడ్ చికిత్స సమయంలో అధికంగా స్టెరాయిడ్ వాడటం, ఆక్సిజన్‌ అందించేప్పుడు పరికరాలు పరిశుభ్రంగా లేకపోవడం కూడా ఈ వ్యాధికి కారణమవుతాయని నిపుణులు చెబుతున్నారు.

ఆక్సిజన్ అందించే ప్రక్రియలో ఉపయోగించే హ్యుమిడిఫయర్‌లో స్టెరైల్‌ వాటర్‌కు బదులుగా సాధారణ నీటిని ఉపయోగించడం వలన ఫంగస్ ఏర్పడుతుంది. ఆక్సిజన్‌తో పాటు ఈ ఫంగస్ కూడా చేరడం వలన కోవిడ్ పేషెంట్లు బ్లాక్ ఫంగస్ బారిన పడే అవకాశం ఉందని అంటున్నారు. ​ఈ ఫంగస్ అధిక మోతాదులో స్టెరాయిడ్లు మరియు యాంటీబయాటిక్స్ వాడిన రోగులపై ఒకేసారి దాడి చేస్తుందని నిపుణులు చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఆశ్చర్యకరంగా ఇది హోమ్ ఐసోలేషన్ లో స్టెరాయిడ్ చికిత్స లేకుండా వ్యాధి నుండి బయటపడిన పోస్ట్ కోవిడ్ రోగులలో కూడా వ్యాప్తి చెందుతోందని తాజా పరిశోధనలు చెబుతున్నాయి. దాని ప్రకారం పోస్ట్ కోవిడ్ రోగులలో కూడా మ్యూకోమైకోసిస్ పెరుగుతున్నట్లు వైద్యులు వెల్లడించారు. ఇటీవలే ఇద్దరు 25-30 వయస్సు గల రోగులు హోమ్ ఐసోలేషన్ ద్వారా చికిత్స పొందారు.. వారికి స్టెరాయిడ్ లేదా ఆక్సిజన్ తీసుకున్న చరిత్ర లేదు.

అలాగే మధుమేహం లేనివారు కూడా అకస్మాత్తుగా ఈ భయంకరమైన వ్యాధి బారిన పడ్డారు. మరి ఇది ఎలా, ఎక్కడ నుండి వచ్చిందో తెలుసుకోవడానికి వైద్యులు చేసిన పరిశోధనల్లో ఆశ్చర్య పరిచే నిజాలు బయట పడ్డాయి. కరోనా బారి నుండి తప్పించుకోవడానికి మాస్కు ధరిస్తుంటారు. అది N95 లేదా కాటన్ మాస్క్ కావచ్చు, అయితే దీనిని ఎక్కువసార్లు ఉపయోగిస్తుంటారు. ఒకసారి దానిని ధరిస్తే, శ్వాసలోని తేమ కారణంగా, అది తడిసిపోతుంది, అది మనకు అనిపించదు.

కొందరు మాస్కులను 3-5 రోజులు ఉపయోగిస్తుంటారు.. ఇది ఫంగస్ పెరుగుదలకు సరైన వాతావరణం కల్పిస్తుంది. కాబట్టి మాస్కును వేడినీటిలో కడిగి ఎండలో ఆరబెట్టాలి. అలాగే ఎవరికైనా కళ్లు, ముక్కు చుట్టూ ఎర్రబడటం, ఒకవైపు దవడ వాయడం, నాలుకపై నల్లటి మచ్చలు ఉంటే… అది బ్లాక్ ఫంగస్‌గా అనుమానించాల్సి ఉంటుందని, ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెప్తున్నారు.

Exit mobile version